హోమ్ /వార్తలు /బిజినెస్ /

Yamaha FZ25: యమహా ఎఫ్‌జెడ్ 25 మోటో జీపీ ఎడిషన్.. ఈ 5 ఫీచర్లు సూపర్

Yamaha FZ25: యమహా ఎఫ్‌జెడ్ 25 మోటో జీపీ ఎడిషన్.. ఈ 5 ఫీచర్లు సూపర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Yamaha FZ 25 Features: యమహా ఎఫ్‌జెడ్ 25 మాన్​స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్‌ను బ్లాక్ బేస్ కలర్‌లో అందిస్తున్నారు. ఇక, దీని హెడ్‌ల్యాంప్ కౌల్, ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్‌ బ్లూ పెయింట్‌తో వస్తాయి. కొత్త యమహా బైక్‌లో కొన్ని కాస్మోటిక్​ మార్పులు కూడా చేశారు.

ఇంకా చదవండి ...

ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తాజాగా కొత్త బైక్​ను విడుదల చేసింది. తన పాపులర్​ ఎఫ్​జెడ్​ 25 మోడల్​లో మాన్​స్టర్​ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్​ను తీసుకొచ్చింది. ఈ మోడల్​ను భారత మార్కెట్​లో రూ.1,36,800 (ఎక్స్​షోరూమ్​, ఢిల్లీ) ధర వద్ద విడుదల చేసింది. అయితే ప్రామాణిక FZ25 మోడల్​తో పోలిస్తే ఈ మోడల్​కు అదనంగా రూ. 2,000 ఖర్చు అవుతుంది. కాల్ ఆఫ్ ది బ్లూ క్యాంపెయిన్​లో భాగంగా ఈ బైక్​ను లాంచ్ చేసినట్లు యమహా ఇండియా స్పష్టం చేసింది. యమహా ఇండియా నుంచి వచ్చిన ఈ బైక్​ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త మోటోజిపి వేరియంట్​లో కొన్ని కాస్మెటిక్​ అప్​గ్రేడ్స్​ను చేర్చింది. బీఎస్​ 6 ప్రమాణాలకు అనుగుణంగా దీనిలో 249 సీసీ ఎయిర్​ కూల్డ్​, ఫోర్​ స్ట్రోక్​, సింగిల్ సిలిండర్​ ఇంజిన్​ను పొందుపర్చింది. ఇది చూడటానికి ఎంతో స్టైలిష్​గా ఉంటుంది. ఈ కొత్త యమహా బైక్ గురించి ఈ 5 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

యమహా కొత్త మోడల్​ ఫీచర్లు ఇవే..

యమహా ఎఫ్‌జెడ్ 25 మాన్​స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్‌ను బ్లాక్ బేస్ కలర్‌లో అందిస్తున్నారు. ఇక, దీని హెడ్‌ల్యాంప్ కౌల్, ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్‌ బ్లూ పెయింట్‌తో వస్తాయి. కొత్త యమహా బైక్‌లో కొన్ని కాస్మోటిక్​ మార్పులు కూడా చేశారు. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి ఎడిషన్ ప్రామాణిక మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో టాకోమీటర్, స్పీడ్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, చెక్ ఇంజన్ ఇండికేటర్, ఓడోమీటర్ మొదలైన అన్ని అవసరమైన రీడౌట్‌ ఎల్‌సిడి ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్లను అందించారు. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి ఎడిషన్ 249 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 20.5 బిహెచ్‌పి, 20 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారు 5 స్పీడ్​ గేర్‌బాక్స్‌తో జతచేసి ఉంటుంది. దీని సస్పెన్షన్ సెటప్‌లో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులు, 7 దశల్లో సర్దుబాటు చేయగల మోనో-షాక్​లను అందించింది. అయితే బ్రేకింగ్ ఫోర్స్ కోసం 282 మి.మీ. ఫ్రంట్, 220 ఎం.ఎం. రియర్ డిస్క్ బ్రేక్స్​, డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌లను చేర్చింది.

Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Auto News, Yamaha

ఉత్తమ కథలు