SBI Home Loan | దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్, దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఊరట కలిగే ప్రకనట చేసింది. సులభంగానే రుణాలు పొందే వెసులుబాటు కల్పిస్తోంది. అది కూడా బ్యాంక్ (Bank) బ్రాంచ్‌కు వెళ్లకుండానే లోన్ అప్రూవల్ పొందే అవకాశం అందుబాటులో ఉంచింది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఎస్‌బీఐ యోనో ద్వారా ఆన్‌లైన్‌లోనే హోమ్ లోన్ కోసం అప్లై చేసుకునే ఆప్షన్ అందిస్తోంది. యోనో యాప్ ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా క్షణాల్లో హోమ్ లోన్ కోసం ఇన్‌స్టంట్ అప్రూవల్ కూడా పొందొచ్చని బ్యాంక్ పేర్కొంటోంది. అంటే ఎస్‌బీఐ యోనో ద్వారా మీరు సులభంగానే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
పన్ను చెల్లింపుదారులకు కేంద్రం అదిరే శుభవార్త.. మార్చి 31 వరకు గడువు పొడిగింపు!
ఎస్‌బీఐ యోనో ద్వారా హోమ్ లోన్ పొందాలని భావించే ఎప్పుడైనా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. సింపుల్ ప్రాసస్. కోఅప్లికెంట్ అడిషన్ ఆప్షన్ కూడా ఉంది. ఎస్‌బీఐ అప్రూవ్డ్ ప్రాపర్టీస్‌లో నచ్చిన ఇల్లు కొనొచ్చు. డాక్యుమెంట్ సమర్పణకు అపాయింట్‌మెంట్ కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ విధంగా హోమ్ లోన్ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది.
ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి.మి. వెళ్లే 3 చౌక ధర ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
మీరు ఎస్‌బీఐ యోనో ద్వారా లోన్ పొందాలని భావిస్తే.. ముందుగా మీరు మీ ఫోన్‌లో ఎస్‌బీఐ యోనో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ యోనో యాప్ వాడాలంటే కచ్చితంగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాల్సిందే. ఎస్‌బీఐ యోనో యాప్ కలిగిన వారు లాగిన్ అవ్వాలి. తర్వాత బెస్ట్ ఆఫర్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ఎస్‌బీఐ రియల్టీ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత హోమ్ లోన్స్ అప్లైపై క్లిక్ చేయాలి. తర్వాత లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్ ద్వారా ఇలా సింపుల్‌గా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కూడా లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. కాగా హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 8.75 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Home loan, Sbi, Sbi loans, Sbi yono, State bank of india