YES BANK CRISIS FOLLOW THESE SIMPLE TIPS TO PROTECT YOUR SAVINGS ACCOUNT FROM FINANCIAL RISKS SS
Savings Account: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ టిప్స్‌తో మీ డబ్బులు సేఫ్
Savings Account: బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ టిప్స్‌తో మీ డబ్బులు సేఫ్
(ప్రతీకాత్మక చిత్రం)
Savings Account Tips | డబ్బులు ఇంట్లో దాచుకోవడం కన్నా బ్యాంకులో దాచుకుంటేనే సేఫ్ అన్న అభిప్రాయం మామూలే. కానీ ఇటీవల బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభంతో బ్యాంకులు కూడా సురక్షితం కావన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయితే బ్యాంకులో డబ్బులు దాచుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ కష్టార్జితాన్ని సేఫ్‌గా మార్చుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
మీకు ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా? రెండు మూడు బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారా? ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా అకౌంట్లు ఉన్నాయా? మీ డబ్బులన్నీ ఈ అకౌంట్లలోనే దాచుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఇటీవల యెస్ బ్యాంక్ సంక్షోభం గుర్తుంది కదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI మారటోరియం విధించడంతో యెస్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు రూ.50,000 మించి డ్రా చేసుకోలేకపోయారు. అకౌంట్లో రూ.10 లక్షలు ఉన్నవారు కూడా కేవలం రూ.50,000 మాత్రమే డ్రా చేసుకోగలిగారు. అంతకుముందు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటీవ్ బ్యాంక్ కస్టమర్లూ ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. మరి ఇదే పరిస్థితి అన్ని బ్యాంకులకు వస్తుందా అంటే ఎవరూ ఊహించలేరు. అందుకే ఖాతాదారులే కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు బ్యాంకుల ఉదాహరణలతో కొన్ని పాఠాలు నేర్చుకుంటే ఇలాంటి ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
మీ అకౌంట్ ఉన్న బ్యాంకు సంక్షోభంలో పడితే మీ సేవింగ్స్‌పై రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్-DICGC బీమా కవర్ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఓ బ్యాంకులో రూ.5,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే... ఒకవేళ ఆ బ్యాంకు దివాళా తీసినా మీకు రూ.5,00,000 వరకు ఇన్స్యూరెన్స్ ఉంటుంది కాబట్టి మీ డబ్బులు సేఫ్. ఒకవేళ రూ.10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టైతే మీకు బీమా కవర్ రూ.5,00,000 వరకు మాత్రమే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలన్న సందేహం కస్టమర్లకు రావడం మామూలే. అప్పుడు మీ ఫిక్స్డ్ డిపాజిట్లను రెండు బ్యాంకుల్లో అడ్జస్ట్ చేయాలి. మీరు రూ.10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే రెండు బ్యాంకుల్లో రూ.5,00,000 చొప్పున డిపాజిట్ చేయాలి. ఒకేసారి రెండు బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి రాదు. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా రూ.5,00,000 వరకు బీమా కవర్ ఉంటుంది కాబట్టి మీ డబ్బులు సురక్షితంగా ఉన్నట్టే.
ప్రతీకాత్మక చిత్రం
అందుకే రెండు అకౌంట్లు మెయింటైన్ చేయడం మంచిది. మరీ ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు చాలు. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ప్రతీ అకౌంట్‌కు రకరకాల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మంచి బ్యాంకులు రెండు ఎంచుకొని వాటిలో అకౌంట్లు ఓపెన్ చేస్తే చాలు. మీ సాలరీ అకౌంట్‌ను మీ ఈఎంఐల కోసం వాడుకోవాలి. మరో అకౌంట్‌ను మీ పెట్టుబడులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇన్స్యూరెన్స్ ప్రీమియంల కోసం వాడుకోవాలి. దగ్గర అవసరానికి మించి డబ్బులు ఉంటే వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం మంచిది. సేవింగ్స్ అకౌంట్లో ఉండే వడ్డీ తక్కువ వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.