Home /News /business /

YAMAHA AEROX 155 LAUNCHED IN INDIA HERE IS ENGINE SPECIFICATIONS PRICE DETAILS GH SK

Yamaha Aerox 155 Review: మార్కెట్లోకి యమహా ఏరోక్స్ 155 స్కూటర్.. ఇది నిజంగా గేమ్ ఛేంజరా?

యమహా ఏరోక్స్ 155

యమహా ఏరోక్స్ 155

Yamaha Aerox 155: యమహా ఏరోక్స్ 155 బేస్ వేరియంట్‌ను కంపెనీ రూ. 1.29 లక్షల వద్ద విడుదల చేసింది. ఈ స్కూటర్ గతంలోనే థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్ వంటి అనేక ఆగ్నేయాసియా మార్కెట్లలో విక్రయానికి వచ్చింది. ఇప్పుడు భారత్‌లో లాంచ్ అయింది.

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్లో కొత్త మాక్సీ స్కూటర్ ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) ను లాంచ్ చేసింది. గతంలో యమహా నుంచి విడుదలైన యమహా ఆర్డీ 350 (Yamaha RD 350) , యమహా ఆర్ఎక్స్100 (Yamaha RX 100) మార్కెట్లో గణనీయమైన క్రేజ్ సంపాదించాయి. ఆ తర్వాత వచ్చిన యమహా ఎఫ్‌జెడ్- సిరీస్, యమహా ఆర్15 కూడా తనదైన ముద్ర వేసుకున్నాయి. ఆర్15, ఎఫ్ జెడ్ బైక్‌లకు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కలర్, డిజైన్‌లో మార్పులు చేస్తూ అప్‌గ్రేడ్ వెర్షన్లను లాంచ్ చేస్తోంది. అంతేతప్ప కంపెనీ నుంచి ఇటీవల కొత్త బైక్ రిలీజ్ కాలేదు. ఈ సమయంలోనే యమహా తన విప్లవాత్మకమైన యమహా ఏరోక్స్ 155 బైక్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌ను గేమ్ ఛేంజర్‌గా పేర్కొంది.

ఈ స్కూటర్ గతంలోనే థాయ్‌లాండ్ (Thailand), ఫిలిప్పీన్స్ (Philippines) వంటి అనేక ఆగ్నేయాసియా మార్కెట్లలో విక్రయానికి వచ్చింది. ఇప్పుడు భారత్‌లో లాంచ్ అయింది. ఇది దేశంలోనే మొట్టమొదటి 155 సిసి స్కూటర్ కావడం విశేషం. కంపెనీ తాజాగా దీని టెస్ట్ రైడ్ నిర్వహించింది. రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

LIC Pension Policy: ఈ ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే 40 ఏళ్ల నుంచే పెన్షన్

యమహా ఏరోక్స్ 155 డిజైన్, ఫీచర్లు

ఏరోక్స్​ 155 చాలా అట్రాక్టివ్​ డిజైన్​ కలిగి ఉంటుంది. ఇది రేసీ ఫ్రంట్ ఎండ్ డిజైన్‌తో వస్తుంది. దీని ముందు భాగంలో ఆప్రాన్ బైక్ ఫెయిరింగ్‌ను అందించింది. మరోవైపు డీఆర్​ఎల్​ ట్విన్ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఏరోక్స్ 155 నెగటివ్ డిస్‌ప్లే ఎల్​సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుంది. దీనిలో స్పీడో, ఓడో, టెల్ టేల్స్, ఫ్యూయల్ గేజ్‌ని కూడా అందించింది. యమహా కంపెనీ వై కనెక్ట్ బ్లూటూత్ సూట్‌ను కూడా చేర్చింది.

డిజిటల్ గోల్డ్‌పై లోన్ తీసుకోవడం ఎలా...తక్షణమే రూ.60 వేల వరకూ లోన్

ఇంజిన్ ఎలా ఉంది?

యమహా ఏరొక్స్​ 155 ఇంజిన్​ విషయానికి వస్తే.. ఇది గరిష్టంగా 8,00 ఆర్​పీఎమ్​ వద్ద 15.36 బిహెచ్​పి పవర్​, 6500 ఆర్​పిఎమ్​ వద్ద 13.9 ఎన్​ఎమ్​ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్​ గేర్​బాక్స్​తో జతచేసి ఉంటుంది. ఈ స్కూటర్​లోని ఇంజిన్​ ఉత్పత్తి చేసే శక్తి, లేటెస్ట్ యమహా ఆర్​ 15 వి7 4.0 మోడల్ ఉత్పత్తి చేసే శక్తి కంటే 4 బిహెచ్​పి వరకు తక్కువగా ఉంటుంది. ఈ కొత్త స్కూటర్​ 25 లీటర్ల అండర్​ సీట్ స్టోరేజ్​ని పొందుతుంది. కాబట్టి, ఇందులో రెండు స్టాండర్డ్​ సైజు హెల్మెట్​లను సులభంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో ట్రాక్షన్​ కంట్రోల్ సిస్టమ్​ కోసం డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, కీలెస్​ ఆపరేషన్​, ఛార్జింగ్​ సాకెట్, సింగిల్​ ఛానల్​ ఏబీఎస్​ కూడా ఉంటుంది. ఈ స్కూటర్​లో బ్లూటూత్​ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనికి రెండు వైపులా 14 ఇంచెస్​ అల్లాయ్​ వీల్స్​ను చేర్చింది. ఈ స్కూటర్​ అప్రిలియా ఎస్​ఎక్స్​ఆర్​ 160కి గట్టి పోటీనివ్వనుంది.

అబుదాబి కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీతో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒఫ్పందం...

రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
స్కూటర్‌ను ప్రారంభించగానే మోటార్ ఎటువంటి శబ్ధం లేకుండా స్కూత్‌గా స్టార్ట్ అవుతుంది. మీ మణికట్టును ట్విస్ట్ చేస్తే స్కూటర్‌ను సింపుల్‌గా టర్న్ చేయవచ్చు. దీనిలో థొరెటల్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇది సడెన్ ఓవర్‌టేకింగ్ మూమెంట్స్‌ను సులభతరం చేస్తుంది. ఈ ఏరోక్స్ స్కూటర్‌పై 80 నుంచి 90 kmph మధ్య సాఫీగా ప్రయాణించవచ్చు. గరిష్టంగా115kmph కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించవచ్చు. ఈ యమహా ఏరోక్స్ 155 బేస్ వేరియంట్‌ను కంపెనీ రూ. 1.29 లక్షల వద్ద విడుదల చేసింది కంపెనీ.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Bikes, Business, SCOOTER

తదుపరి వార్తలు