హోమ్ /వార్తలు /బిజినెస్ /

త్వరలో Insurance Premiumలో డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే..

త్వరలో Insurance Premiumలో డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యం కాపాడుకునే వెల్‌నెస్‌ కార్యక్రమాలు చేసేవారు చెల్లించే బీమా ప్రీమియానికి రివార్డు పాయింట్లు ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్ఢీఏఐ అనుమతించింది. ఈ రివార్డు పాయింట్ల ద్వారా.. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకునేప్పుడు డిస్కౌంట్ పొందవచ్చు.

ఇంకా చదవండి ...

వ్యాయామం, యోగాలాంటి ఫిట్ నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) సరికొత్త ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసింది. ఆరోగ్యం కాపాడుకునే వెల్‌నెస్‌ కార్యక్రమాలు చేసేవారు చెల్లించే బీమా ప్రీమియానికి (Insurance Premium) రివార్డు పాయింట్లు ఇచ్చేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్ఢీఏఐ అనుమతించింది. ఈ రివార్డు పాయింట్ల ద్వారా.. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకునేప్పుడు డిస్కౌంట్ పొందవచ్చు. తుది మార్గదర్శకాలు విడుదల చేసే ముందు బీమా కంపెనీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఐఆర్ఢీఏఐ (IRDAI) ముసాయిదా మార్గదర్శకాలు పంపించింది.

వెల్‌నెస్ కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు అనుమతించాలని బీమా కంపెనీలు కొంతకాలంగా ఐఆర్ఢీఏఐను కోరుతున్నాయి. దీంతో ఆరోగ్యం (Health) కాపాడుకునే కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా పాలసీదారుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు. పాలసీదారులను ప్రోత్సహించేందుకు, నిర్థిష్ఠ స్థాయిలను చేరుకునేందుకు ఈ రివార్డులు ఉపయోగపడతాయని ఐఆర్ఢీఏఐ తెలిపింది.

అయితే ఇలాంటి వెల్‌నెస్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని పాలసీదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. వారు స్వచ్ఛందంగా మాత్రమే పొల్గొనే స్వేచ్ఛ ఉంటుందని ఐఆర్ఢీఏఐ స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనల ప్రకారం బీమా సంస్థలు నేరుగా లేదంటే కొన్ని సంస్థల సహకారంతో కూడా నిర్వహించవచ్చు. పాలసీదారులకు వెల్‌నెస్‌ కార్యక్రమాలు అనేవి ఇన్సూరెన్స్ పాలసీలో ఒక ఆప్షన్ గా ఉంటుంది. అంటే రైడర్ తరహాలో ఉంటుంది.

ఇప్పటికే ఉన్న పాలసీలకు ఈ కార్యక్రమాలను యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇవి పాలసీ ధరలను ఎలాంటి ప్రభావితం చేయవు. నిబంధనల ప్రకారం పాలసీదారుడు అతను అనుసరిస్తున్న వెల్‌నెస్‌ కార్యక్రమాలను వివరించాల్సి ఉంటుంది. పాలసీదారుల నుంచి వివరాలు తీసుకున్న తరువాత మెడికల్ కేంద్రాలు ఇచ్చే నివేదికల ఆధారంగా వారికి రివార్డు పాయింట్లు ఇస్తారు. పాలసీదారులు యోగా కేంద్రాలు, జిమ్స్, స్పోర్ట్స్ క్లబ్బుల్లో డిస్కౌంట్లు పొందేలా బీమా కంపెనీలు రిడీమ్ చేసుకునే వోచర్లను కూడా అందించవచ్చు.

ఇలాంటి సేవలను అందించేటప్పుడు బీమా కంపెనీలు పాలసీదారులకు కొన్ని రైడర్లను కూడా సూచించాలని ఐఆర్ఢీఏఐ తెలిపింది. ఎలాంటి వెల్‌నెస్‌ కార్యక్రమాన్ని నమోదు చేయకుండా పాలసీ అందించడం కుదరదని ముసాయిదా మార్గదర్శకాల్లో ఐఆర్ఢీఏఐ స్పష్టం చేసింది.

వివిధ వెల్‌నెస్‌ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు, కొలతల ప్రమాణాలు, పాలసీదారులు ఫిట్‌నెస్‌లో సాధించిన విజయాల ఆధారంగా రివార్డు పాయింట్లు ఇవ్వాలని పేర్కొంది. వెల్‌నెస్‌ కార్యక్రమాలు చేయడం ద్వారా పాలసీదారులకు కలిగే ప్రయోజనాలను అప్లికేషన్లో ముందుగానే తెలియజేయాలని ఐఆర్ఢీఏఐ ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. వెల్‌నెస్‌ కార్యక్రమాలకు రివార్డు పాయింట్లు అందించే విషయంలో ఎలాంటి వివక్ష ఉండరాదని కూడా ఐఆర్ఢీఏఐ ముసాయిదా మార్గదర్శకాల్లో సూచించింది.

KCR-KTR: కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. వాటిపై నిర్ణయం కేటీఆర్‌దేనా ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి ‘ముందస్తు’ మాటల వెనుక మాస్టర్ ప్లాన్ ?

వెల్‌నెస్‌ కార్యక్రమాలు అందించే థర్డ్ పార్టీల సేవల నాణ్యతపై బీమా కంపెనీలు బాధ్యత తీసుకోవద్దని కూడా ఐఆర్ఢీఏఐ సూచించింది. కానీ వెల్‌నెస్‌ సంస్థలు అందించే సేవల నాణ్యతను బీమా కంపెనీలు పర్యవేక్షించడంతోపాటు, వాటి సేవల నాణ్యతను తెలుసుకునేందుకు తగిన మెకానిజమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. థర్డ్ పార్టీ సేవలు అందించడానికి బీమా కంపెనీలు ఎలాంటి రుసుములు స్వీకరించవు. నగదీకరణ చేసుకునే రివార్డు పాయింట్లు కాకుండా బీమా కంపెనీలు థర్డ్ పార్టీ సేవలు అందించే వారికి ఎలాంటి చెల్లింపులు చేయకూడదని ఐఆర్ఢీఏఐ ముసాయిదా మార్గదర్శకాల్లో సూచించింది.

First published:

Tags: Insurance

ఉత్తమ కథలు