డ్రైవింగ్ లైసెన్స్‌‌తో ఆధార్‌ను ఇలా లింక్ చేయండి...

చాలాచోట్ల ప్రమాదాలు జరిగిన వెంటనే డ్రైవర్లు అక్కడ్నుంచి పరారవుతారు. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ మార్చేసి కొత్తది తీసుకుంటారు. అదే ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్స్‌ను లింక్ చేస్తే సదరు డ్రైవర్లను సులువుగా గుర్తుపట్టొచ్చు. ఒకవేళ వాళ్లు కొత్త లైసెన్స్‌ తీసుకోవాలని అనుకున్నా... ఆధార్ నెంబర్ ద్వారా దొరికిపోతారు.

news18-telugu
Updated: January 7, 2019, 2:45 PM IST
డ్రైవింగ్ లైసెన్స్‌‌తో ఆధార్‌ను ఇలా లింక్ చేయండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మరోసారి ఆధార్ వార్తల్లోకి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి చేస్తామంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా లైసెన్స్‌లను అక్రమంగా డూప్లికేట్ చేసే పద్ధతికి స్వస్తి చెప్పడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసుల్లో డూప్లికేట్ లైసెన్సులు పొందడం చాలా సులువు. ప్రజలు ఈ డాక్యుమెంట్‌ని దుర్వినియోగం చేయడం ప్రభుత్వానికి సమస్యగా మారింది.

ఇక లైసెన్స్ హోల్డర్లను సులువుగా గుర్తించేందుకూ ఇది ఉపయోగపడనుంది. చాలాచోట్ల ప్రమాదాలు జరిగిన వెంటనే డ్రైవర్లు అక్కడ్నుంచి పరారవుతారు. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ మార్చేసి కొత్తది తీసుకుంటారు. అదే ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్స్‌ను లింక్ చేస్తే సదరు డ్రైవర్లను సులువుగా గుర్తుపట్టొచ్చు. ఒకవేళ వాళ్లు కొత్త లైసెన్స్‌ తీసుకోవాలని అనుకున్నా... ఆధార్ నెంబర్ ద్వారా దొరికిపోతారు. ఒకవేళ పేరు మార్చుకొని లైసెన్స్ తీసుకోవాలని అనుకున్నా బయోమెట్రిక్స్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్స్ మార్చలేరు. ఇక జరిమానాల చెల్లింపులూ పెరుగుతాయి. ప్రస్తుతం చాలామంది జరిమానాలు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. జరిమానాలు ఎక్కువైపోతే కొత్త లైసెన్సులు తీసుకుంటున్నారు. ఈ సమస్యకూ పరిష్కారం దొరికినట్టే.

డ్రైవింగ్ లైసెన్స్‌‌తో ఆధార్ ఎలా లింక్ చేయాలి?

డ్రైవింగ్ లైసెన్స్‌‌తో ఆధార్‌ను అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుంది. అయితే మీరే స్వచ్ఛందంగా డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌ను లింక్ చేయొచ్చు. మీ రాష్ట్ర ఆర్‌టీఓ వెబ్‌సైట్‌లోకి వెళ్తే చాలు. వెబ్‌సైట్‌లో లింక్ ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ క్లిక్ చేస్తే డీటైల్స్ వస్తాయి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.ఇవి కూడా చదవండి:

'వాట్సప్ గోల్డ్' మెసేజ్ వచ్చిందా? ఓపెన్ చేస్తే అంతే...

2019లో వాట్సప్‌లో కొత్తగా వచ్చే ఫీచర్లు ఇవేనా?ITR Alert: మీ ఐటీఆర్‌లో హెచ్ఆర్ఏ ఎలా ప్లాన్ చేశారు?

జనవరి 31 తర్వాత టీవీ ఛానెళ్లు ఆగిపోతాయా?
First published: January 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు