
(ప్రతీకాత్మక చిత్రం)
Yes Bank | యెస్ బ్యాంక్ పై విధించిన మారిటోరియం మార్చి 18న తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్బీఐ బాధ్యుడిగా నియమించిన ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు.
Yes Bank | ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న యెస్ బ్యాంక్ బుధవారం సాయంత్రం 6 గంటల నుండి పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలను పున: ప్రారంభిస్తుంది. ప్రజలు అన్ని డిజిటల్ సేవలు ఇతర పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా యాక్సెస్ చేయగలరు. దీని ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ విధించిన తాత్కాలిక నిషేధం అదే సమయంలో ముగుస్తుంది. ఈ మేరకు ఒక ట్వీట్లో, బ్యాంక్ సోమవారం ఇలా చెప్పింది: "మేము మార్చి 18, 2020, 18:00 గంటల నుండి పూర్తి బ్యాంకింగ్ సేవలను తిరిగి ప్రారంభిస్తాము. మార్చి 19, 2020 నుండి మా 1,132 బ్రాంచ్‌లలో దేనినైనా సందర్శించండి అని తెలిపింది.
ఇదిలా ఉంటే యస్ బ్యాంక్ పై విధించిన మారిటోరియం మార్చి 18న తొలగిపోనుంది. ప్రస్తుతం ఆర్బీఐ బాధ్యుడిగా నియమించిన ప్రశాంత్ కుమార్ ఆ తర్వాత సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ఆయన సారథ్యంలోనే కొత్త బోర్డు ఏర్పడనుంది. కొత్త బోర్డులో సునీల్ మెహతా (పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్).. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గాను, మహేష్ కృష్ణమూర్తి, అతుల్ భెడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటారు. మార్చి 13 నుంచి యస్ బ్యాంక్ పునరుద్ధరణ స్కీమ్ 2020ని అమల్లోకి తెస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రభుత్వం ఈ అంశాలు పొందుపర్చింది.
Published by:Krishna Adithya
First published:March 16, 2020, 15:35 IST