MI LED TV: ఇండియాలో రెండు టీవీలు రిలీజ్ చేసిన షావోమీ

MI LED TV | 43 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ప్రో, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో లాంఛ్ చేసింది షావోమీ. వాటితో పాటు టీవీల కోసం స్మార్ట్‌ స్పీకర్ ఎంఐ సౌండ్‌బార్ కూడా లాంఛ్ చేసింది.

news18-telugu
Updated: January 11, 2019, 9:37 AM IST
MI LED TV: ఇండియాలో రెండు టీవీలు రిలీజ్ చేసిన షావోమీ
MI LED TV 4X PRO, MI TV 4A PRO: షావోమీ నుంచి మరో రెండు టీవీలు
news18-telugu
Updated: January 11, 2019, 9:37 AM IST
షావోమీ మరో రెండు కొత్త టీవీలను ఇండియాలో లాంఛ్ చేసింది. మీరు సంక్రాంతి పండుగకు కొత్త టీవీలు కొనాలనుకుంటే వీటిని ట్రై చేయొచ్చు. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో, ఎంఐ టీవీ 4ఏ ప్రోతో పాటు సౌండ్‌బార్ రిలీజ్ చేసింది షావోమీ. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి పట్టు సాధించిన షావోమీ గతేడాది ఇండియాలో కొన్ని టీవీలు లాంఛ్ చేసింది. వాటి ద్వారా టెలివిజన్ మార్కెట్‌లోనూ మంచి పోటీ ఇస్తోంది. ఇప్పుడు 43 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ప్రో, 55 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో లాంఛ్ చేసింది షావోమీ. వాటితో పాటు టీవీల కోసం స్మార్ట్‌ స్పీకర్ ఎంఐ సౌండ్‌బార్ కూడా లాంఛ్ చేసింది.

ఎంఐ టీవీ 4ఏ ప్రో స్పెసిఫికేషన్స్


షావోమీ రూపొందించిన ప్యాచ్‌వాల్ ఓఎస్ ఆధారంగా నడిచే ఆండ్రాయిడ్ టీవీ ఇది. అల్ట్రా-బ్రైట్ ఎల్ఈడీ డిస్‌ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 20 వాట్ స్పీకర్స్, 3 యూఎస్‌బీ పోర్ట్స్, 3హెచ్‌డీఎంఐ పోర్ట్స్, 1 ఎథర్నెట్ పోర్ట్, 1 ఏవీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఏఆర్11 బ్లూటూత్ రిమోట్ వాయిస్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయొచ్చు. ఎంఐ టీవీ 4ఏ ప్రో ధర రూ.22,999. జనవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు mi.com వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది.

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్స్


ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో టీవీ కూడా ప్యాచ్‌వాల్ ఓఎస్‌తో పనిచేసే ఆండ్రాయిడ్ టీవీ. 4కే హెచ్‌డీఆర్ ఎల్ఈడీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, బ్లూటూత్ రిమోట్ వాయిస్ కంట్రోల్‌, 20 వాట్ స్పీకర్స్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, 3హెచ్‌డీఎంఐ పోర్ట్స్, 1 ఎథర్నెట్ పోర్ట్, 1 ఏవీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో ధర రూ.39,999. జనవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు mi.com వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది.



ఎంఐ సౌండ్ బార్
ఎంఐ టీవీ 4ఏ ప్రో, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రో టీవీలతో పాటు 32.6 అంగుళాల సౌండ్ బార్ లాంఛ్ చేసింది షావోమీ. ధర రూ.4,999. జనవరి 16 మధ్యాహ్నం 12 గంటలకు mi.com వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది.
Loading...

ఇవి కూడా చదవండి:

Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండి

Fake Apps: 85 యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?

PUBG Mobile: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు చేస్తే నిషేధం తప్పదు
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...