Home /News /business /

YOUR HOME LOAN APPLICATION REJECTED HERE IS WHAT YOU SHOULD DO NOW SU GH

Home Loan: మీ హోమ్ లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించారా?.. అయితే ఈ విషయాలపై దృష్టి పెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎలాంటి కారణం లేకుండా మీ హోమ్ లోన్ అప్లికేషన్లు డిక్లైన్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే రుణాన్ని తిరిగి ఎలా పొందాలో తెలుసుకోవచ్చు.

మన దేశంలో ప్రతి ఏటా 40 శాతం కంటే ఎక్కువ హోమ్‌లోన్ అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతున్నాయని మీకు తెలుసా? లెక్కలేనన్ని దరఖాస్తులకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు చూపుతున్న ఆర్థిక సంస్థలు.. ఖాతాదారులకు నిరాశను మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేవారు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని తిరస్కరణలు సాంకేతిక సమస్య వల్ల జరుగుతాయి. అదనపు సమాచారాన్ని ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. సాధారణంగా మీ క్రెడిట్ స్కోరు, లోన్ టూ-వాల్యూ(LTV) నిష్పత్తి, తిరిగి చెల్లించే సామర్థ్యం కారణంగా ఈ తిరస్కరణలు జరుగుతాయి. అయితే ఎలాంటి కారణం లేకుండా మీ హోమ్ లోన్ అప్లికేషన్లు డిక్లైన్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుంటే రుణాన్ని తిరిగి ఎలా పొందాలో తెలుసుకోవచ్చు.

లోన్ ఎందుకు ఆమోదం పొందలేదో తెలుసుకోండి..
గృహరుణం కోసం తిరిగి దరఖాస్తు చేసుకునేముందు అసలు లోన్ ఎందుకు ఆమోదం పొందలేదో తెలుసుకోవడం ముఖ్యం. మీ రుణదాతతో మాట్లాడి మీ అనుమానాలు, ప్రశ్నలు నివృత్తి చేసుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలను ఓ లేఖ రూపంలో పొందాలి. కేవలం రెండు నెలల్లోపు వ్యవధిలోనే ఈ ప్రశ్నలను అడగాలి. ఇవి తర్వాత లోన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయాల్లో ఉపయోగపడతాయి.

మీ క్రెడిట్ రిపోర్టును అంచనా వేయండి..
చాలా మంది భారతీయులు తమ క్రెడిట్ స్కోరు గురించి స్పష్టంగా తెలుసుకోరు. కానీ రుణదాతలు మీ రుణాలు, లోన్ తిరిగి చెల్లించిన హిస్టరీని తప్పకుండా చూస్తారనేది వాస్తవం. ఎందుకంటే తుదినిర్ణయాలు తీసుకోవడంలో బ్యాంకులు క్రెడిట్ స్కోరుపైనే ఎక్కువగా ఆధారపడతాయి. ఎందుకంటే మీరు గతంలో డబ్బును ఎలా మేనేజ్ చేశారో ఇది సూచిస్తుంది. క్రెడిట్ హిస్టరీలో మీరు తీసుకున్న క్రెడిట్‌ల సంఖ్య, టైంలైన్, వినియోగం, ఓవర్ లిమిట్ వంటివి ఉంటాయి. గత 12 నెలల్లో మీ రీపేమెంట్ విధానం ఎలా ఉందనేది వీటిలో ముఖ్యమైంది. కాబట్టి సమయానుసారం రుణాన్ని చెల్లించడం వల్ల రుణం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ అప్పు, ఆదాయాన్ని అంచనా వేయండి..
మీరు హోంలోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు రుణదాత మీ ఆదాయం, ఉద్యోగ మార్పు ఫ్రీక్వెన్సీని చూస్తారు. ఇది మీ నెలవారీ ఆదాయం, నెలవారీ అప్పుల కంటే 70 శాతం అధికంగా ఉండాలి. అంతేకాకుండా నెలవారీగా రుణం చెల్లింపులను చేయగలగాలి. అయితే మీ ఆదాయం.. రుణదత కనీసం అవసరాలకు అనుగుణంగా లేకపోతే హోంలోన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంటుంది. ఇది కాకుండా మీ అప్పు నుంచి ఆదాయం (Debt to Income-DTI) నిష్పత్తి ఎక్కువగా ఉండటం ఇంకో కారణం కావచ్చు. నెలవారీ ఆదాయం ద్వారా మీ రుణ చెల్లింపులను విభజించడం ద్వారా దీన్ని లెక్కించవచ్చు.

మీ డౌన్ పేమెంట్ మొత్తాన్ని పెంచండి..
మీరు ఇంటిని ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత రుణదాత మీ అన్ని లోన్ యాక్టివిటీస్‌ను సమీక్షిస్తారు. అంతేకాకుండా లోన్ ఎలా క్లోజ్ చేయాలో దానిపై స్పష్టంగా తెలియజేస్తారు. మీరు పేర్కొన్న నిధులతో ముందుకు రాలేకపోతే మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బ్యాంకులు సాధారణంగా 80 శాతం కంటే ఎక్కువ లోన్ టూ వ్యాల్యూ (LTV) ఇవ్వవు. అప్పుడు 20 శాతం మొత్తం మీరు సొంతంగా సమకూర్చుకోవాలి. ఇలాంటప్పుడు మీరు బంధువుల నుంచి బహుమతి రూపంలో పొందవచ్చు. మీరు డౌన్ పేమెంట్ కోసం కనీస నిధులను ఏర్పాటు చేసేవరకు వేచి ఉండటం మరో పరిష్కార మార్గం.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Home loan, Housing Loans

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు