హోమ్ /వార్తలు /బిజినెస్ /

Redmi Note 9: రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Redmi Note 9: రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Redmi Note 9: రెడ్‌మీ నోట్ 9 వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Redmi Note 9: రెడ్‌మీ నోట్ 9 వచ్చేస్తోంది... ఫీచర్స్ ఇవే

Xiaomi Redmi Note 9 | షావోమీ నుంచి రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ త్వరలో రిలీజ్ కానుంది. ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు తెలుసుకోండి.

షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఇండియన్ మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 9 రిలీజ్ చేయనుంది షావోమీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే లాంచింగ్ డేట్ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి టీజర్ మాత్రమే రిలీజ్ చేసింది. క్వాడ్ కెమెరా సెటప్‌తో రెడ్‌మీ నోట్ 9 రానుంది. అయితే ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. మరి ఇండియాకు వచ్చే సరికి స్పెసిఫికేషన్స్ ఏవైనా మారతాయేమో తెలియదు. గ్లోబల్ మార్కెట్‌లో రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో రిలీజైంది. ఇండియాలో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో రిలీజ్ అయ్యే అవకాశముంది. క్వాడ్ కెమెరా, 5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ నోట్ 9 ధర ఇండియాలో రూ.10,000 పైనే ఉండొచ్చని అంచనా. గ్లోబల్ మార్కెట్‌లో రిలీజైన రెడ్‌మీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 9 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్‌ప్లే: 6.53 అంగుళాల ఐపీఎస్ ఫుల్ హెచ్‌డీ+

ర్యామ్: 4జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85

రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్

బ్యాటరీ: 5,020ఎంఏహెచ్ (18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)

First published:

Tags: Redmi, Smartphone, Smartphones, Xiaomi