Home /News /business /

YEZDI IS COMING BACK THIS WEEK TWO GREAT MOTORCYCLES WILL BE LAUNCHED WILL COMPETE WITH ROYAL ENFIELD MK

Yezdi Motorcycles In India: జనవరి 13న మార్కెట్లోకి మరోసారి యెజ్దీ బైక్స్ ఆగమనం...ధర ఫీచర్లు ఇవే...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

బుల్లెట్ బైకుకి పోటీగా మార్కెట్లోకి వచ్చిన మరో బైక్ Yezdi (యెజ్దీ) 1961లో మార్కెట్లోకి దూసుకొచ్చింది. అంతేకాదు ఒకప్పటి యూత్ ఐకాన్ గా నిలిచిన యెజ్దీ బైక్ కొంత కాలం క్రితం మార్కెట్లోకి రాకుండా ఆగిపోయింది. అయితే కొత్త సంవత్సరంలో Yezdi బైక్ బ్రాండ్ మరోసారి మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.

ఇంకా చదవండి ...
    Yezdi Motorcycles In India:  బైక్స్ లో లెజెండ్ అనగానే గుర్తొచ్చేది ఇప్పటికీ అందరికీ బుల్లెట్ మాత్రమే...మిలటరీ వెహికిల్ గా దాదాపు 90 సంవత్సరాల క్రితం ప్రవేశించిన ఈ ప్రీమియం వెహికిల్ ఇఫ్పటికీ మంచి సేల్స్ తో మార్కెట్లో దూసుకెళ్తోంది. అయితే బుల్లెట్ బైకుకి పోటీగా మార్కెట్లోకి వచ్చిన మరో బైక్ Yezdi (యెజ్దీ) 1961లో మార్కెట్లోకి దూసుకొచ్చింది. అంతేకాదు ఒకప్పటి యూత్ ఐకాన్ గా నిలిచిన యెజ్దీ బైక్ కొంత కాలం క్రితం మార్కెట్లోకి రాకుండా ఆగిపోయింది. అయితే కొత్త సంవత్సరంలో Yezdi బైక్ బ్రాండ్ మరోసారి  మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఈ మోటర్‌సైకిల్ అంటే ఒకప్పుడు యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. 80-90 దశకాల్లో ఈ బైక్‌పై సినిమాల్లో హీరోలు రొమాన్స్ చేస్తూ, ఫైట్ చేస్తూ కనిపించేవారు. అయితే ఈ బైక్స్ నెమ్మదిగా మార్కెట్లో అంతరించి పోయాయి. అయితే ఇప్పుడు యెజ్డీ అభిమానుల కోసం శుభవార్త, ఈ బైక్ మరోసారి మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ యెజ్డీని మరోసారి భారతదేశంలో విడుదల చేయబోతోంది. జనవరి 13న కంపెనీ రెండు మోడల్స్ యెజ్డీ రోడ్‌కింగ్ (Yezdi Roadking), యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure) ద్వారా కంపెనీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. యెజ్డీ మోటార్‌సైకిళ్లు బెస్ట్ సెల్లర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో బైక్స్ తో పోటీపడనున్నాయి. దీంతో యెజ్డీ, హోండా, కెటిఎమ్ సహా ఇతర కంపెనీలకు సవాల్‌ విసరనుంది.

    Xiaomi 11 Lite NE 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ 4 రోజులే

    వ్యక్తుల కోసం కొత్త ఎంపికలు

    ఇటీవల క్లాసిక్ లెజెండ్స్ రాబోయే యెజ్డీ బైక్‌ల టీజర్‌ను విడుదల చేసింది. దీనితో పాటు యెజ్డీ రోడ్‌కింగ్ (Yezdi Roadking), యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure) మోటార్‌సైకిళ్లను గత కొన్ని నెలలుగా టెస్ట్ డ్రైవ్స్ రూపంలో కనిపిస్తున్నాయి. యెజ్డీ రోడ్‌కింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, రాబోయే హంటర్ 350తో పాటు హోండా CB350 లతో పోటీ పడబోతోంది. Yezdi అడ్వెంచర్ (Yezdi Adventure) బైక్ ప్రస్తుతం మార్కెట్లోని రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌తో పోటీ పడుతుందని అంచనా వేస్తున్నారు.

    iQoo Z3 5G: ఐకూ జెడ్3 స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింపు... లేటెస్ట్ రేట్ ఎంతంటే

    పవర్, ఫీచర్స్ ఇవే...

    Yezdi మోటార్‌సైకిళ్ల ఇంజన్, పవర్ ఫీచర్స్ విషయానికి వస్తే Yezdi అడ్వెంచర్ బైక్ 334cc ఇంజన్‌తో పాటు 30.64 PS పవర్, 32.74Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. అదే సమయంలో, రోడ్‌కింగ్‌ (Yezdi Roadking) లో 293సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ మోటార్‌సైకిళ్లు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తున్నాయి. డ్యూయల్ ఛానల్ ABS, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, LED లైట్లు, LCD డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను చూడవచ్చు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Bikes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు