హోమ్ /వార్తలు /బిజినెస్ /

Yamaha YZF R1: వచ్చే ఏడాది మార్కెట్‌లోకి యమహా YZF R1 లగ్జరీ బైక్‌ .. రేటు, ఫీచర్స్ చెక్‌ చేయండి

Yamaha YZF R1: వచ్చే ఏడాది మార్కెట్‌లోకి యమహా YZF R1 లగ్జరీ బైక్‌ .. రేటు, ఫీచర్స్ చెక్‌ చేయండి

Yamaha YZF R1 bike

Yamaha YZF R1 bike

Yamaha YZF R1: యమహా YZF R1 లేటెస్ట్ వెర్షన్ భారతదేశంలో మార్చి 2023 నాటికి విడుదల కానుందని సమాచారం. దీని ధర రూ.20.39 లక్షలు ఉంటుందని అంచనా. మరి ఈ అప్‌కమింగ్ సూపర్ ఫాస్ట్ బైక్ ఎక్స్‌పెక్టెడ్ డిజైన్, ఫీచర్స్‌ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జపాన్‌కి చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్స్‌ తయారీ సంస్థ యమహా (Yamaha) తీసుకొచ్చే బైక్స్‌ అంటే యంగ్‌స్టర్స్‌కి చాలా ఇష్టం. ఈ బైక్స్ పవర్‌ఫుల్ ఇంజన్‌తో కిల్లింగ్ లుక్స్‌తో వస్తుంటాయి. హోండా, కవాసాకీ వంటి బైక్స్‌కి పోటీగా ఈ కంపెనీ సూపర్ ఫాస్ట్ బైక్స్‌ తీసుకొస్తుంది. ఇందులో భాగంగా యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 (Yamaha YZF R1)గా పిలిచే క్లాస్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌ను 1998లోనే రిలీజ్ చేసింది. ఈ బైక్ గత కొన్ని సంవత్సరాలుగా అదిరిపోయే అప్‌డేట్స్‌తో సరికొత్తగా లాంచ్ అవుతూ వస్తోంది. కాగా Yamaha YZF R1 లేటెస్ట్ వెర్షన్ భారతదేశంలో మార్చి 2023 నాటికి విడుదల కానుందని సమాచారం. దీని ధర రూ.20.39 లక్షలు ఉంటుందని అంచనా. మరి ఈ అప్‌కమింగ్ సూపర్ ఫాస్ట్ బైక్ ఎక్స్‌పెక్టెడ్ డిజైన్, ఫీచర్స్‌ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon: అమెజాన్‌ ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డే సేల్‌లో బెస్ట్‌ ఆఫర్లు.. భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తున్న ప్రొడక్ట్స్ ఇవే

లగ్జరీ బైక్ కమింగ్‌ సూన్..

ప్రస్తుత మోడల్ మాదిరిగానే యమహా YZF R1 బైక్ 2023 వెర్షన్ 998cc, లిక్విడ్-కూల్డ్, 4-సిలిండర్, 4-స్ట్రోక్, 4-వాల్వ్స్, DOHC ఇంజన్‌తో రావచ్చు. ఈ ఇంజన్‌తో వస్తే ఇది గంటకి 293-299 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లగలదు. కేవలం మూడు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఈ YZF R1 ఇంజన్ 13500 rpm వద్ద 200 PS పవర్, 11500 rpm వద్ద 112.4 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, యమహా YZF R1 బైక్‌ 2023లో డ్యూయల్ ఛానల్ ABS అందించారు. కచ్చితంగా చెప్పాలంటే ఇది ఇప్పటి మోడల్ లాగానే 2-మోడ్ బ్రేక్ కంట్రోల్ (BC) కార్నరింగ్ ABS టెక్నాలజీతో వస్తుంది. ఇందులో ఫ్రంట్ సైడ్ 320mm హైడ్రాలిక్ డ్యూయల్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm హైడ్రాలిక్ సింగిల్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేశారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 130 మి.మీ ఉంటుంది.

ఫీచర్లు..

రిపోర్ట్స్ ప్రకారం, YZF R1 2023 కర్బ్ వెయిట్ 200 కిలోలు ఉంటుంది. ఇందులో ట్యూబ్‌లెస్ టైర్, అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేస్తారు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు. దీని సీటు హైట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. యమహా YZF-R1 మైలేజ్ దాదాపు 13.88 kmpl ఉంటుందని అంచనా. భారతదేశంలో యమహా ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా చెప్పుకునే ఈ బైక్‌లో అడ్వాన్స్‌డ్‌ ట్రాక్షన్ కంట్రోల్ (TCS), స్లయిడ్ కంట్రోల్ సిస్టమ్ (SCS), యాంటీవీలీ లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్ (LIF), లింక్డ్ యాంటీలాక్ బ్రేక్‌లు, లాంచ్ కంట్రోల్ సిస్టమ్ (LCS), క్విక్ షిఫ్ట్ సిస్టమ్ (QSS) వంటి ఫీచర్లు ఉన్నాయి. మోడ్ ఇంజన్ బ్రేక్ మేనేజ్‌మెంట్ (EBM), BC డిస్‌ప్లేలతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్స్, ప్రీమియం లుక్, ఏరోడైనమిక్, M1-స్టైల్ బాడీవర్క్, నెక్స్ట్ జనరేషన్ LED హెడ్‌లైట్లు, పొజిషన్ లైట్లు, మెరుగైన ఫ్రంట్ & బ్యాక్ సస్పెన్షన్, సిస్టమ్, రైడ్-బై-వైర్ APSG థ్రాటిల్ వంటి ఉపయోగకర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

First published:

Tags: Bike, International news, Yamaha

ఉత్తమ కథలు