EV | పెట్రోల్ రేట్లతో చితికిపోయారా? అందుకే మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) పొందొచ్చు. పాత పెట్రోల్ (Petrol) బైక్ లేదా పెట్రోల్ స్కూటర్‌ను ఎక్స్చేంజ్ ఇవ్వొచ్చు. ఇలా మీరు మీకు నచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ల గురించి తెలుసుకోవాల్సిందే.
ఇ-స్కూటర్ తయారీ కంపెనీలు అయిన ఏథర్ ఎనర్జీ, బౌన్స్ ఇన్ఫినిటీ, బిగౌస్ వంటి సంస్థలు కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి. ఇవి పాత పెట్రోల్ టూవీలర్లను ఎక్స్చేంజ్ కింద తీసుకొని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తున్నాయి. ఇంకా కొనడానికి ముందు రెంట్‌కు ఇస్తున్నాయి. అలాగే చాలా మంది తక్కువ మెయింటెనెన్స్ కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎస్బీఐ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. కొత్త సర్వీసులు తెచ్చిన బ్యాంక్, ఇకపై క్షణాల్లో..
ఏథర్ ఎనర్జీ వెహికల్ స్వాప్ ప్రోగ్రామ్ తీసుకువచ్చింది. దీని కోసం క్రెడ్ఆర్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద పాత వెహికల్ ఇచ్చి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ బెంగళూరు, చెన్నైలో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. పాత వెహికల్‌కు ఎంత విలువ వస్తుందో దాన్ని కొత్త స్కూటర్ నుంచి తీసేస్తారు. మిగిలిన మొత్తం కట్టాలి. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కింద అదనంగా రూ. 4 వేలు డిస్కౌంట్ లభిస్తుంది.
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్!
బౌన్స్ ఇన్ఫినిటీ అనేది స్కూరర్ రెంటల్ కంపెనీ. ఇది బెంగళూరు, విజయవాడలో సేవలు అందిస్తోంది. మీరు స్కూటర్ కొనడానికి ముందు ఈ కంపెనీ కొన్ని వారాలు లేదా నెలల పాటు రెంట్ సర్వీస్ అందిస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ సర్వీసులు కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ బిగౌస్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తోంది. మీరు మీ వెహికల్‌ను బిగౌస్ డీలర్షిప్ వద్దకు తీసుకువెళ్లాలి. అక్కడ మీ వెహికల్‌కు ఎంత ఎక్స్చేంజ్ విలువ వచ్చేది తెలుస్తుంది. మీకు నచ్చిన కొత్త స్కూటర్ ఎంచుకోవాలి. మిగిలిన డబ్బులు చెల్లించాలి. ఇక మీరు ఎంచుకున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇలా మీరు సింపుల్‌గా మీ పాత పెట్రోల్ టూవీలర్‌ను ఇచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Electric Scooter, Electric Vehicles, Petrol, SCOOTER