Traffic Challan | శీతా కాలం ప్రారంభం అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పలు హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేస్లకు సంబంధించిన రూల్స్ (Rules) కూడా మారాయి. స్పీడ్ (Speed)) లిమిట్‌కు సంబంధించి నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీని వల్ల పొగ మంచు, మంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడొచ్చు. యమున ఎక్స్‌ప్రెస్ హైకి సంబంధించి కూడా రూల్స్ మారాయి. 165 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ వే ఆగ్రా నుంచి గ్రేటర్ నోయిడా మధ్యలో ఉంది.
శీతా కాలంలో ఈ దారిలో పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వాహనాల స్పీడ్ లిమిట్ రూల్స్‌లో మార్పులు తీసుకువచ్చారు. టాప్ స్పీడ్‌ను తగ్గించేశారు. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై తేలికపాటి వాహనాల టాప్ స్పీడ్‌ను గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించేశారు. ఇదివరకు ఈ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లుగా ఉండేది. అలాగే హెవీ వెహికల్స్ టాప్ కూడా స్పీడ్ కూడా గంటకు 60 కిలోమీటర్లకు కుదించారు.
పరుగులు పెడుతోంది పట్టుకోండి.. వారంలోనే డబ్బు రెట్టింపు!
ప్రయాణికుల సేఫ్టీ లక్ష్యంగా ఈ కొత్త మార్పులు చేసినట్లు తెలిస్తోంది. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ కొత్త రూల్స్ అమలులో ఉంటాయి. అక్కడి అథారిటీ ప్రతి ఏటా ఈ సమయంలో యమున ఎక్స్‌ప్రెస్ వేపై వెహికల్స్ టాప్ స్పీడ్‌ను తగ్గిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. లైట్ వెహికల్స్ టాప్ స్పీడ్‌ను 80కి, హెవీ వెహికల్స్ టాప్ స్పీడ్‌ను 60కి తగ్గించారు.
ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్క రూపాయి ఆఫర్ అదిరింది!
ఒకవేళ వాహనం నడిపే వ్యక్తి ఎవరైనా ఈ కొత్త రూల్స్‌ను బ్రేక్ చేస్తు అధిక పెనాల్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏకంగా రూ. 2 వేల వరకు జరిమానా పడుతుంది. అంటే నిర్దేశించిన లిమిట్ కన్నా ఎక్కువ స్పీడ్‌తో వెలితే రూ. 2 వేలు చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తించుకోవాలి.
దేశవ్యాప్తంగా చూస్తే.. నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ వేలపై వెహికల్స్ స్పీడ్ లిమిట్ వేర్వేరుగా ఉంటుంది. నేషనల్ హైవేస్‌పై కారు టాప్ స్పీడ్‌ను గంటకు 100 కిలోమీటర్లుగా ఫిక్స్ చేశారు. ఎక్స్‌ప్రెస్ వే విషయానికి వస్తే.. ఈ స్పీడ్ లిమిట్ గంటకు 120 కిలోమీటర్లుగా ఉంటుంది. అలాగే టూవీలర్లు, హెవీ వెహికల్స్‌కు కూడా స్పీడ్ లిమిట్ వేరుగా ఉంటుంది. హైవేస్, ఎక్స్‌ప్రెస్ వేలపై టూవీలర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. హెవీ వెహికల్స్‌కు అయితే స్పీడ్ లిమిట్ గంటకు 100 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ లిమిట్స్‌ను దాటితే రూ. 2 వేల వరకు జరిమానా పడుతుంది. టాప్ స్పీడ్ ఆధారంగా పెనాల్టీ మారుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High speed, Speed, Traffic challan, Traffic penalty, Traffic rules