హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bikes: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? రూ.1 లక్షలోపు లభిస్తున్న టాప్ బైక్స్ ఇవే

Bikes: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? రూ.1 లక్షలోపు లభిస్తున్న టాప్ బైక్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Year Ender: కరోనా భయంతో ప్రజలు పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ కంటే వ్యక్తిగత వాహనాలకు మొగ్గుచూపారు. దీంతో గతేడాదితో పోలిస్తే అమ్మకాలు పెరిగాయి. అయితే కార్ల కంటే ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా వృద్ది చెందాయి.

2021 ఏడాది ముగింపుకు చేరుకున్నాం. మరి కొద్ది రోజుల్లో 2022 నూతన ఏడాది (New Year)లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది ఆటోమొబైల్​ మార్కెట్ (Automobile Market)​ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ టూవీలర్స్​ అమ్మకాలు (Two Wheeler Sales) మాత్రం పుంజుకున్నాయి. కరోనా భయంతో ప్రజలు పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ కంటే వ్యక్తిగత వాహనాలకు మొగ్గుచూపారు. దీంతో గతేడాదితో పోలిస్తే అమ్మకాలు పెరిగాయి. అయితే కార్ల కంటే ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా వృద్ది చెందాయి. మోటార్​ సైకిళ్లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్​ స్కూటర్లు ఇలా టూవీలర్స్​కు భారీగా డిమాండ్​ ఏర్పడింది. ముఖ్యంగా రూ. 1 లక్షలోపు విడుదలైన బైక్​లను కొనేందుకు వాహనదారులు ఆసక్తి చూపించారు. ఈ ఏడాది ముగింపులో మీరు కొనగలిగే రూ. 1 లక్షలోపు బెస్ట్​ బైక్​లను పరిశీలించండి.

Jio Rs 1 Plan: జియో మరో సంచలనం... ఒక్క రూపాయికే ప్రీపెయిడ్ ప్లాన్... బెనిఫిట్స్ ఇవే

టీవీఎస్​ రైడర్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్​ ఇటీవల రైడర్‌​ బైక్‌ను లాంచ్​ చేసింది. 125-cc స్కూటర్ సెగ్మెంట్‌లో మంచి అమ్మకాలను కనబర్చింది. టీవీఎస్​ బజాజ్ ఎన్​ఎస్​ 125 తరహాలోనే దీనిలో కూడా ఆకట్టుకునే ఫీచర్లను అందించింది. ఈ బైక్​ నిఫ్టీ ఫీచర్లు, ఇంజన్, అదిరిపోయే లుక్‌లతో వస్తుంది. యువతను ఆకట్టుకునే విధంగా దీన్ని డిజైన్​ చేశారు. టీవీఎస్​ రైడర్ 125 124.8cc బీఎస్​6 ఇంజన్‌తో 11.2 bhp శక్తిని, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పప్పు మిల్లు ఏర్పాటు చేసుకుంటే లక్షల్లో ఆదాయం...ఆశ్చర్యపోతారు...

బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar)

కేవలం రూ. 1 లక్ష బడ్జెట్‌లో బెస్ట్ బైక్​ కోసం చూస్తుంటే.. బజాజ్ పల్సర్ 125 బెస్ట్ ఆప్షన్​గా చెప్పవచ్చు. ఇది అధిక ఇంధన సామర్ధ్యంతో వస్తుంది. 150 వలె సిటీ స్పీడ్‌లను చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులోని అన్ని మెరుగైన బాడీ ప్యానెళ్లు, టైర్లు, డిస్క్ బ్రేక్, ఛాసిస్, సస్పెన్షన్​లను అందించింది. దీని ఇంజిన్ ట్యాంక్ కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఫలితంగా, ఇంజిన్​ 4 కిలోల బరువు మాత్రమే ఉంటుంది.

బజాజ్ ఎన్​ఎస్​ 125 (Bajaj NS 125)

బజాజ్ పల్సర్ ఎన్​ఎస్​ 125 ఒక కమ్యూటర్ బైక్. ఇది భారత మార్కెట్​లో రూ. 99,192 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. ఇది సింగిల్​ వేరియంట్, 4 కలర్​ ఆప్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బజాజ్ పల్సర్ ఎన్​ఎస్​125 124.45cc బీఎస్​6 ఇంజన్‌తో 11.6 bhp శక్తిని, 11 ఎన్​ఎమ్​ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పల్సర్ ఎన్​ఎస్​125 బైక్ బరువు 144 కిలోలు ఉంటుంది. ఇది 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

Business Ideas: చీప్ గా చూడొద్దు...ఈ చెత్తతో వ్యాపారం చేస్తే నెలకు కోట్లల్లో ఆదాయం

హోండా ఎస్​పీ 125 (Honda SP 125)

ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్న సీబీ షైన్ ఎస్​పీ 125 బైక్​ HMSI మొదటి బీఎస్​6 కంప్లైంట్ బైక్​గా రాణిస్తోంది. ఈ బైక్​ మరింత ప్రీమియం లుక్స్, ఎక్విప్‌మెంట్‌తో వస్తుంది. హోండా ఎస్​పీ 125 మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ముందు భాగంలో డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్‌లను అందించింది. హోండా ఎస్​పీ 125 124cc బీఎస్ ​6 ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్​ 10.72 bhp పవర్, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎస్​పీ 125 మొత్తం 177 కిలోల బరువు కలిగి ఉంటుంది. 11 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంటుంది.

First published:

Tags: Bike rides, Bikes, Business, Motor Cycle

ఉత్తమ కథలు