Home /News /business /

YAMAHA E SCOOTERS EXHIBITION OF YAMAHA E SCOOTERS IN INDIA THESE ARE THE SPECIALTIES OF YAMAHA E01 NEOS SCOOTERS GH VB

Yamaha E-Scooters: ఇండియాలో యమహా ఈ-స్కూటర్ల ప్రదర్శన.. ఆవిష్కరించిన ఆ రెండు స్కూటర్ల ప్రత్యేకతలు ఇవే..

Yamaha bikes

Yamaha bikes

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఇటీవల మన దేశంలో జరిగిన డీలర్ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్‌లో కంపెనీ యమహా E01, యమహా NEO'S ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించింది.

జపనీస్ వాహన తయారీ సంస్థ యమహా(Yamaha) రెండు కొత్త ఎలక్ట్రిక్ బైక్స్‌ను(New Electric Bikes) భారత్‌లో ఆవిష్కరించింది. ఇటీవల మన దేశంలో జరిగిన డీలర్ ఎక్స్‌క్లూజివ్(Dealer Exclusive ) ఈవెంట్‌లో కంపెనీ యమహా E01, యమహా NEO'S ఎలక్ట్రిక్ స్కూటర్లను(Electric Scooters) ప్రదర్శించింది. వీటిలో NEO'S ఎలక్ట్రిక్ స్కూటర్ మార్చిలో యూరప్‌లో లాంచ్ అయింది. దీన్ని దశలవారీగా ఆసియా మార్కెట్‌కి తీసుకురావాలని యోచిస్తున్నట్లు యమహా(Yamaha) తెలిపింది. E01 మోడల్‌ను 125cc ICE స్కూటర్‌లతో పోల్చవచ్చు. NEO'S మోడల్‌ను 50cc ICE స్కూటర్‌ లైనప్‌తో పోల్చవచ్చు.

బజాజ్, టీవీఎస్ తర్వాత ఎలక్ట్రానిక్ స్కూటర్ల సెగ్మెంట్‌లో అగుడుపెడుతున్న కంపెనీగా యమహా నిలుస్తోంది. ఈ జపనీస్ వాహన తయారీదారు త్వరలో ఇండియన్ EV మార్కెట్లో ప్రవేశించే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పటికే యమహా ఫాసినో (Fascino), రేజడ్‌ఆర్ (RayZR) వంటి మోడళ్లతో ఇండియన్ కస్టమర్లకు చేరువైంది. భారతదేశంలో కంపెనీకి ఈ విభాగంలో మంచి పట్టు ఉంది. ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించింది.

Business Idea: ట్రెండింగ్‌లో ఉన్న బిజినెస్... రూ.70,000 పెట్టుబడి చాలు

* యమహా E01 ప్రత్యేకతలు
యమహా E01 ఈ-స్కూటర్ 125cc ICE పవర్డ్ స్కూటర్‌ల లైనప్‌కు ఏమాత్రం తీసిపోదు. ఈ రెండు స్కూటర్లలో E01 పెద్దది. దీంట్లో మ్యాక్సీ స్టైల్ ఇన్‌స్పైర్డ్ డిజైన్ లాంగ్వేజ్, ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, కాంపాక్ట్ విండ్‌స్క్రీన్, పెద్ద సింగిల్-పీస్ సీటు, ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ స్టార్ట్, రైడింగ్ మోడ్‌ వంటి ప్రత్యేకతలతో వస్తుంది. స్కిన్ కింద బ్యాటరీ ప్యాక్‌కు జత చేసిన 11kW మోటార్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే.. 80కిమీ డిస్టెన్స్ రేంజ్‌ను అందిస్తుంది.

* యమహా NEO'S ఫీచర్లు
తాజాగా కంపెనీ ప్రదర్శించిన రెండు ఈ-స్కూటర్లలో నియోస్ మోడల్ చిన్నది. ఈ కాంపాక్ట్ బైక్ రౌండెడ్ డిజైన్‌లో వస్తుంది. దీన్ని 50cc ఇంజిన్ స్కూటర్లతో పోల్చవచ్చు. దీని 2.5kW ఎలక్ట్రిక్ మోటార్.. సింగిల్ 50.4V, 19.2Ah లిథియం-అయాన్ బ్యాటరీతో జత అయ్యి ఉంటుంది. ఇది ECO మోడ్‌లో 38.5km రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఎడిషనల్ బ్యాటరీ ప్యాక్ (డ్యుయల్ బ్యాటరీ సెటప్) ఇన్‌స్టాల్ చేస్తే.. రైడింగ్ రేంజ్ 68కి.మీలకు పెరుగుతుంది. BLDC హబ్ మోటార్ స్టాండర్డ్ మోడ్‌లో 3.4PS గరిష్ట శక్తిని, 136Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వాల్ సాకెట్ ఛార్జర్ ద్వారా బ్యాటరీ 8 గంటల్లో ఛార్జ్ అవుతుంది.

* ధర ఎంత?
యూరప్ మార్కెట్‌లలో యమహా NEO'S ధర EUR 3,005 (సుమారు రూ. 2.52 లక్షలు)గా ఉంది. ఈ ధర ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న అన్ని ఈ-స్కూటర్‌ల కంటే ఎక్కువ. యమహా E01 ప్రస్తుతం జపాన్‌లో ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే లీజుకు అందుబాటులో ఉంది. దీన్ని లాంచ్ చేశాకే ధర వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: Auto, E scootor, Electric bike, Yamaha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు