హోమ్ /వార్తలు /బిజినెస్ /

Electric Airplane: ప్రపంచంలో మొదటి ఎలక్ట్రిక్‌ ఫ్లైట్‌ జర్నీ సక్సెస్.. ప్రత్యేకతలివే..

Electric Airplane: ప్రపంచంలో మొదటి ఎలక్ట్రిక్‌ ఫ్లైట్‌ జర్నీ సక్సెస్.. ప్రత్యేకతలివే..

(Photo: Eviation)

(Photo: Eviation)

Electric Airplane: ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పేరున్న ‘ఆలిస్’ అనే విమానం విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించింది. ఏవియేషన్ రంగంలో ఇది ఒక కీలక మలుపు అంటున్నారు నిపుణులు. ఈ విద్యుత్ విమానం ప్రత్యేకతలు చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ప్రపంచ దేశాలు చాలా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicles)ను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బైకులు (Electric Bikes), కార్ల తయారీలో చాలా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ కూడా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆటో రంగానికి పరిమితమైన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ఏవియేషన్‌ రంగానికి కూడా విస్తరించింది. తాజాగా ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌గా పేరున్న ‘ఆలిస్’ అనే విమానం విజయవంతంగా గగన వీధుల్లో ప్రయాణించింది. ఏవియేషన్ రంగంలో ఇది ఒక కీలక మలుపు అంటున్నారు నిపుణులు. ఈ విద్యుత్ విమానం ప్రత్యేకతలు చూద్దాం.

* పేరు ఆలిస్‌

ప్రపంచంలోని మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆలిస్ (Alice) అని పేరు పెట్టారు. దీన్ని ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ (Eviation Aircraft) అనే కంపెనీ తయారు చేసింది. తాజాగా అమెరికా, వాషింగ్టన్‌లోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (MWH) ఆలిస్‌ తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఉదయం 7:10 గంటలకు బయలుదేరిన ఫ్లైట్ 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు ప్రయాణించింది.

* స్పెసిఫికేషన్లు ఇవే

ఆలిస్ విమానం జీరో ఎమిషన్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. లైట్ జెట్‌లు, హై-ఎండ్ టర్బోప్రోప్స్‌తో పోలిస్తే దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. 9 సీటర్ కమ్యూటర్, 6 సీటర్ ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈకార్గో అనే మూడు వేరియంట్‌లలో ఇది లభిస్తుంది. ప్యాసింజర్ వెర్షన్‌కు గరిష్టంగా 1,134 కిలోల లోడ్ కెపాసిటీ, ఈకార్గో వెర్షన్‌కు 1,179 కిలోల కెపాసిటీ ఉంది. ఆలిస్‌ గరిష్టంగా 260 నాట్ల ఆపరేటింగ్ స్పీడ్‌తో ట్రావెల్‌ చేస్తుంది. అన్ని వేరియంట్లలో ఇద్దరు సిబ్బంది ప్రయాణించే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ క్యాబిన్, ఈకార్గో వేరియంట్స్‌లో లోపలి భాగం మినహా మిగతా అన్నీ కమ్యూటర్‌ కాన్ఫిగరేషన్‌కు సమానంగా ఉంటాయి.

* మొదలైన ఆర్డర్లు

ప్రస్తుతం నాయిస్ సమస్యలు లేదా రెస్ట్రిక్టెడ్‌ ఆపరేటింగ్ అవర్స్‌ కారణంగా కమర్షియల్‌ ఫ్లైట్స్‌ ఉపయోగించని విమానాశ్రయాల నుంచి ఆల్-ఎలక్ట్రిక్ ఆలిస్‌ను ఆపరేట్ చేయవచ్చు. కార్గో మార్కెట్‌ ఈ ప్లెయిన్స్‌ టార్గెట్‌గా ఉంది. దీన్ని సాధారణంగా 150 మైళ్ల నుంచి 250 మైళ్ల వరకు నడపవచ్చు. అమెరికాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థలైన కేప్ ఎయిర్, గ్లోబల్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్ వరుసగా 75, 50 యూనిట్ల ఆలిస్ విమానాల కోసం ఆర్డర్ చేశాయి. DHL ఎక్స్‌ప్రెస్ 12 ఆలిస్ ఈకార్గో విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది.

ఇది కూడా చదవండి : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఆ ట్రైన్స్ టైమింగ్స్ మార్పు.. తెలుసుకోండి

* ఈ రంగంలో ముందడుగు

అఫర్డ్‌బుల్, క్లీన్, సస్టైనబుల్‌ ఏవియేషన్‌ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజలకు తెలుస్తుందన్నారు ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ సీఈవో గ్రెగొరీ డేవిస్. ఈ రంగంలో వచ్చిన తాజా మలుపు, సరికొత్త ఆవిష్కరణకు దారి తీస్తుందన్నారు. భవిష్యత్తులో ప్యాసింజర్‌, కార్గోలలో భిన్నమైన మార్పులు వస్తాయని చెప్పారు. తమ ఏవియేషన్ బిజినెస్‌లో 80 శాతాన్ని ఆలిస్‌ కవర్ చేయగలదని చెబుతున్నారు కేప్ ఎయిర్ వ్యవస్థాపకుడు, బోర్డు ఛైర్మన్ డాన్ వోల్ఫ్.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Electric Vehicles, Flight

ఉత్తమ కథలు