హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: మెడికల్ స్టోర్‌తో ప్రతి రోజూ భారీగా ఆదాయం.. ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది

Business Idea: మెడికల్ స్టోర్‌తో ప్రతి రోజూ భారీగా ఆదాయం.. ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జన్ ఔషధి కేంద్రంలో మందుల విక్రయంపై 20 శాతం వరకు కమీషన్ లభిస్తుంది. ఈ కమీషన్‌తో పాటు ప్రతి నెల జరిగే విక్రయాలపై 15 శాతం వరకు ప్రత్యేక ప్రోత్సాహకం అందజేస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని భావిస్తున్నారా? ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుటుందని ఆలోచిస్తున్నారా? మీ కోసం ఈ బిజినెస్ ఐడియా (Business Idea). మీరు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ అవకాశం ద్వారా వైద్య రంగంలో మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చు. కరోనా తర్వాత వైద్య పరికరాలకు, మందులకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు జనరిక్ ఔషధాలను అందించడానికి ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాన్ని (Jan Aushadhi kendra) తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సాయం చేస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు భారీ శుభవార్త.. కంపెనీ కీలక నిర్ణయం!

జన్ ఔషధి కేంద్రాల సంఖ్య పెంపుపై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించింది. మార్చి 2024 నాటికి, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి భారత జనౌషధి సంఖ్యను 10,000కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాన్యులకు తక్కువ ధరకే మందులు అందించాలన్న ఉద్దేశంతో ఈ జన్ ఔషధి కేంద్రాలను తెరుస్తున్నారు.

జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం మూడు కేటగిరీలుగా అవకాశం కల్పిస్తోంది. మొదటి కేటగిరీలో ఏదైనా నిరుద్యోగ ఫార్మసిస్ట్, డాక్టర్ లేదా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జన్ ఔషధి కేంద్రాన్ని తెరవవచ్చు. ట్రస్ట్, ఎన్జీవో, ప్రైవేట్ హాస్పిటల్ మొదలైనవి రెండో కేటగిరీలోకి వస్తాయి. మూడో కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేసిన ఏజెన్సీలకు అవకాశం లభిస్తుంది. ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం పేరుతో మందుల దుకాణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మీరు జనౌషధి కేంద్రాన్ని తెరవాలనుకుంటే, మీరు డి ఫార్మా లేదా బి ఫార్మాలో డిగ్రీని కలిగి ఉండాలి. దరఖాస్తు చేసేటప్పుడు మీ అర్హతకు సంబంధించిన ధృవపత్రాలను సమర్పించాలి. PMJAY కింద, SC, ST, వికలాంగులకు మెడికల్ స్టోర్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 50,000 వరకు మెడిసిన్ అడ్వాన్స్ ఇస్తుంది.

జన్ ఔషధి కేంద్రం ఏర్పాటుకు ముందు.. జన్ ఔషధి కేంద్రం పేరుతో 'రిటైల్ డ్రగ్ సేల్స్' లైసెన్స్ తీసుకోండి. https://janaushadhi.gov.in/ వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్‌ను జనరల్ మేనేజర్ (A&F), బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సి ఉంటుంది.

జన్ ఔషధి కేంద్రంలో మందుల విక్రయంపై 20 శాతం వరకు కమీషన్ లభిస్తుంది. ఈ కమీషన్‌తో పాటు ప్రతి నెల జరిగే విక్రయాలపై 15 శాతం వరకు ప్రత్యేక ప్రోత్సాహకం అందజేస్తారు. మెడికల్ షాప్‌ ఫర్నిచర్, ఇతర వస్తువుల కోసం ప్రభుత్వం రూ.1.5 లక్షల వరకు అందిస్తుంది. బిల్లింగ్ కోసం కంప్యూటర్లు, ప్రింటర్ల కొనుగోలు కోసం రూ.50,000 వరకు ప్రభుత్వ సహాయం చేస్తుంది. మీరు ఎంత ఎక్కువ మందులు అమ్మగలిగితే.. అంత ఆదాయం మీకు వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business Ideas, Hyderabad, Local News

ఉత్తమ కథలు