హోమ్ /వార్తలు /బిజినెస్ /

Sovereign Gold Bonds: సావరిన్ గోల్డ్ బాండ్లతో ఈజీగా లోన్ పొందే అవకాశం.. ఇలా చేయండి

Sovereign Gold Bonds: సావరిన్ గోల్డ్ బాండ్లతో ఈజీగా లోన్ పొందే అవకాశం.. ఇలా చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) సోమవారం (ఆగస్టు 22) నుంచి పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం(ఆగస్టు 26) వరకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Sovereign Gold Bonds:  ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) సోమవారం (ఆగస్టు 22) నుంచి పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం(ఆగస్టు 26) వరకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. జూన్‌లో మొదటి విడత బాండ్లు రిలీజ్ అయిన తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు రెండో సారి సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను విడుదల చేశారు. వీటిని లోన్ కోసం కొలేటరల్‌ సెక్యూరిటీగా ఉపయోగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్ల నోటిఫికేషన్‌లో.. ‘బాండ్లను రుణాల కోసం తాకట్టు పెట్టవచ్చు. లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని ఎప్పటికప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన సాధారణ బంగారు రుణానికి సమానంగా సెట్ చేయాలి.’ అని పేర్కొంది.


రూ.750కే గ్యాస్ సిలిండర్.. ఇండేన్ వినియోగదారులకు బెస్ట్ ఆఫర్.. వివరాలివే


* ఫిజికల్ గోల్డ్‌కి ప్రత్యామ్నాయం
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు  (Sovereign Gold Bonds)గ్రాముల బంగారం (Gold Price Today)తో కూడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. అవి భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయాలు. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచ్యూరిటీపై బాండ్లు నగదు రూపంలో రీడీమ్ అవుతాయి. ఈ బాండ్‌ను భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. ఈ సెక్యూరిటీలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(NBFC) నుంచి రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. లోన్ టు వాల్యూ రేషియో ఎప్పటికప్పుడు ఆర్‌బీఐ నిర్దేశించే సాధారణ గోల్డ్ లోన్‌కు వర్తించే విధంగానే ఉంటుంది. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌లపై రుణం మంజూరు చేయడం అనేది బ్యాంక్/ఫైనాన్సింగ్ ఏజెన్సీ నిర్ణయానికి లోబడి ఉంటుంది. హక్కుకు సంబంధించిన అంశంగా భావించలేరని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


* బాండ్లను ఎవరు కొనుగోలు చేయగలరు?

సావరిన్ గోల్డ్ బాండ్లను నివాసితులు, హిందూ అవిభక్త కుటుంబాలు(HUFలు), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు కొనుగోలు చేయవచ్చు.


 SBI ATM Card: పిన్ ఎంటర్ చేయకుండా డెబిట్ కార్డ్ పేమెంట్స్... ఇలా యాక్టివేట్ చేయండి


* సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనుగోలు చేయవచ్చు?

బాండ్లను వాణిజ్య బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SHCIL), క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCIL), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బీఎస్‌ఈ ద్వారా నేరుగా లేదా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.


* ఇష్యూ ప్రైస్‌

ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. సబ్‌స్క్రిప్షన్ వ్యవధిలో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ సిరీస్-II ఇష్యూ ధర రూ. 5,197. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు ఇష్యూ ధర నుంచి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ను ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అటువంటి పెట్టుబడిదారులకు గోల్డ్ బాండ్ ఇష్యూ ధర గ్రాము బంగారంపై రూ.5,147గా ఉంటుంది.* పేమెంట్‌ ఆప్షన్లు

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు కోసం గరిష్టంగా రూ.20,000 వరకు నగదు చెల్లించవచ్చు. లేదా డిమాండ్ డ్రాఫ్ట్, చెక్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఆన్‌లైన్ పేమెంట్స్‌పై ప్రతి గ్రాము బంగారంపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.


* టెన్యూర్‌

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ కాలవ్యవధి ఎనిమిదేళ్ల పాటు ఉంటుంది. అయితే ఐదో సంవత్సరం తర్వాత వడ్డీ చెల్లింపు తేదీకి ప్రీమెచ్యూర్ రిడమ్షన్ ఆప్షన్‌ ఉంది.


Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Gold loans

ఉత్తమ కథలు