హోమ్ /వార్తలు /బిజినెస్ /

Yamaha MT-15 V2: యమహా MT-15 V2 బైక్ రివ్యూ.. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే..

Yamaha MT-15 V2: యమహా MT-15 V2 బైక్ రివ్యూ.. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే..

Yamaha MT-15 V2: యమహా MT-15 V2 బైక్ రివ్యూ.. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే..

Yamaha MT-15 V2: యమహా MT-15 V2 బైక్ రివ్యూ.. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే..

జపనీస్ బ్రాండ్ యమహా, కొన్ని నెలల క్రితం లగ్జరీ బైక్ అయిన యమహా MT-15 V2 (Yamaha MT-15 V2) మోడల్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువగా డిమాండ్ ఉన్న మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటిగా మారింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

జపనీస్ బ్రాండ్ యమహా(Yamaha), కొన్ని నెలల క్రితం లగ్జరీ బైక్ అయిన యమహా MT-15 V2 (Yamaha MT-15 V2) మోడల్‌ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో(Portfolio) ఎక్కువగా డిమాండ్ ఉన్న మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటిగా మారింది. పాత వెర్షన్‌ను పూర్తిగా మేకోవర్ చేసి రిలీజ్ చేసిన ఈ సరికొత్త బైక్ రివ్యూ చూద్దాం.

 ఫీచర్లు

ఈ బైక్‌లో స్పెషల్ ఫీచర్ స్లిప్పర్ క్లచ్. ఇది రైడర్‌కు కంఫర్ట్ ఇస్తుంది. గేర్లను సున్నితంగా మార్చే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇంజిన్ కట్-ఆఫ్ ఫీచర్‌తో కూడిన సైడ్-స్టాండ్, స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్‌తో కూడిన కొత్త ఆల్ డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. వంటివి దీని ప్రత్యేకతలు. గేర్ పొజిషన్, ఇంధన వినియోగం, షిఫ్ట్ టైమింగ్ లైట్ వంటి సమాచారాన్ని కూడా ఇది డిస్‌ప్లే చేస్తుంది.

ఈ బైక్‌ Y-కనెక్ట్ యాప్‌తో సింక్ అవుతుంది. బ్లూటూత్ సాయంతో స్మార్ట్‌ఫోన్‌ను ఈజీగా పెయిర్ చేయవచ్చు. ఇది ఇన్‌కమింగ్ కాల్స్, మిస్డ్ కాల్స్, SMS, ఇమెయిల్ అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ లెవల్ వంటి సమాచారాన్ని LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో అందిస్తుంది. Y-కనెక్ట్ యాప్.. రోజువారీ, నెలవారీ ఇంధన వినియోగం, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ వంటి సమాచారాన్ని కూడా అందిస్తుంది. అయితే నావిగేషన్ సిస్టమ్ లేకపోవడం దీంట్లోని పెద్ద డ్రా బ్యాక్‌గా చెప్పుకోవచ్చు. అలాగే స్విచ్‌లకు ప్రీమియం టచ్ లేదు కాబట్టి, వాటి ప్లాస్టిక్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉండాల్సింది.

Group 1 Preliminary Key: గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ.. తాజా అప్ డేట్ ఇదే..

* డిజైన్

మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన యమహా YZF-R15 V4 మోడల్‌కు స్ట్రీట్‌ఫైటర్ వెర్షన్‌గా కంపెనీ యమహా MT-15 V2 బైక్‌ను రూపొందించింది. పాత వెర్షన్‌ డిజైన్‌ను ఇది కొంత వరకు ప్రతిబింబిస్తుంది. జూన్‌లో వచ్చిన ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌, ఇప్పటికే ఉన్న ఐస్ ఫ్లూ-వెర్మిలియన్, మెటాలిక్ బ్లాక్‌ కలర్స్‌తో పాటు సియాన్ స్టార్మ్, రేసింగ్ బ్లూ అనే రెండు కొత్త కలర్ స్కీమ్‌లతో లభిస్తుంది. దీంతోపాటు కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్లతో బైక్ రిలీజ్ అయింది. అల్లాయ్ వీల్స్‌పై బ్లూ కలర్ పెయింటింగ్‌తో MT-15 బైక్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.

ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్స్‌తో బైక్‌ ఫేస్ కొత్తగా కనిపిస్తోంది. హెడ్‌లైట్ కింద ఉన్న నంబర్ ప్లేట్ పొజిషనింగ్, గోల్డెన్ కలర్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను కవర్ చేస్తుంది. సైడ్ ప్రొఫైల్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. రేడియల్ ట్యూబ్‌లెస్ టైర్లతో వచ్చే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రైడింగ్ బాగుంటుంది. బైక్‌కు LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. కానీ ఇండియేటర్స్ మాత్రం LEDలు కావు. ఇలాంటి సరికొత్త డిజైన్‌తో ఈ బైక్ ప్రస్తుతం యమహా పోర్ట్‌ఫోలియోలోని బెస్ట్ బైక్స్‌లో ఒకటిగా నిలుస్తోంది.

* రైడ్, హ్యాండ్లింగ్

యమహా MT-15 V2 బైక్‌లో 810 mm ఎత్తులో ఉన్న సింగిల్ పీస్ సీటు ఉంటుంది. అయితే సీటింగ్ డిజైన్ కారణంగా, వెనుక కూర్చునేవారు రైడర్ పైకి వాలుతారు. దీంతో లాంగ్ రైడ్‌కు వెళ్లినప్పుడు కాస్త అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. అలాగే వెనుక సీటు స్థలం చాలా తక్కువగా ఉంది. పిలియన్ సీట్ స్పేస్ కంటే వెనుక నంబర్ ప్లేట్ పెద్దదిగా ఉంది. గోల్డెన్ ఫినిషింగ్‌లో టెలిస్కోపిక్ అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ బాగున్నాయి. MT-15 V2 బైక్ సింగిల్-ఛానల్ బాష్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో వస్తుంది. ముందు, డిస్క్ యూనిట్లను అందించారు. బ్రేకింగ్ సిస్టమ్ కంట్రోలింగ్ బాగుంటుంది. సడన్ బ్రేక్ వేసినప్పుడు కూడా బైక్ బ్యాలెన్స్ కోల్పోదు. రైడర్ అధిక వేగంతో దూసుకెళ్తూ, కంఫర్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందించడంలో యమహా సక్సెస్ అయిందనే చెప్పాలి.

LKG Admissions: LKG సీట్ల కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూ.. చలిలో వణుకుతూ కూడా ఇలా..

అయితే ప్రీవియస్ వెర్షన్స్‌తో పోలిస్తే బైక్ తక్కువ పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ప్రస్తుత మోడల్ 155cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 10,000 rpm వద్ద 18.2 bhp, 7,500 rpm వద్ద 14.1 Nm స్టాటిక్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ సిటీ రైడ్స్ సమయంలో సుమారు 35-40 kmpl ఆకట్టుకునే మైలేజీని అందించిందని టెస్టర్స్ పేర్కొన్నారు. బైక్ చాలా సింపుల్‌గా 130-140 kmph స్పీడ్‌ను అందుకుంటుంది. గేర్‌షిఫ్ట్ కూడా బలంగా ఉంటుంది. రూ. 1.64-1.66 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో వచ్చిన యమహా MT-15 V2 బైక్.. పోటీ కంపెనీల మోడల్స్‌తో పోలిస్తే చాలా విషయాల్లో మెరుగ్గా ఉన్నట్లు టెస్ట్ రైడింగ్ చేసిన ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

First published:

Tags: Automobiles, Bikes, Yamaha, Yamaha bike

ఉత్తమ కథలు