Home /News /business /

YOU CAN MAKE WATER CANS AND EARN PROFIT UPTO RUPEES 50000 PER MONTH MK

Business Idea: ఎప్పటికీ డిమాండ్ తగ్గని వాటర్ బాటిల్ బిజినెస్, పెట్టుబడి ఎంత..ఆదాయం ఎంత వస్తుందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణ ఫిల్టర్ చేసిన నీటిని లీటర్ రూ.20 పెట్టి కొంటున్నారు ప్రజలు. 20 లీటర్ల వాటర్ కేన్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందువల్ల ఇలాంటి వ్యాపారం ప్రారంభించిన వారికి విపరీతంగా లాభాలు వస్తున్నాయి.

    Business Idea: ప్రస్తుతం ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. మన దేశంలో జులై వరకూ వేడి వాతావరణం ఉంటుంది. ఐతే... కరోనా వచ్చాక... వాటర్ బాటిళ్ల వాడకం బాగా పెరిగింది. ప్రజలు... కుండలు, హోటళ్లలో నీరు తాగట్లేదు. ఎవరికి వారు వాటర్ బాటిల్స్ కొనుక్కొని ఆ నీరే తాగుతున్నారు. దాంతో... మినరల్ వాటర్ బాటిళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ వాటర్ బాటిళ్ల వ్యాపారంలో కనిపించని లాభాలుంటాయి. సాధారణ ఫిల్టర్ చేసిన నీటిని లీటర్ రూ.20 పెట్టి కొంటున్నారు ప్రజలు. 20 లీటర్ల వాటర్ కేన్లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందువల్ల ఇలాంటి వ్యాపారం ప్రారంభించిన వారికి విపరీతంగా లాభాలు వస్తున్నాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతోంది. అదెలాగో చూద్దాం.

    ఇది కూడా చదవండి: Business Ideas: ఖర్చు తక్కువ... లాభాలు ఎక్కువ... ఇంట్లోనే చేసుకునే మంచి వ్యాపారం

    ఇలా ప్రారంభించండి:
    మీరు ఈ కంపెనీ ప్రారంభించాలంటే... కంపెనీల చట్టం ప్రకారం... మీ కంపెనీ పేరును రిజిస్టర్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ పేరు సింపుల్‌గా, జనాల నోట్లో నానేలా ఉండాలి. క్యాచీగా ఉండాలి. అప్పుడే దీనికి ప్రజలు బాగా అలవాటుపడతారు. కంపెనీ పేరు రిజిస్టర్ అయ్యాక... మీరు PAN, GST వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పత్రాల పని పూర్తయ్యాక... మీరు వాటర్ ప్లాంట్ కోసం స్థలం కేటాయించుకోవాలి. మీకు 1000 నుంచి 1500 చదరవు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. ఇందులోనే బోర్ వేసుకోవాలి. అలాగే... RO, చిల్లర్ మెషిన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ స్టోర్ చేసుకోవడానికి ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత టైమ్ పట్టే వ్యవహారమే. కానీ మంచి ఫలితాలు ఉంటాయి.

    లైసెన్స్, ISI నంబర్:
    మీరు ఈ వ్యాపారం ప్రారంభించడానికి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అలాగే... వాటర్ బాటిళ్లపై ముద్రించేందుకు ISI ప్రమాణం పొందాల్సి ఉంటుంది. మీరు ప్లాంట్ ప్రారంభించే చోట... నీటిలో TDS లెవెల్ ఎక్కువగా ఉండకూడదు. చాలా కంపెనీలు కమర్షియల్ RO ప్లాంట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్లాంట్ ధర రూ.50,000 నుంచి రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఇది మీరు కొనుక్కోవచ్చు. అలాగే మీరు 100 వాటర్ సప్లై కేన్లను కొనుక్కోవాలి. వీటిలో 20 లీటర్లు పట్టేవి బెటర్. ఈ మొత్తానికీ మీకు 4 నుంచి 5 లక్షలు అవసరం.

    బ్యాంక్ లోన్ సదుపాయం:
    ఈ వ్యాపారం కోసం కావాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తాయి. ముద్ర (Mudra) పథకంలో భాగంగా ఈ లోన్ తీసుకోవచ్చు. మీరు గంటలో 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చెయ్యగలిగితే... మీరు నెలకు రూ.50,000 దాకా సంపాదించగలరు.

    Catecoin: నెలలో 10 వేలను రూ. 2.81 లక్షలు చేసిన క్రిప్టో కరెన్సీ ఇదే..


    ఆదాయం పెంచుకోవడం ఎలా?
    మీరు 150 మంది రెగ్యులర్ కస్టమర్లను ఏర్పరచుకోగలిగితే... వారు రోజూ ఒక క్యాన్ చొప్పున నీరు వాడుతున్నట్లైతే... మీరు రోజూ 150 కేన్ల వాటర్ సప్లై చెయ్యగలరు. నెలకు 4,500 కేన్లను సప్లై చేసినట్లు అవుతుంది. ఒక్కో క్యాన్ బయట షాపుల్లో రూ.40 దాకా ఉంటోంది. మీరు రూ.25కే ఇవ్వొచ్చు. ఇలా ఇచ్చినా మీరు నెలకు రూ.1.12 లక్షలు సంపాదించగలరు. ఇందులో నెలవారీ ఖర్చులు, అద్దెలు, శాలరీలు, కరెంటు బిల్లు పోగా... మీకు రూ.50,000 దాకా లాభం ఉంటుంది.

    ఇదంతా వద్దు... ఎందుకొచ్చిన కష్టం అనుకుంటే... మీరు మరోపని చెయ్యవచ్చు. బడా కంపెనీలైన బిస్లరీ, ఆక్వాఫినా వంటివి కూడా 20 లీటర్ల క్యాన్లను సప్లై చేస్తున్నాయి. అలాంటి కంపెనీల డీలర్‌షిప్ మీరు పొందగలిగితే... మీరు ఉన్న ఏరియాలో మీరే వాటిని ప్రజలకు, షాపులకూ సప్లై చెయ్యవచ్చు. ఈ విధంగా కూడా మీకు భారీ లాభాలు ఉంటాయి. కాకపోతే... డీలర్‌షిప్‌కి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Business Ideas

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు