హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఈ బిజినెస్‌తో లాభాలు పక్కా..! గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ ఆదాయం..!

Business Ideas: ఈ బిజినెస్‌తో లాభాలు పక్కా..! గవర్నమెంట్ జాబ్ కంటే ఎక్కువ ఆదాయం..!

X
పౌల్ట్రీ

పౌల్ట్రీ బిజినెస్ లో లాభాలు ఆర్జిస్తున్న విశాఖ యువకుడు

ప్రస్తుతం యువత అంతా చాలా మంది ఉద్యోగాల కంటే సొంతవ్యాపారంపైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి చూసి విసుగుచెందుతున్నారు. ప్రైవేట్స్ జాబ్స్ ‌లో ఒత్తిడి తట్టుకోలేక సొంత వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Setti Jagadeesh, News 18, Visakhapatnam

ప్రస్తుతం యువత అంతా చాలా మంది ఉద్యోగాల కంటే సొంతవ్యాపారంపైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి చూసి విసుగుచెందుతున్నారు. ప్రైవేట్స్ జాబ్స్ ‌లో ఒత్తిడి తట్టుకోలేక సొంత వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఒకరి దగ్గర ఉద్యోగం కంటే సొంతంగా బిజినెస్ చేసుకోవడమే ఉత్తమం అంటూ యువత బిజినెస్‌ పై దృష్టిసారిస్తున్నారు. ఈ తరహాలోనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి నాని సొంతంగా బిజినెస్ చేస్తూ బ్రాయిలర్ కోళ్ల ఫారం ఉంటే చాలు ప్రభుత్వ ఉద్యోగం అవసరం కూడా లేదంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగాలపై విసిగి చెందిన యువకుడు గట్రెడ్డి నాని. తన వద్ద ఉన్న రెండు లక్షల రూపాయలు వుంటే బ్యాంకులో ఆరు లక్షల రూపాయలు లోన్ తీసుకొని బ్రాయిలర్ ఫామ్ బిజినెస్ ప్రారంభించాడు. ఈ బిజినెస్ కు లాభాలు తప్ప నష్టాలు ఉండవని అంటున్నారు.

దీనికి రోజుకు 4 గంటలు కేటాయిస్తే చాలు. ఆ తర్వాత ఇతర పనులు కూడా చేసుకోవచ్చు అంటున్నారు నాని. కోళ్ల ఫారం పెట్టాలంటే ముందుగా ఏం చేయాలి.. యువకుడు గట్టెడ్డి నాని బిజినెస్ ఐడియా ప్రకారం 5 వేల కోళ్లు కెపాసిటీ ఉన్న షెడ్ నిర్మాణానికి దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. రెండు షెడ్డులు, ఐరన్ మెష్, ఇతర సామాగ్రి మొత్తం ఇందులోనే వస్తాయి. షెడ్డు నిర్మాణం పూర్తైన తర్వాత చాలా పౌల్ట్రీ కంపెనీలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏదేని కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలి. వెన్ ‌కాబ్, సుగుణ, స్నేహ వంటి పౌల్ట్రీ కంపెనీలతో అగ్రీమెంట్ చేసుకోవచ్చు.

ఇది చదవండి: రూపాయి పెట్టుబడి లేదు.. లాభాలు మాత్రం సూపర్.. ఆ పంట ఇదే..!

ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ కంపెనీ వారే బ్రాయిలర్ కోడి పిల్లలు ఇస్తారు. మనం ఏర్పాటు చేసిన షెడ్ల వద్దకు తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాటికి అవసరమైన దాణా, రోగాల బారినపడకుండా ఇంజెక్షన్స్ కూడా వారే సప్లై చేస్తారు. కంపెనీలు చెప్పిన విధంగా వాటిని పెంచి.. వారికి ఇవ్వడం జరుగుతుంది. అలా మనం పెంచినందుకు కంపెనీవారు కమిషన్ ఇస్తారు. మనం 45 రోజులపాటు పెంచిన కోళ్లు ఒక సైజుకు వచ్చిన తర్వాత కంపెనీ వారే వాహనాన్ని షెడ్డు వద్దకు పంపించి.. కోళ్లను తీసుకెళ్తారు.

ఆదాయం వివరాలు:

5 వేల సామర్థ్యంతో పౌల్ట్రీ ఫామ్ పెట్టాడు గట్రెడ్డి నాని. దాదాపు 45 రోజులకు మనం పెంచే బ్యాచ్ పూర్తవుతుంది. కోళ్లు సుమారు రెండు కేజీల బరువు పెరుగుతాయి. అన్ని కోళ్లు ఒక్కొక్కటి 2 కేజీల చొప్పున చూసుకుంటే అప్పుడు షెడ్‌లో ఉన్న మొత్తం కోళ్ల బరువు 10 వేల కేజీలు వస్తాయి. కంపెనీ వారు కోడికి ఒక్కొ కేజీకి 6 రూపాయలు చొప్పున కమిషన్ ఇస్తే నాని కి రూ.60వేలు వస్తాయి. వారి సాధారణ ఖర్చులకు రూ.10 వేలు పోయినా.. రూ.50వేలు మిగులుతాయి. కోళ్లు బిజినెస్ తో జాగ్రత్తలు తీసుకుంటూ కోడి పిల్లల పెంపకంపై దృష్టి సారిస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని నాని అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Business Ideas, Local News, Visakhapatnam