Home /News /business /

XIAOMI FOLLOWS APPLE DECISION OF DITCHING WALL CHARGERS FROM RETAIL BOXES NS GH

Smartphones without chargers: ఆ స్మార్ట్ ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వమని ప్రకటించిన కంపెనీ.. అప్పట్లో విమర్శించి, ఇప్పుడు అదే బాటలో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం విడుదలైన Mi 11 స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్‌ను ఇవ్వకుండా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది కంపెనీ. గతంలో ఐఫోన్ 12తో ఛార్జర్‌ను ఇవ్వనందుకు యాపిల్‌ను తిట్టిపోసిన షియోమి.. ఇప్పుడు అదే బాటలో వెళ్లడం విశేషం.

స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల మధ్య ఉండే పోటీ మామూలుగా ఉండదు. పోటీ సంస్థల తప్పులు, లోపాలు ఎప్పుడు బయటపెడదామా అని కంపెనీలు వేచిచూస్తాయి. ఒక్కొసారి మాటల యుద్ధాలకు కూడా వెనకాడవు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల విభాగంలో యాపిల్, శామ్‌సంగ్, షియోమి సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. లగ్జరీ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో మిగతా కంపెనీలకు అందనంత ఎత్తులో యాపిల్ ఉంది. ఆ సంస్థ నుంచి మార్కెట్లోకి వచ్చే ఉత్పత్తుల నాణ్యతతో పాటు వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. తాజాగా యాపిల్ సెట్ చేసిన కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్న కంపెనీల జాబితాలో షియోమి కూడా చేరింది. ఆ సంస్థ నుంచి సోమవారం విడుదలైన Mi 11 స్మార్ట్‌ఫోన్‌తో ఛార్జర్‌ను ఇవ్వకుండా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గతంలో ఐఫోన్ 12తో ఛార్జర్‌ను ఇవ్వనందుకు యాపిల్‌ను తిట్టిపోసిన షియోమి.. ఇప్పుడు అదే బాటలో వెళ్లడం విశేషం.

గతంలో ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లను ఛార్జర్‌ లేకుండానే యాపిల్ తమ కస్టమర్లకు అందించింది. అనంతరం కొత్త మోడళ్లతో ఛార్జర్‌ను ఇవ్వకూడదని ఆ సంస్థ నిర్ణయించింది. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మొట్టమొదటిసారి విమర్శలు చేసింది షియోమీనే కావడం విశేషం. కస్టమర్లకు ఛార్జర్లు ఇవ్వకపోవడం ఏంటని అప్పట్లో యాపిల్‌ను ట్రోల్ చేసింది కూడా. మూడు నెలల తరువాత షియోమి ఆలోచన ఎందుకు మారిందోనని కస్టమర్లు చర్చించుకుంటున్నారు.

యాపిల్‌పై ప్రభావం పడలేదు
సాధారణంగా యాపిల్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్లతో పాటు 20W ఛార్జర్‌ను అందిస్తుంది. కానీ యాపిల్ యూజర్లు బయట దొరికే ఫాస్ట్ ఛార్జర్‌లను ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో కొత్త ఫోన్లతో ఛార్జర్‌ ఇవ్వకపోయినా కస్టమర్లపై పెద్దగా ప్రభావం పడలేదు. అప్పట్లో ఆ సంస్థ తీసుకున్న నిర్ణయం పెద్దగా ఆశర్చపరచలేదు. కానీ షియోమి నుంచి వచ్చిన Mi 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు 55W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను కొనాలనుకునేవారు Mi బ్రాండ్‌ను ఎంచుకుంటారు. అందువల్ల 55W ఛార్జర్‌ను కొనాలంటే కస్టమర్లపై భారం పెరుగుతుంది. షియోమి తీసుకున్న ఈ నిర్ణయంపై కస్టమర్లు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

కస్టమర్లకు భారమే
Mi 11 స్మార్ట్‌ఫోన్‌ను షియోమి డిసెంబర్ 28న చైనాలో విడుదల చేసింది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌తో మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి హ్యాండ్‌సెట్. ఈ స్మార్ట్‌ఫోన్ షియోమి స్టైల్ కాంపిటీటివ్ ప్రైసింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. దీంతో దీనిపై అంచనాలు పెరిగిపోయాయి. Mi 11తో ఛార్జర్‌ను ఇవ్వట్లేదని షియోమి సీఈఓ లీజున్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తక్కువ బరువుతో తేలికైన ప్యాకేజీలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లకు అందిస్తున్నామని తెలిపారు. కస్టమర్లు తమ ఉన్న పాత ఛార్జర్లను ఛార్జింగ్ కోసం వాడుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతు సాయంగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్పారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Apple, Iphone, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు