Yamaha Scooters: యమహా నుంచి రెండు హైబ్రిడ్ స్కూటర్లు లాంఛ్.. ధర, అదిరిపోయే ఫీచర్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

యమహా మోటార్స్ (Yamaha Motors)​ భారత మార్కెట్​లోకి ఒకేసారి రెండు హైబ్రిడ్​ స్కూటర్లను (Hybrid Scooters) లాంఛ్ చేసింది. యమహా రేజెడ్ఆర్ 125 ఫై, స్ట్రీట్ ర్యాలీ 125 ఫై పేర్లతో రెండు స్కూటర్ల(Scooter)ను మొత్తం ఏడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది.

  • Share this:
జపాన్ (Japan) ​కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటార్స్​ (Yamaha Motors) భారత మార్కెట్​ లోకి ఒకేసారి రెండు హైబ్రిడ్​ స్కూటర్లను (Hybrid System) లాంఛ్ చేసింది. యమహా రేజెడ్ఆర్ 125 ఫై (RayZR 125 Fi Hybrid) , స్ట్రీట్ ర్యాలీ 125 ఫై (Street Rally 125 Fi) పేర్లతో రెండు స్కూటర్లను మొత్తం ఏడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హైబ్రిడ్ వేరియంట్లను రూ. 76,830 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద విడుదల చేసింది. వీటిలో ఒకే రకమైన ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ (Fi), 125 సీసీ బ్లూ కోర్ ఇంజిన్​ను అందించింది. ఈ ఇంజిన్​ 6,500 rpm వద్ద 8.2 సీఎస్​ టార్క్​ను, 5,000 rpm వద్ద 10.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా (Yamaha) రెండు కొత్త స్కూటర్లలోనూ స్మార్ట్​ మోటార్​ జనరేటర్​ (SMG) సిస్టమ్‌ను చేర్చింది. పవర్​ అసిస్ట్​ ఫంక్షన్​ రద్దయిన మూడు సెకన్ల తర్వాత ఈ స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు, ఈ యమహా స్కూటర్​ను​ కనెక్ట్ ఎక్స్​ యాప్​తో కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఈ యాప్​ ద్వారా వెహికల్​ లొకేషన్​ (Vehicle Location), స్పీడ్ (Speed)​, పెట్రోల్ రీడింగ్ (Petrol Reading)​ వంటి కీలక సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యమహా స్కూటర్ల​లో క్వైట్ ఇంజిన్ స్టార్ట్ సిస్టమ్ (Quiet Engine Start System), ఆటోమేటిక్ స్టాప్ & స్టార్ట్ సిస్టమ్ (Automatic Stop & Start System), ఎల్​ఈడీ లైటింగ్ (LED lighting), యూనిఫైడ్ బ్రేక్ సిస్టమ్ (UBS), సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ (Side Stand Engine Cut off Switch), బ్లూటూత్ కనెక్టివిటీ (Bluetooth Connectivity) వంటి అనేక అద్భుతమైన ఫీచర్లను చేర్చింది.
Ola Electric Scooter: నేటి నుంచి ఓలా స్కూటర్ అమ్మకాలు ప్రారంభం... ధర ఎంతంటే

ఏడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులోకి..
యమహా "ది కాల్ ఆఫ్ ది బ్లూ" (“The Call of the Blue") క్యాంపెయిన్​లో భాగంగా ఈ కొత్త స్కూటర్లను లాంఛ్ చేసింది. భారత్​లో వీటి లాంచింగ్​పై యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) గ్రూప్ కంపెనీల ఛైర్మన్ మోటోఫుమి షితారా మాట్లాడుతూ.. ‘‘కొత్త రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ, స్ట్రీట్ ర్యాలీ 125 FI హైబ్రిడ్ వెర్షన్ల లాంచింగ్​ భారతదేశంలో మా హైబ్రిడ్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. గతంలో యమహా నుంచి విడుదలైన ఫాసినో 125 ఫై హైబ్రిడ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మళ్లీ, ఈ కొత్త వేరియంట్ల ద్వారా మార్కెట్‌లో మా స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలమని విశ్వసిస్తున్నాము.”అని అన్నారు.
Published by:Nikhil Kumar S
First published: