Post Office Internet Banking: పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుకోవాలి

Post Office Internet Banking | పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవడానికి మీ సింగిల్ లేదా జాయింట్ సేవింగ్స్ అకౌంట్ యాక్టీవ్‌గా ఉండాలి. కేవైసీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండాలి.

news18-telugu
Updated: March 19, 2019, 3:15 PM IST
Post Office Internet Banking: పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుకోవాలి
Post Office Internet Banking: పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుకోవాలి
news18-telugu
Updated: March 19, 2019, 3:15 PM IST
మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీరు ఆ అకౌంట్‌పై ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చు. మీరు ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి మరో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకోవడానికి మీరు ebanking.indiapost.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవడానికి మీ సింగిల్ లేదా జాయింట్ సేవింగ్స్ అకౌంట్ యాక్టీవ్‌గా ఉండాలి. కేవైసీ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండాలి. ఏటీఎం, డెబిట్ కార్డ్ కూడా పనిచేస్తుండాలి. మొబైల్ నెంబర్, పాన్, ఇమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసి ఉండాలి. ఇండియా పోస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా మీరు సేవింగ్స్ అకౌంట్‌తో పాటు రికరింగ్ డిపాజిట్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఆపరేట్ చేయొచ్చు.

Read this: WhatsApp 2019 Features: ఈ ఏడాది వాట్సప్‌లో ఆకట్టుకుంటున్న 12 ఫీచర్లు ఇవే...

పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుకోవాలి



మొదట మీరు మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి.
అప్లికేషన్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.


ప్రాసెస్ విజయవంతంగా పూర్తైన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది.
ఆ తర్వాత ఎస్ఎంఎస్‌లో యూఆర్ఎల్ క్లిక్ చేసి ఇండియా పోస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ చేయాలి. "New User Activation" క్లిక్ చేయాలి.
Loading...
మీ వివరాలన్నీ పూర్తి చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవచ్చు.

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

SBI Schemes: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకుంటారా? ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్స్ ఇవే...

PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి 12 రోజులే గడువు... మార్చి 31 డెడ్‌లైన్

MI Pay: గూగుల్‌ పే, పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే'... రిలీజ్ చేసిన షావోమీ
First published: March 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...