హోమ్ /వార్తలు /బిజినెస్ /

Yes Bank share and target price: యెస్‌ బ్యాంక్ టార్గెట్ ప్రైజ్ ఎంత ఉండవచ్చు...

Yes Bank share and target price: యెస్‌ బ్యాంక్ టార్గెట్ ప్రైజ్ ఎంత ఉండవచ్చు...

యస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను బట్టి షేర్, టార్గెట్ ప్రైజ్‌ను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకుకు సంబంధించిన న్యూ స్ట్రెస్ లోన్లు 17 శాతంగా ఉండగా, యస్ బ్యాంక్ మొండి బకాయిలు 39 శాతంగా ఉన్నాయి.

యస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను బట్టి షేర్, టార్గెట్ ప్రైజ్‌ను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకుకు సంబంధించిన న్యూ స్ట్రెస్ లోన్లు 17 శాతంగా ఉండగా, యస్ బ్యాంక్ మొండి బకాయిలు 39 శాతంగా ఉన్నాయి.

యస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను బట్టి షేర్, టార్గెట్ ప్రైజ్‌ను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకుకు సంబంధించిన న్యూ స్ట్రెస్ లోన్లు 17 శాతంగా ఉండగా, యస్ బ్యాంక్ మొండి బకాయిలు 39 శాతంగా ఉన్నాయి.

  యస్ బ్యాంక్ త్రైమాసిక ఫలితాలను బట్టి షేర్, టార్గెట్ ప్రైజ్‌ను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బ్యాంకుకు సంబంధించిన న్యూ స్ట్రెస్ లోన్లు 17 శాతంగా ఉండగా, యస్ బ్యాంక్ మొండి బకాయిలు 39 శాతంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో PAT రూ.1.5బిలియన్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 16 శాతానికి పెరిగింది. కానీ సంవత్సరం వారీగా చూస్తే ఈ విలువ 101 శాతం తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్, డిపాజిట్లలో బలమైన సీక్వెన్షియల్ గ్రోత్ నమోదైంది. కానీ అసెట్ క్వాలిటీ బాగా తగ్గిపోయింది. స్టాండ్ స్టిల్ NPL, SMA1, SMA2, రీ స్ట్రక్చర్డ్ లోన్లు వంటి న్యూ స్టాండర్డ్ స్ట్రెస్ లోన్లు ఈ త్రైమాసికంలోని మొత్తం లోన్లలో 17 శాతం పెరిగి రూ.282 బిలియన్లకు చేరుకున్నాయి. ఆ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇది ఐదు శాతంగానే ఉండటం విశేషం. యస్ బ్యాంక్ మొత్తం అవుట్‌స్టాండింగ్ స్ట్రెస్ లోన్లు 29 నుంచి 39 శాతానికి పెరిగాయి.

  యస్ బ్యాంక్ మొత్తం లోన్లలో SMA2 లోన్లు 4 శాతం, SMA1 లోన్లు 7 శాతంగా ఉన్నాయి. SMA1 లోన్ తీసుకున్నవారు 4 వాయిదాల్లో రెండింటిని చెల్లించారని యాజమాన్యం చెబుతోంది. యస్ బ్యాంక్ కార్పొరేట్ లోన్లలో స్టాండ్ స్టిల్ GNPLs, SMA2 లోన్లు ఎక్కువగా ఉన్నాయి. స్టాండ్ స్టిల్ NPLలలో 70 శాతం, SMA2 లోన్లలో 80 శాతం కార్పొరేట్ విభాగం నుంచే ఉన్నాయి.

  కలెక్షన్ సామర్థ్యం పెరిగింది

  రూ.51 బిలియన్లుగా ఉన్న స్టాండ్‌స్టిల్ కార్పొరేట్ NPLలు 3000 అకౌంట్లలో విస్తరించి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కార్పొరేట్ NPLల సగటు టికెట్ సైజు చాలా తక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. న్యూ కార్పొరేట్ స్ట్రెస్ ప్రధానంగా హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. రిటైల్ లోన్లలో స్టాండ్‌స్టిల్ NPLలు 17 శాతం, SMA2 లోన్లు 12 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం యస్ బ్యాంక్ కలెక్షన్ సామర్థ్యం 96 శాతంగా నమోదైంది. ఇది కోవిడ్‌కు ముందుగా ఉన్న 97 శాతానికి సమానంగా ఉంది.

  స్టాండ్ స్టిల్ NPLsపై వడ్డీ లేదు

  యస్ బ్యాంక్ డిపాజిట్లు గత త్రైమాసికంతో పోలిస్తే 8 శాతం పెరిగాయి. కానీ గత సంవత్సరంతో పోలిస్తే డిపాజిట్లు 12 శాతం తగ్గాయి. ఈ త్రైమాసికంలో CASA డిపాజిట్లు 13 శాతం పెరిగాయి. కానీ గత సంవత్సరంతో పోలిస్తే వీటిల్లో 29 శాతం తగ్గుదల కనిపించింది. త్రైమాసికం పరంగా చూస్తే లోన్‌లు కూడా రెండు శాతం పెరిగాయి, కానీ గత సంవత్సరంతో పోలిస్తే వీటిల్లో 9 శాతం తగ్గుదల కనిపించింది. రిటైల్, ఎమ్‌ఎస్‌ఎమ్ఈలకు రూ.120 బిలియన్లను కేటాయించింది. ఈ టార్గెట్‌ రూ.100బిలియన్లుగా ఉన్నప్పటికీ, అంతకు మించి నిధుల సరఫరా పెరిగింది. త్రైమాసికంలో PPOP కూడా 68 శాతానికి పెరిగింది. అధిక ఒత్తిడి కారణంగా క్రెడిట్ కాస్ట్ కూడా 2.9 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది. యస్ బ్యాంక్ స్టాండ్ స్టిల్ NPLలపై వడ్డీని రివర్స్ చేయలేదు. ఒకవేళ బ్యాంకు రూ.3.7 బిలియన్ల వడ్డీని రివర్స్ చేస్తే, బ్యాంకుకు ప్రీ ట్యాక్స్ లాస్ వచ్చేది. దీనికి విరుద్దంగా ప్రస్తుతం రూ. 866 మిలియన్ల PBT వచ్చినట్లు యస్ బ్యాంక్ తెలిపింది.

  వాల్యుయేషన్ ఎలా ఉందంటే..

  మార్కెట్ పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అమ్మే రేటింగ్ మారుతోంది. రూ.6 టార్గెట్ ప్రైజ్‌తో దీన్ని అమ్ముకోవచ్చని ఎలార క్యాపిటల్స్ సూచిస్తోంది. రానున్న రోజుల్లో యెస్ బ్యాంక్ స్ట్రెస్ లోన్లు గణనీయంగా పెరుగుతాయని ఎలారా క్యాపిటల్ అంచనా వేస్తోంది.

  First published:

  Tags: Stock Market

  ఉత్తమ కథలు