తగ్గనున్న కేబుట్ టీవీ ధరలు.. వినియోగదారులకు ట్రాయ్ ఊరట..?

TRAI | DTH, Cable Bills | కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా ట్రాయ్ చర్యలు ప్రారంభించింది. డీటీహెచ్, కేబుల్ కంపెనీలు ఛానళ్ల ధరలను మరోసారి సమీక్షించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

news18-telugu
Updated: August 20, 2019, 12:51 PM IST
తగ్గనున్న కేబుట్ టీవీ ధరలు.. వినియోగదారులకు ట్రాయ్ ఊరట..?
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 20, 2019, 12:51 PM IST
ఒక్కో ఛానల్‌కు ఒక్కో రేటు.. అలా ఓ పది ఛానళ్లు కలిపితే బోలెడంత. డీటీహెచ్ ప్యాకేజీ ధరలు భారీగా పెరిగిపోయాయి. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడింది. అయితే, ఆ విధానం వల్ల వినియోగదారులపై విపరీతమైన భారం పడిందని గుర్తించిన ట్రాయ్ స్వయంగా రంగంలోకి దిగింది. కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు ఊరట కలిగించేలా చర్యలు ప్రారంభించింది. డీటీహెచ్, కేబుల్ కంపెనీలు ఛానళ్ల ధరలను మరోసారి సమీక్షించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 16వ తేదీలోగా ధరల తగ్గింపుపై అభిప్రాయాలు, ప్రతిపాదనలు వెల్లడించాలని కోరింది.

మరోవైపు, బొకే ఛానళ్లపైనా ట్రాయ్ దృష్టి సారించింది. కొన్ని కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తూ బొకే ఛానళ్లను అందిస్తున్నాయి. పరోక్షంగా వాటిని తీసుకోవాలని వినియోగదారులకు ఎర వేస్తున్నాయి. దీంతో అలాంటి వాటికి చెక్ పెట్టాలని ట్రాయ్ భావిస్తోంది.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...