Patanjali Credit Card | మీరు పతంజలి ప్రొడక్ట్స్ ఎక్కువగా కొంటుంటారా? అయితే మీకోసం ప్రత్యేకంగా పతంజలి క్రెడిట్ కార్డులు (Patanjali Credit Cards) వచ్చాయి. ఈ క్రెడిట్ కార్డులు తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్లాట్‌ఫామ్‌పై పంజాబ్ నేషనల్ బ్యాంకుతో (PNB) కలిసి యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి గ్రూప్ రెండు కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డుల్ని లాంఛ్ చేసింది. పీఎన్బీ పతంజలి రూపే ప్లాటినమ్, పీఎన్బీ పతంజలి రూపే సెలెక్ట్ క్రెడిట్ కార్డుల్ని పరిచయం చేసింది. వేర్వేరు కార్డులకు వేర్వేరు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డులతో పతంజలి స్టోర్స్‌లో జరిపే ట్రాన్సాక్షన్స్‌పై క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇతర క్రెడిట్ కార్డులకు ఉన్నట్టుగా అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులో లేదా పీఎన్బీ క్రెడిట్ కార్డ్ పోర్టల్‌లో ఈ క్రెడిట్ కార్డులకు అప్లై చేయొచ్చు. మరి ఏ కార్డు తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.
పీఎన్బీ పతంజలి రూపే ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్
పీఎన్బీ పతంజలి రూపే ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు ఉండదు. అయితే ప్రతీ మూడు నెలలకు ఓసారి ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించాలి. మొదటిసారి ఈ క్రెడిట్ కార్డు వాడితే 300 పైగా రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. రూ.2,500 కన్నా ఎక్కువ మొత్తంలో జరిపే ట్రాన్సాక్షన్స్‌కు 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. గరిష్టంగా రూ.50 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. పతంజలి స్టోర్స్‌లో జరిపే కొనుగోళ్లకు 5 నుంచి 7 శాతం అదనంగా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ రూ.25,000 నుంచి రూ.5,00,000 మధ్య ఉంటుంది.
పీఎన్బీ పతంజలి రూపే సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాలి. యాన్యువల్ ఫీజు లేదు. అయితే ప్రతీ మూడు నెలలకు ఓసారి ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించాలి. మొదటిసారి ఈ క్రెడిట్ కార్డు వాడితే 300 పైగా రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. రీటైల్ మర్కండైజ్ కొనుగోళ్లకు రెండు రెట్లు అదనంగా రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. పీఎన్బీ పతంజలి రూపే ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్ లాగానే సెలెక్ట్ క్రెడిట్ కార్డుతో రూ.2,500 కన్నా ఎక్కువ మొత్తంలో జరిపే ట్రాన్సాక్షన్స్‌కు 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పతంజలి స్టోర్స్‌లో జరిపే కొనుగోళ్లకు 5 నుంచి 7 శాతం అదనంగా క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ లిమిట్ రూ.50,000 నుంచి రూ.10,00,000 మధ్య ఉంటుంది.
ఈ రెండూ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు. రెండు కార్డులకు క్యాష్‌బ్యాక్స్, లాయల్టీ పాయింట్స్ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు యాక్సిడెంటల్ డెత్, పర్సనల్ టోటల్ డిసేబిలిటీ ఇన్స్యూరెన్స్ కవర్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లాంజ్‌లల్లో ఉచిత యాక్సెస్ లాంటివి లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.