Paytm: ఎస్ బ్యాంకులో వాటాల కొనుగోలుకు పేటీఎం ఆసక్తి...?

Paytm: ఎస్ బ్యాంకు కో ఫౌండర్ రానా కపూర్‌కు చెందిన వాటాలను కొనేందుకు చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరగడంతో పాటు కపూర్ తన వాటాలను పేటీఎంకు అమ్మేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: September 11, 2019, 7:17 PM IST
Paytm: ఎస్ బ్యాంకులో వాటాల కొనుగోలుకు పేటీఎం ఆసక్తి...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Paytm: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం, ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఎస్ బ్యాంకులో వాటాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పేమెంట్స్ బ్యాంకుగా రూపాంతరం చెందిన పేటీఎం. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఎస్ బ్యాంకులో వాటాల కొనుగోలుకు తెరలేపింది. ఇందులో భాగంగా ఎస్ బ్యాంకు కో ఫౌండర్ రానా కపూర్‌కు చెందిన వాటాలను కొనేందుకు చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరగడంతో పాటు కపూర్ తన వాటాలను పేటీఎంకు అమ్మేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ డీల్ ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి పొందాల్సి ఉంది. కాగా ఈ వ్యాపార ఒప్పందంపై పేటీఎం గోప్యత పాటిస్తోంది.

ఇదిలా ఉంటే ఎస్ బ్యాంకు కో ఫౌండర్ రానా కపూర్‌కు బ్యాంకులో మొత్తం 9.6 శాతం వాటాలను కలిగి ఉన్నారు. అయితే ఈ వార్తలపై రానా కపూర్ తో పాటు బ్యాంకు వర్గాలు కూడా స్పందించడం లేదు. కాగా ఎస్ బ్యాంకు ప్రస్తుత సీఈవో రవ్నీత్ గిల్ మాత్రం బ్యాంకులో 10 శాతం మించని మైనారిటీ వాటాలను ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థకు విక్రయించేందుకు సంప్రదింపులు జరుపుతోందని, ఇందుకు సంబంధించిన డీల్ త్వరలోనే తుది రూపుదిద్దుకోనుందని వివరించారు.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading