Volvo Price Hike | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కార్ల ధరలు (Car Price) భారీగా పెరిగాయి. ఏకంగా రూ.లక్షకు పైగా పైకి చేరాయి. దీంతో కారు కొనాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ ఏడాది ఇప్పటికే చాలా కార్ల (Cars) కంపెనీలు వాటి మోడళ్ల ధరలను పెంచేశాయి. కార్ల ధరలు 2 నుంచి 3 రెట్లు పైకి చేరాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి వోల్వో కూడా వచ్చి చేరింది.
ప్రీమియం, లగ్జరీ కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతూ వస్తున్న వోల్వో తాజాగా కార్ల ధరలను పెంచేసింది. మూడు కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటి ధర రూ. 1.6 లక్షల వరకు పైకి చేరింది. ఎక్స్‌సీ40 రీచార్జ్ పీ8 అల్టిమేట్, ఎక్స్‌సీ60 బీ5 అల్టిమేట్, ఎక్స్‌సీ90 బీ6 అల్టిమేట్ కార్ల ధరలు పెరిగాయి. వీటి ప్రారంభం ధర రూ. 56.90 లక్షల నుంచి రూ. 96.50 లక్షల దాకా ఉంది.
ఎస్బీఐ భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.25 వేల తగ్గింపు!
వోల్వో కంపెనీ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ40 రీచార్జ్ పీ8 అల్టిమేట్ ధరను రూ.లక్ష మేర పెంచేసింది. ఇది వరకు ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 55.9 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దీని రేటు రూ. 56.90 లక్షలకు చేరింది. అలాగే ఎక్స్‌సీ60 బీ5 అల్టిమేట్ ప్రారంభ ధర ఇదివరకు రూ. 65.9 లక్షలుగా ఉంది. అయితే ఇప్పుడు ఈ కారు ధర రూ. 66.5 లక్షలకు పెరిగింది. అంటే కారు రేటు రూ. 60 వేలు పైకి చేరిందని గుర్తించాలి.
14 రోజులు సెలవులు.. డిసెంబర్ నెలలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ఇదే! ఏపీ, తెలంగాణలో మాత్రం..
ఇంకా ఎక్స్‌సీ90 బీ6 అల్టిమేట్ కారు ఎక్స్‌షోరూమ్ ధర ఇప్పుడు రూ. 96.5 లక్షలుగా ఉంది. ఇదివరకు ఈ కారు ప్రారంభ ధర రూ. 94.90 లక్షలుగా ఉండేది. అంటే ఈ కారు రేటు రూ. 1.6 లక్షలు పైకి చేరింది. మిగతా వాటి కన్నా ఈ కారు ధరనే ఎక్కువగా పెరిగింది. వోల్వో కార్ల ధరల పెంపు నిర్ణయం నవంబర్ 24 నుంచే అమలులోకి వచ్చింది. అంటే నవంబర్ 24 కన్నా ముందు కారును బుక్ చేసకున్న వారికి ధరల పెంపు వర్తించదు. పాత రేటుకే కొత్త కారు కొనుగోలు చేయొచ్చు. తర్వాత బుక్ చేసుకున్న వారికి ధరల పెంపు వర్తిస్తుంది. కాగా వోల్వో కంపెనీ మన దేశంలో ఎక్స్‌సీ 60, ఎక్స్‌సీ 90, ఎక్స్‌సీ 40, ఎక్స్‌సీ 40 రీచార్జ్, ఎస్ 90 కార్లను దేశీయంగానే అసెంబుల్ చేస్తోంది. అలాగే కంపెనీ వచ్చే ఏడాది కొత్త కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. సీ40 రీచార్జ్ దీని పేరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car prices, Cars, Luxury cars