ATM Business: ఏటీఎం బిజినెస్ గురించి తెలుసా.. నెలకు రూ.50 వేలు కూర్చొని సంపాదించవచ్చు.. తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ATM Business: చేతిలో ఎక్కువ డబ్బులు ఉండి.. పెట్టుబడి పెట్టే శక్తి ఉంటే.. డబ్బు సంపాదించడం సువువే. ఎందుకంటే ఎన్నో బిజినెస్ లు ఇప్పుడు పెట్టుబడి మీదనే ఆధారపడి ఉన్నాయి. అయితే ఏ వ్యాపారం అయినా దిగే ముందు సంమగ్రంగా తెలుసుకొని.. ఆలోచించికుని జాగ్రత్తగా అడుగు వేయాలి. తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పొందే విధంగా ఉండే బిజినెస్ ను ఎంచుకోవాలి. ఇలా చేసేవారికి మంచి ఆప్షన్ ఉంది. దాని గురించి తెలుసుకుందాం..

 • Share this:
  చేతిలో ఎక్కువ డబ్బులు ఉండి.. పెట్టుబడి పెట్టే శక్తి ఉంటే.. డబ్బు(Money) సంపాదించడం సువువే. ఎందుకంటే ఎన్నో బిజినెస్(Business) లు ఇప్పుడు పెట్టుబడి మీదనే ఆధారపడి ఉన్నాయి. అయితే ఏ వ్యాపారం అయినా దిగే ముందు సంమగ్రంగా తెలుసుకొని.. ఆలోచించికుని జాగ్రత్తగా అడుగు వేయాలి. తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పొందే విధంగా ఉండే బిజినెస్ ను ఎంచుకోవాలి. ఇలా చేసేవారికి మంచి ఆప్షన్ ఉంది. కష్టపడకుండానే నెలకు రూ. 50 వేలకుపైగా సంపాదించుకోవచ్చు. అదే ఏటీఎం బిజినెస్. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ప్రస్తుతం మారుమూల పల్లెటూర్లలో సైతం ఏటీఎం బ్యాంకింగ్‌ కార్యకలాపాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. బ్యాంకుల ముందు డబ్బు కోసం గంటల తరబడి ఎదురుచూసే కష్టం నుంచి వినియోగదార్లకు ఏటీఎం విముక్తి కల్పించింది. సాధారణంగా తమ కస్టమర్లకు ఏటీఎంలను బ్యాంకులే సమకూర్చుతాయి. మనకు కావాల్సిన సమయంలో వెళ్లి డబ్బులను డ్రా చేసుకోవచ్చు.

  కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పథకం.. ఈ పథకం ద్వారా రైతులు రూ.15 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..


  ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆంధ్రాబ్యాంక్, ఐడీబీఐ వంటి పలు బ్యాంకులు ఏటీఎంలను పెడుతుంటాయి. మనదేశంలో ఎక్కువగా ఏటీఎంలను కలిగి ఉన్న బ్యాంక్.. ఎసీబీఐ. ఇవి కాకుండా వైట్ లేబుల్ ఏటీఎంలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆర్‌బీఐ మరో అడుగు ముందుకేసి వైట్‌ లేబుల్‌ ఏటీఎం విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో కేవలం బ్యాంకులు మాత్రమే కాదు ఇతర సంస్థలు సైతం నగదు లావాదేవీలను అందుబాటులోకి తెచ్చాయి.

  ప్రస్తుతం అనేక సంస్థలు 'వైట్‌ లేబుల్‌ ఏటీఎం'లను నెలకొల్పుతున్నాయి. ఈ ఏటీఎంలలో బ్యాంక్ లోగోలు ఉండవు. రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు ఈ తరహా ఏటీఎం ఏర్పాటుకు ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2013 నుంచి ఆర్‌బీఐ వైట్ లేబుల్ ఏటీఎంల ఏర్పాటు కోసం కొన్ని సంస్థలకు లైసెన్స్ జారీ చేయడం ప్రారంభించింది.

  Central Government: భార్యాభర్తలకు నెలకు రూ. 10 వేలు ఇస్తున్న కేంద్రం.. దానికి ఇలా చేయండి..


  టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీకి తొలి లైసెన్స్ ఇచ్చింది. టాటా గ్రూపు 'ఇండిక్యాష్‌' పేరుతో దేశంలో తొలి వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఏర్పాటు చేసింది. అంతేకాదు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం కల్పించేందుకు దేశవ్యాప్తంగా 15,000 వైట్‌ లేబుల్‌ ఏటీఎంలను నెలకొల్పారు. ఈ తరహా ఏటీఎంలను ఏ బ్యాంక్‌ కస్టమర్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఒక ట్రాన్సాక్షన్‌పై గరిష్టంగా రూ.10,000 వరకు తీసుకోవచ్చు. వైట్ లేబుల్ ఏటీఎంలో కూడా నెలలో తొలి ఐదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. తర్వాత ప్రతి లావాదేవీకి చార్జీలు పడతాయి. క్యాష్ విత్‌డ్రా‌కు లిమిట్ దాటిన తర్వాత రూ.15లు చార్జీ పడుతుంది.

  అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీకి రూ.5 చెల్లించాల్సి వస్తుంది. ఆయా బ్యాంకులు వైట్ లేబుల్ కంపెనీకి ఈ చార్జీలను చెల్లిస్తాయి. సాధారణ బ్యాంకు ఏటీఎంలో ఉండే అన్ని రకాల సదుపాయాలు వైట్‌ లేబుల్‌ ఏటీఎం'లోనూ ఉంటాయి. నగదు విత్‌డ్రా చేయటంతో పాటు, బ్యాలెన్స్‌ ఎంక్వైరీ తెలుసుకోవడం, మినీ స్టేట్‌మెంట్‌ తీసుకోవడం, పిన్‌ నెంబరు మార్చుకోవడం చేయవచ్చు. ఈ ఏటీఎం సెంటర్ తాము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు కంపెనీ వాళ్లకు చెప్పాల్సి ఉంటుంది.

  ప్రస్తుతం ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందిన సంస్థలు AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, BTI పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హిటాచి పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, రిద్దిసిద్ధి బులియన్స్ లిమిటెడ్, SREI ఇన్ఫ్రా ఉన్నాయి. వీటికి సంబంధించిన కాంటక్ట్ వారి అధికారిక వెబ్ సైట్ కి వెల్లి సంపాదించాల్సి ఉంటుంది. మనం వాళ్లకు ఎక్కడ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామో ప్రదేశం చెబితే.. వాళ్లు ఏర్పాటు చేసి ఇచ్చేస్తారు. ఈ ఏటీఎం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందుగా 60 నుంచి 100 చదరపు అడుగుల స్థలాన్ని రెడీ చేసుకోవాలి.

  School Girl: పాఠశాలకు వెళ్తున్న బాలికను కారులో ఎక్కించుకున్నారు.. చివరకు నిర్మాణుష్యప్రాంతానికి తీసుకెళ్లి..


  కరెంట్ కనెక్షన్, ఎన్ఓసీ లెటర్, వీసెట్ ఏర్పాటుకు ఫ్లాట్ రూఫ్ ఉండేలా చూసుకోవాలి. ఇండిక్యాష్ లో మనం ఏటీఎం తీసుకోవాలి అనకుంటే.. ఇండీక్యాష్ వెబ్‌సైట్‌కు వెళ్లి అప్లై చేసుకోవాలి. లొకేషన్ పిక్చర్ అప్‌లోడ్ చేసి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ముథూట్ ఫైనాన్స్ కూడా ఏటీఎం సేవలు అందిస్తోంది. మీరు ఈ కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు.

  ఇలా వివరాలు అందిస్తే.. కంపెనీ ప్రతినిధులు కాల్ చేసి అన్ని విషయాలు వివరంగా చెబుతారు. ఏటీఎంలో రోజుకు 200 లావాదేవీలు జరిగితే అందులో 50 నాన్-ఫైనాన్స్ ట్రాన్సక్షన్స్, 150 క్యాష్ విత్‌డ్రాయెల్స్ ఉంటే రోజుకు రూ. 2,500 వరకు సంపాదించొచ్చు. అంటే నెలకు రూ.75,000 వరకు వస్తాయి. అద్దె సహా ఇతర ఖర్చుల కింద 25 వేలు తీసేసినా రూ.50,000 మిగిలే అవకాశం ఉంది. ఒక రోజులో కనీసం 100 లావాదేవీలు జరిగితే మీ ఏటీఎం లాభదాయకంగా మారుతుంది.
  Published by:Veera Babu
  First published: