హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Update: ఆధార్ కొత్త రూల్.. ఇకపై అలా చేయాల్సిందే.. వారికి మాత్రం మినహాయింపు!

Aadhaar Update: ఆధార్ కొత్త రూల్.. ఇకపై అలా చేయాల్సిందే.. వారికి మాత్రం మినహాయింపు!

ఆధార్ కార్డు ఉన్న వారికి కొత్త రూల్.. ఇకపై అలా చేయాల్సిందే.. వారికి మాత్రం మినహాయింపు!

ఆధార్ కార్డు ఉన్న వారికి కొత్త రూల్.. ఇకపై అలా చేయాల్సిందే.. వారికి మాత్రం మినహాయింపు!

Aadhaar Biometrics | ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్. ఆధార్ కార్డులో (Aadhaar Card) బయోమెట్రిక్స్ వివరాలను అప్‌డేట్ చేసుకుంటున్నారా? పదేళ్లకు ఒకసారి అప్‌డేట్ చేసుకునేలా కొత్త రూల్స్ రావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్ కార్డు కలిగిన వారు పూర్తి స్వచ్చందంగానే వివరాలను అప్‌డేట్ చేసుకుంటున్నారు. యూఐడీఏఐ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Aadhaar Card | ఆధార్ కార్డు కలిగిన వారికి ముఖ్యమైన అలర్ట్. కొత్త రూల్ అమలులోకి రాబోతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆధార్ (Aadhaar) కార్డుదారులు వారి బయోమెట్రిక్స్ డేటాను పదేళ్లకు ఒకసారి అప్‌డేట్ చేసుకోవాలనే రూల్స్ రావొచ్చని నివేదికలు వెలువడుతున్నాయి.

  ప్రస్తుతం యూఐడీఏఐ స్వచ్ఛందంగానే ఆధార్ కార్డుదారులు డేటాను అప్‌డేట్ చేసుకోమని చెబుతూ వస్తోంది. ఇది పూర్తిగా ఆధార్ కార్డు కలిగిన వారి ఇష్టం. అప్‌డేట్ చేసుకుంటే చేసుకోచ్చు. లేదంటే లేదు. నివేదికల ప్రకారం చూస్తే.. ఆధార్ కార్డు దారులు వారి ఫేస్, ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుందని యూఐడీఏఐ అధికారులు పేర్కొంటున్నారు. 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి ఈ రూల్ నుంచి మినహాయింపు కల్పించే అవకాశం ఉంది.

  ఎస్‌బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ చార్జీలు తొలగించిన బ్యాంక్

  ప్రస్తుతం పిల్లల వయసు ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉంటే.. వాళ్లు కచ్చితంగా బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లల వయసు ఐదేళ్లకు లోపు ఉంటే మాత్రం వారికి వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా చిన్న పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు. వీటిని బాల ఆధార్ అని పిలుస్తారు.

  స్మార్ట్‌‌టీవీపై రూ.19 వేల డిస్కౌంట్.. రూ.28 వేల టీవీ రూ.8,500కే కొనేయండి

  ఇలా బాల ఆధార్ పొందాలంటే పిల్లల బర్త సర్టిఫికెట్ కచ్చితంగా కావాలి. బాల ఆధార్ కార్డులు బ్లూ రంగులో ఉంటాయి. సాధారణ ఆధార్ కార్డుల మాదిరి ఉండవు. ఈ ఆధార్ కార్డులు చిన్న పిల్లలకు ఐదేళ్లు వచ్చేంత వరకే ఉంటాయి. తర్వాత ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి కచ్చితంగా బయోమెట్రిక్స్‌తో ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల కాలంలో ఏకంగా 79 లక్షల మంది పిల్లలకు (0-5 ఏళ్లు వయసు) ఆధార్ కార్డును జారీ చేసింది.

  ప్రభుత్వం ప్రకారం చూస్తే.. మార్చి 31 నాటికి పైన పేర్కొన్న వయసు గ్రూప్‌లో 2.64 కోట్ల మంది పిల్లలు బాల ఆధార్ కార్డులను కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు జూలై నాటికి వీటి సంఖ్య 3.43 కోట్లకు చేరింది. కాగా ఆధార్ కార్డు కలిగిన వారు బయోమెట్రిక్స్ డేటాను అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే గ్రామాల్లో ఆధార్ ద్వారా డబ్బులు విత్‌డ్రా చేసుకునే వారికి అప్‌డేట్ చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. ఫింగర్‌ప్రింట్ అథంటికేషన్ సులభంగానే పూర్తవుతుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Aadhaar Card, AADHAR, UIDAI

  ఉత్తమ కథలు