ఆచార్య బాలకృష్ణకు తీవ్ర అస్వస్థత...ఎయిమ్స్‌కు తరలింపు...

పతంజలి ఆయుర్వేద సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాతీలో నొప్పి రావడంతో ఆయనను రుషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో, చైర్మన్ గా సుపరిచితులైన బాలకృష్ణ నేపాల్‌కు చెందినవారు.

news18-telugu
Updated: August 23, 2019, 9:02 PM IST
ఆచార్య బాలకృష్ణకు తీవ్ర అస్వస్థత...ఎయిమ్స్‌కు తరలింపు...
పతంజలి బాలకృష్ణ (ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అనుచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాతీలో నొప్పి రావడంతో ఆయనను రుషికేష్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పతంజలి ఆయుర్వేద సంస్థ సీఈవో, చైర్మన్ గా సుపరిచితులైన బాలకృష్ణ నేపాల్‌కు చెందినవారు. దేశంలోనే అతి పెద్ద ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల సంస్థ పతంజలి స్థాపన ద్వారా ఆయన మల్టీ నేషనల్ కంపెనీలకు సవాల్ విసిరారు. గతంలో స్వామి రామ్ దేవ్ బాబాతో కలిసి పలు యోగా కార్యక్రమాల్లో ఆసనాలు వేయడం ద్వారా ఆయన లక్షలాది మందికి సుపరిచితుడు. 1995లోనే స్వామి రాందేవ్ బాబాతో కలిసి ఆయన దివ్య యోగా ఫార్మసీని స్థాపించారు. 2018లో 6.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading