Mi LED Smart Bulb: జియోమీ లెడ్ స్మార్ట్ బల్బ్... మొబైల్‌తో పనిచేస్తుంది

Mi LED Smart Bulb: బహుశా మనం ఊహించి ఉండం... మన ఇళ్లలో బల్బులను కూడా మొబైల్‌తో ఆపరేట్ చేయగల రోజులు వచ్చేశాయి. జియోమీ లెడ్ స్మార్ట్ బల్బ్... మొబైల్‌తో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 30, 2020, 2:05 PM IST
Mi LED Smart Bulb: జియోమీ లెడ్ స్మార్ట్ బల్బ్... మొబైల్‌తో పనిచేస్తుంది
జియోమీ లెడ్ స్మార్ట్ బల్బ్... మొబైల్‌తో పనిచేస్తుంది
  • Share this:
Mi LED Smart Bulb: మీరు ఇంట్లో లైట్ ఆఫ్ చెయ్యడం మర్చిపోయి... ఆఫీస్‌కి వెళ్లిపోయారనుకుందాం. మీరు ఆఫీస్‌లో ఉండే దాన్ని ఆఫ్ చెయ్యవచ్చు. స్మార్ట్ ఫోన్ల కంపెనీ జియోమీ... స్మార్ట్ లివింగ్‌కి ఉపయోగపడే రకరకాల వస్తువుల్ని ఎప్పటికప్పుడు తయారుచేస్తోంది. ఇప్పటిక Mi బ్యాండ్ 5, Mi వాచ్ రివాల్వ్, Mi స్మార్ట్ స్పీకర్ తయారుచేసిన ఈ కంపెనీ... తాజాగా... స్మార్ట్ లెడ్ బల్బ్ తయారుచేసి... లాంచ్ చేసింది. ఈ లెడ్ బల్స్ కాంతి... 810lm ఉంటుందని వివరించింది. వినియోగదారులు వారి అవసరాలకు తగ్గట్టు... కాంతిని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చని తెలిపింది. ఈ లెడ్ బల్బు ధరను రూ.499గా కంపెనీ ప్రకటించింది. దీన్ని Mi ఇండియా... అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుక్కోవచ్చని తెలిపింది.

ఈ స్మార్ట్ బల్బ్ వైట్ కలర్లో ఉంది. దీన్ని B22 కేస్‌లో సెట్ చేసి ఇస్తున్నారు. భారతీయుల ఇళ్లను దృష్టిలో పెట్టుకొని ఈ బల్బు తయారుచేసినట్లు Mi ఇండియా తెలిపింది. ఈ బల్బు వల్ల ఎలాంటి మంటలు, కాలడాల వంటివి జరగవని తెలిపింది.


దీన్ని వాడే వినియోగదారులు... Mi Home App ద్వారా ఈ బల్బును స్విట్చ్ ఆన్, స్విట్చ్ ఆఫ్ చేసుకోవచ్చనీ, యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.


అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ద్వారా... వాయిస్ సపోర్ట్ కూడా చేస్తుంది ఈ బల్బ్. వినియోగదారులు... తమ వాయిస్ కమాండ్స్ ఇవ్వడం ద్వారా... ఈ బల్బ్ కాంతిని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు.

ఈ బల్పు సర్వీస్ లైఫ్ 15,000 గంటలు:
ఈ స్మార్ట్ బల్బ్ ఎక్కువ కరెంటు కాల్చదు. అందువల్ల కరెంటు బిల్లు తక్కువే వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బల్బు మొత్తం 15,000 గంటలు సర్వీస్ ఇస్తుందని జియోమీ తెలిపింది. అంటే... రోజుకు 6 గంటల పాటూ ఈ బల్బును వాడితే... 7 సంవత్సరాల వరకూ ఇది పనిచేస్తుందన్నది కంపెనీ చెబుతున్న మాట.
Published by: Krishna Kumar N
First published: September 30, 2020, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading