ఇటీవల కాలంలో బ్యాంక్ సేవలు (Banking services) విస్తృతమయ్యాయి. ఇప్పుడు ప్రతి అవసరానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చాలా సేవలు ఆన్లైన్లో (Online service) అందుబాటులోకి వచ్చాయి. అయితే బ్యాంకులు అందిస్తున్న కొన్ని రకాల సేవలు పూర్తి ఉచితం కాదు. లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ (SMS), ఐఎంపీఎస్ ఫండ్ ట్రాన్స్ఫర్, చెక్ క్లియరెన్స్, ఏటీఎంలో మనీ విత్‌డ్రా.. వంటి సేవలకు బ్యాంకులు ఛార్జీ (Bank Service Charges) వసూలు చేస్తున్నాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
* ఏటీఎం లావాదేవీలు
బ్యాంకుల్లో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఏటీఎం (ATM) సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే ఈ సర్వీస్‌ను కూడా పరిమితంగానే ఉచితంగా అందుబాటులో ఉంది. బ్యాంకులు నిర్దేశించిన దఫాల కంటే ఎక్కువ సార్లు ఏటీఎం సేవలను వినియోగించుకున్నట్లయితే బ్యాంకులు ఛార్జీలను (Bank Charges) వసూలు చేస్తాయి. అయితే అన్ని బ్యాంకుల ఏటీఎం ఛార్జీలు ఒకేలా ఉండవు. సాధారణంగా ఏటీఎం సేవలకు బ్యాంకులు రూ. 20-50 వరకు ఛార్జీ (Bank Service Charges) వసూలు చేస్తాయి.
* ఎస్ఎంఎస్ సర్వీస్
బ్యాంకు ఖాతా ఉన్నవారు లావాదేవీలను జరుపుతుంటారు. ఖాతాలో నగదు క్రెడిట్ లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంకు సదరు కస్టమర్‌కు అలర్ట్ మెసేజ్ పంపుతుంది. ఈ సేవలకు కూడా బ్యాంకులు ఛార్జీ (Bank Service Charges) వసూలు చేస్తాయి. అయితే ఈ రకమైన సర్వీస్‌కు ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. అన్ని బ్యాంకులు ఒకే రకమైన ఛార్జీ వసూలు చేయవు. యాక్సిస్ బ్యాంక్ నెలకు దాదాపు రూ. 5 ఎస్ఎంఎస్ ఛార్జీ వసూలు చేస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ప్రతి త్రైమాసికానికి రూ.15 ఛార్జీ వసూలు చేస్తోంది.
* నగదు లావాదేవీలు
ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు నగదు లావాదేవీల సర్వీస్‌ను అందిస్తుంది. అయితే నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే ఈ సర్వీస్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతి బ్యాంకు ఒకే రకమైన ఛార్జీ వసూలు చేయవు. ఈ ఛార్జీలు బ్యాంకు నిబంధనల ప్రకారం మారుతూ ఉంటాయి. సాధారణంగా ప్రభుత్వరంగ బ్యాంకులు నగదు లావాదేవీలపై రూ. 20 నుంచి రూ.100 వరకు ఛార్జీలను వసూలు చేస్తాయి.
* కార్డ్ రీప్లేస్మెంట్
ఖాతాదారులకు బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులను అందజేస్తాయి. ఒకవేళ ఏ కస్టమర్ అయినా తన డెబిట్ కార్డును పోగొట్టుకుంటే, మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ బ్యాంకును బట్టి రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది.
* మినిమం బ్యాలెన్స్
కస్టమర్లు తమ ఖాతాల్లో నిర్దిష్ట పరిమితి వరకు బ్యాలెన్స్ ఉంచాలి. అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే బ్యాంకులు ఛార్జీ వసూలు చేస్తాయి. అన్ని బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ (Minimum Balance) లిమిట్ ఒకేలా ఉండదు. అలాగే విధించే ఛార్జీ కూడా వేర్వేరుగా ఉంటాయి.
* IMPS ఛార్జీలు
NEFT, RTGS వంటి లావాదేవీలను అన్ని బ్యాంకులు కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నాయి. అయితే IMPS లావాదేవీలకు మాత్రం చాలా బ్యాంకులు ఛార్జీ వసూలు చేస్తున్నాయి. ఈ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.25 వరకు ఛార్జీ ఉంటుంది.
* చెక్ సేవలు
అన్ని బ్యాంకులు చెక్‌బుక్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే చెక్ విలువ రూ.1 లక్ష వరకు ఉంటే ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే చెక్ విలువ రూ.1 లక్ష కంటే ఎక్కువగా ఉంటే, క్లియరెన్స్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ రూ.150 వరకు ఉండవచ్చు. సేవింగ్ అకౌంట్ ఖాతాదారులకు ఎస్బీఐ బ్యాంకు కేవలం 10 చెక్కులను మాత్రమే ఉచితంగా అందిస్తుంది. అయితే మరిన్ని చెక్కులు కావాలనుకుంటే, కస్టమర్ వాటికి ధరను చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank charges, BUSINESS NEWS