రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI యెస్ బ్యాంక్ బోర్డును రద్దు చేయడం, తాత్కాలికంగా నిషేధాన్ని విధించడం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. యెస్ బ్యాంక్ కస్టమర్ల, డిపాజిటర్ల సొమ్ము సురక్షితమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యెస్ బ్యాంక్ సిబ్బంది ఉద్యోగాలకు ఒక ఏడాది వరకు ఎలాంటి ముప్పు లేదని హామీ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం నాడు యెస్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్‌ను ప్రకటించింది. యెస్ బ్యాంక్ ఆథరైజ్డ్ క్యాపిటల్‌ను రూ.5,000 కోట్లుగా మార్చింది ఆర్బీఐ. ఈక్విటీ షేర్లను రూ.2 ఫేస్ వ్యాల్యూతో 2,400 కోట్లకు తగ్గించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI రీకన్స్ట్రక్షన్ చేసిన బ్యాంకులో 49 శాతం వాటాలు పొందనుంది. ఈ పెట్టుబడులకు మూడేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. వాటాలను 26 శాతం కన్నా తక్కువకు తగ్గించుకోలేదు ఎస్బీఐ.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ సీఎఫ్ఓ ప్రశాంత్ కుమార్‌ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. ఇక యెస్ బ్యాంకుకు ఇద్దరు నామినీ డైరెక్టర్లను నియమించనుంది ఎస్బీఐ. బ్యాంకు బోర్డులో ఆర్బీఐ అడిషనల్ డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది. రీకన్స్ట్రక్షన్ చేసిన బ్యాంకులో హక్కులు, బాధ్యతల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అకౌంట్ హోల్డర్లకు ఎలాంటి నష్టపరిహారం లభించదు. యెస్ బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు, నియమ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. కీలక బాధ్యతల్లో ఉన్న మేనేజర్లను బోర్డు తొలగించే అవకాశం ఉంది. బ్యాంకు బ్రాంచుల్లో, కార్యాలయాల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవు. రీకన్స్ట్రక్షన్ చేసిన బ్యాంకు కొత్త ఆఫీసుల్ని, బ్రాంచుల్ని తెరిచే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Banks Merger: ఏప్రిల్ 1న ఈ బ్యాంకుల విలీనం... కస్టమర్లు ఏం చేయాలంటే
Gold Price Today: మళ్లీ షాకిచ్చిన గోల్డ్ రేట్... ఎంత పెరిగిందంటే
LIC Policy: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... సిప్ ప్లాన్‌తో లాభాలు ఇవేPublished by:Santhosh Kumar S
First published:March 06, 2020, 18:18 IST