FD Rates | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యస్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. యస్ బ్యాంక్ (Yes Bank) ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చేసింది. రూ. 2 కోట్లలోపు ఎఫ్డీలకు ఈ రేట్ల పెంపు వర్తిస్తుందని గుర్తించుకోవాలి.
బ్యాంక్ 7 రోజుల నుంచి 120 నెలల టెన్యూర్‌తో ఎఫ్డీ సర్వీసులు అందిస్తోంది. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకొని డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. వీటిపై 3.25 శాతం నుంచి 6.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సాధారణ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 3.75 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇప్పుడు ఏడాది నుంచి మూడేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై 7 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన 2 బ్యాంకులు.. ఈరోజు నుంచి..
7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంది. 15 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్డీలపై 3.7 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. 46 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.1 శాతం వడ్డీ వస్తుంది. 91 రోజుల నుంచి 180 రోజుల ఎఫ్డీలపై 4.75 శాతం వడ్డీని పొందొచ్చు. 181 రోజుల నుంచి 271 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. 272 రోజుల నుంచి ఏడాది ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.75 శాతంగా కొనసాగుతోంది. ఏడాది నుంచి 36 నెలల ఎఫ్డీలపై 7 శాతం వడ్డీ పొందొచ్చు. 36 నెలల నుంచి 120 నెలల కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది.
పాత పెట్రోల్ టూవీలర్ ఇచ్చేసి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పొందండిలా!
అలాగే యస్ బ్యాంక్ ఇటీవలనే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 20 నెలల నుంచి 22 నెలల వరకు ఉంటుంది. ఈ స్కీమ్‌లో డబ్బులు పెడితే 7.25 శాతం వడ్డీ పొందొచ్చు. రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇకపోతే యస్ బ్యాంక్ ఆర్డీ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. 6.75 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఆరు నెలల నుంచి పదేళ్ల టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. మీరు నచ్చిన మొత్తాన్ని ప్రతి నెలా డిపాజిట్ చేసుకుంటూ వెళ్లొచ్చు. లేదంటే ఆటో డెబిట్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. డబ్బులు ప్రతి నెలా మీ అకౌంట్లో కట్ అవుతాయి. ఆర్డీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, YES BANK