Reliance: పర్యావరణహిత ఫ్యాషన్ వేర్‌ తయారీపై రిలయన్స్ దృష్టి

భారతదేశంలో పెట్ బాటిల్స్ రీసైక్లింగ్‌లో అగ్రగామిగా ఉన్న రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఏటా 2 బిలియన్ల ఉపయోగించిన పెట్ బాటిల్స్‌ను ప్రాసెస్ చేస్తోంది. మరో రెండేళ్లలో వాటి సంఖ్యను 6 బిలియన్లకు చేర్చాలని భావిస్తోంది.

news18-telugu
Updated: September 16, 2019, 6:47 PM IST
Reliance: పర్యావరణహిత ఫ్యాషన్ వేర్‌ తయారీపై రిలయన్స్ దృష్టి
Reliance: పర్యావరణహిత ఫ్యాషన్ వేర్‌ తయారీపై రిలయన్స్ దృష్టి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 16, 2019, 6:47 PM IST
సస్టెయినబుల్ ఫ్యాషన్... అంటే పర్యావరణహితమైన దుస్తులు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరుగుతున్న అంశమిది. పర్యావరణహిత ఫ్యాషన్ వేర్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. పర్యావరణహిత దుస్తుల్ని సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL ప్రణాళికలు రూపొందిస్తోంది. హబ్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం టెక్స్‌టైల్ ఇండస్ట్రీలోని నూలు, టెక్స్‌టైల్ తయారీదారులు, దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, రీటైలర్లు, ఫ్యాషన్ హౌజులతో కలిసి పనిచేస్తోంది రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. కో-బ్రాండెడ్ దుస్తులు తయారుచేసేందుకు ఇప్పటికే ఓ వ్యూహాన్ని రూపొందించింది. యారో, వ్రాంగ్లర్, రేమాండ్, లీ లాంటి ఇతర అంతర్జాతీయ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

మా దృష్టిలో సస్టెయినబుల్ (పర్యావరణహిత) అనేది ఆషామాషీ పదం కాదు. సస్టెయినబుల్ ఫ్యాషన్ వేర్ తీసుకొచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. కానీ కాస్త ఎక్కువ చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. అందుకే సరైన ధరలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సి ఉంటుంది. సస్టెయినబుల్ ఫ్యాషన్ వేర్‌కు ప్రీమియం ధరలు చెల్లిస్తే పర్యావరణానికీ మేలు జరుగుతుంది.
విపుల్ షా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, RIL పెట్రో కెమికల్స్ విభాగం


Reliance Industries limited, sustainable clothing, Reliance sustainable clothing, affordable ethical clothing, eco friendly clothing stores, sustainable clothing india, sustainable fashion articles, eco clothing, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సస్టెయినబుల్ క్లోతింగ్, పర్యావరణహిత దుస్తులు, రిలయెన్స్ పర్యావరణహిత దుస్తులు, ఇకో క్లోతింగ్, ఇకో దుస్తులు, ఇకో ఫ్యాషన్ వేర్
ప్రతీకాత్మక చిత్రం




భారతదేశంలో పెట్ బాటిల్స్ రీసైక్లింగ్‌లో అగ్రగామిగా ఉన్న రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఏటా 2 బిలియన్ల ఉపయోగించిన పెట్ బాటిల్స్‌ను ప్రాసెస్ చేస్తోంది. మరో రెండేళ్లలో వాటి సంఖ్యను 6 బిలియన్లకు చేర్చాలని భావిస్తోంది. పెట్ బాటిల్స్ తయారీకి పెట్ రెసిన్ ఉత్పత్తి చేయడం, వ్యర్థ పెట్ బాటిల్స్ సేకరణ, పర్యావరణానికి హాని చేయని ఫైబర్స్‌గా తయారు చేయడం, వాటి ద్వారా ఫ్యాషన్ దుస్తులుగా మార్చడం... ఇలా ఓ వలయాన్ని ఏర్పరుస్తున్న కంపెనీ ప్రపంచంలో ఇదొక్కటే. ప్లాస్టిక్ బాటిల్స్ వ్యర్థాలుగా డ్రైనేజీ వ్యవస్థలు అడ్డంకులు ఏర్పరుస్తున్న సమస్య అంతటా ఉంది. అందుకే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌ కాన్సెప్ట్‌పై ప్రజలకు 2000 సంవత్సరం నుంచి అవగాహన కల్పిస్తోంది రిలయెన్స్. స్విమ్ వేర్ నుంచి వింటర్ వేర్, బ్యాక్ పాక్స్ వరకు రీసైకిల్డ్ మెటీరియల్‌తోనే తయారు చేస్తున్నాయి గ్లోబల్ బ్రాండ్స్. భారతదేశం కూడా వ్యర్థాలనే వనరులుగా ఉపయోగించుకొని ఇలాంటి ఉత్పత్తులు చేసే దిశగా ముందడుగులు పడుతున్నాయి.

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి

Loading...
ఇవి కూడా చదవండి:

Flipkart: ఫ్లిప్‌కార్ట్ యాప్ ఉందా? ఫ్రీగా సినిమాలు చూడొచ్చు ఇలా

Amazon Sale: సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... ఆఫర్లు ఇవే

Flipkart Sale: సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్లు తెలుసుకోండి
First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...