కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి

ప్రతీ క్రెడిట్, డెబిట్ కార్డుకు 16 అంకెల టోకెన్ కోడ్ వస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల దగ్గర ఈ యూనిక్ కోడ్ టైప్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ పూర్తవుతుంది. ఇక మీరు మీ కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: January 11, 2019, 11:48 AM IST
కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి
కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: January 11, 2019, 11:48 AM IST
మీరు ఆఫీసుకి వెళ్లగానే కంప్యూటర్ ఆన్ చేస్తారు. ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయేమోనని చెక్ చేస్తారు. ఇంతలో షాపింగ్ వెబ్‌సైట్ నుంచి వచ్చిన మెయిల్ కనిపిస్తుంది. కొత్త ప్రొడక్ట్‌కు సంబంధించిన యాడ్ అది. మీరు ఆ యాడ్ క్లిక్ చేస్తారు. ఆ ప్రొడక్ట్ నచ్చేసరికి కొందామని డిసైడ్ అవుతారు. పేమెంట్ మోడ్‌కు వచ్చాక మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలా? లేక కార్డుతో పేమెంట్ చేయాలా అన్న డైలమా ఉంటుంది. కార్డు వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే సేఫ్ కాదన్న భయం చాలామందిలో ఉంటుంది. అందుకే ఎక్కువ మంది క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకుంటారు. అయితే కొన్ని వెబ్‌సైట్లు మాత్రం అసలు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టవు. దీంతో అసలు చిక్కొస్తుంది. ఇకపై ఈ భయాలు అక్కర్లేదు. మీరు దర్జాగా కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అది కూడా మీ కార్డు నెంబర్, సీవీవీ లాంటి వివరాలేవీ చెప్పకుండా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

Credit Card Transactions, Debit Card Transactions, Credit Card Cheating, Debit Card Cheating, Tokenization system, క్రెడిట్ కార్డు మోసాలు, క్రెడిట్ కార్డు లావాదేవీలు, టోకెనైజేషన్ సిస్టమ్
నమూనా చిత్రం


ఇది కూడా చదవండి: తగ్గిన క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 10 మార్గాలు

కార్డు వినియోగదారుల్లో ఉన్న భయాలను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)... క్రెడిట్, డెబిట్ కార్డుల లావాదేవీల కోసం కొత్త నియమనిబంధనల్ని రూపొందించింది. 'టోకెనైజేషన్' అనే కొత్త విధానాన్ని తీసుకొస్తుంది. ఇందులో యూజర్ ప్రత్యామ్నాయంగా ఓ యూనిక్ కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతీ క్రెడిట్, డెబిట్ కార్డుకు 16 అంకెల టోకెన్ కోడ్ వస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల దగ్గర ఈ యూనిక్ కోడ్ టైప్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ పూర్తవుతుంది. ఇక మీరు మీ కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మీ కార్డు వివరాలు వెబ్‌సైట్‌లోకి వెళ్తాయన్న భయం కూడా లేదు. కార్డు డేటా స్కిమ్మింగ్, మోసపూరిత లావాదేవీలకు అవకాశం ఉండదు.Credit Card Transactions, Debit Card Transactions, Credit Card Cheating, Debit Card Cheating, Tokenization system, క్రెడిట్ కార్డు మోసాలు, క్రెడిట్ కార్డు లావాదేవీలు, టోకెనైజేషన్ సిస్టమ్
Photo: Reuters


ఇది కూడా చదవండి: క్రెడిట్ కార్డ్ లిమిట్ మరీ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే రిస్కే

ఈ టోకెన్లను ఆన్‌లైన్ లావాదేవీలు, యాప్‌లో ట్రాన్సాక్షన్స్, షాపుల్లో ఉండే పీఓఎస్ మెషీన్లు, క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్స్‌లకు ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మీరు ఏ లావాదేవీలకైనా ఈ టోకెన్ ఉపయోగపడుతుంది. మీరు జెనరేట్ చేసిన టోకెన్ మాత్రమే పేమెంట్ సిస్టమ్‌లో సేవ్ అవుతుంది తప్ప మీ కార్డు వివరాలకు వచ్చే ముప్పేమీ ఉండదు. వెబ్‌సైట్లు, యాప్స్, షాపుల దగ్గర మీ కార్డు వివరాలను వెల్లడించనవసరం లేదు. మొదట్లో మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ ద్వారా మీ క్రెడిట్, డెబిట్ కార్డులకు యూనిక్ టోకెన్ జెనరేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇతర డివైజ్‌లకూ ఈ సేవలు అందుతాయి. మీరు క్రెడిట్, డెబిట్ కార్డుల్లో జెనరేట్ చేసే ఈ టోకెన్ల కోసం అదనంగా ఏమీ చెల్లించనక్కర్లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇది ఉచిత సేవల కిందకు వస్తుంది. మాస్టర్ కార్డ్, వీసా లాంటి కార్డ్ నెట్‌వర్క్ నుంచి మీకు ఈ టోకెన్లు అందుతాయి. వీటి ద్వారా థర్డ్ పార్టీకి మీ కార్డు వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు.
Loading...
కార్డు చెల్లింపుల్ని మరింత సురక్షితంగా చేయడం కోసమే ఆర్‌బీఐ ఈ కొత్త విధివిధానాలు రూపొందించింది. టోకెనైజేషన్ విధానం త్వరలో అమలులోకి రానుంది.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే ఎన్నెన్నో లాభాలు... తెలుసుకోండి

Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండి

Fake Apps: 85 యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...