Yamaha EV: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్​లోకి యమహా... ఇండియాలో త్వరలోనే ఇ-బైక్​ విడుదల

Yamaha EV: ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్​లోకి యమహా... ఇండియాలో త్వరలోనే ఇ-బైక్​ విడుదల (ప్రతీకాత్మక చిత్రం)

Yamaha EV | యమహా మోటార్ కంపెనీ త్వరలో ఇండియాలో ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ చేయనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
జపాన్ ద్విచక్రవాహన దిగ్గజం యమహా భారత్​తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలపై పనిచేస్తోంది. ముఖ్యంగా భారత్ లో ఎలక్ట్రిక్​ వాహనాల ప్లాట్ ఫాంపై దృష్టి సారించింది. భారత్ లో ఈ-మొబలిటిలో కంపెనీ పెట్టుబడులుప్రభుత్వ స్పష్టమైన రోడ్ మ్యాప్ పై ఆధారపడి ఉంటాయని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన FAME 2 ఫథకంతో ఎలక్ట్రిక్​ వెహికల్​పోత్సహకాలను పెంచిందని, అయితే మౌలిక సదుపాయాల కల్పన, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి వంటి ముఖ్యమైన అంశాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని యమహా సంస్థ అభిప్రాయపడింది. వీటిని పరిష్కారించాల్సిన అవసరముందనని తెలిపింది. అందువల్ల జపాన్ నిపుణుల బృందం భారత్ తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్ ఫాంను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిందని యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఛైర్మన్ మోటోఫుమి షిటారా తెలిపారు. "మేము ఇప్పటికే మా జపాన్ కార్యాలయంలో ఓ ప్రత్యేక బృందాన్ని కలిగి ఉన్నాం. భారత్ తో పాటు ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం సరికొత్త ఈవీల వేదికపై పనిచేస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా తైవాన్ లో విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి, ఈవీ మోడళ్లను అభివృద్ధి చేయడానికి తగిన సాంకేతికత, నైపుణ్యం ఇప్పటికే అమలులో ఉన్నాయని అన్నారు.

Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.4,950 మీ అకౌంట్‌లోకి

Pension Scheme: నెలకు రూ.3,000 పెన్షన్ కావాలంటే ఈ స్కీమ్‌లో చేరండి... జీతం తక్కువ ఉన్నవారికే అవకాశం

భారత్ విషయానికొస్తే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయని, ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ను నిర్దేశిస్తే తప్ప దీన్ని పరిష్కరించలేమని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల లభ్యత, ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి లాంటి ఇతర సదుపాయాల కల్పన లాంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆ అంశాలను పరిష్కరించిన తర్వాత తాము భారత్ లో ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా తయారు చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక పెట్టుబడులు పెడతామా లేదా అనే విషయం చేరువయ్యేదానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

EPF Account: వారం రోజుల్లో ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త

LIC Policy: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు ఇలా

కాగా, యమాహా ఇటీవలే ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత విపణిలో ఈవీలను ప్రవేశపెట్టడానికి కంపెనీకి ఇదే మొదటి అడుగు. ఫాసినో 125 ఎఫ్ఐ ఎలక్ట్రిక్ పవర్ అసిస్ట్ తో వచ్చింది.
Published by:Santhosh Kumar S
First published: