హోమ్ /వార్తలు /బిజినెస్ /

World EV Day 2022: నేడు వరల్డ్‌ ఈవీ డే.. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో టాప్ కంపెనీలు ఇవే..

World EV Day 2022: నేడు వరల్డ్‌ ఈవీ డే.. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌లో టాప్ కంపెనీలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World EV Day 2022: ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి ఈరోజు ఒక స్పెషల్ డే. ఏటా సెప్టెంబర్ 9న ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ స్పెషల్ డే లక్ష్యం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఆటోమొబైల్ ఇండస్ట్రీ (Automobile Industry)కి సంబంధించి ఈరోజు ఒక స్పెషల్ డే. ఏటా సెప్టెంబర్ 9న ప్రపంచ ఎలక్ట్రిక్‌ వాహనాల దినోత్సవం (World EV Day 2022)గా జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ స్పెషల్ డే లక్ష్యం. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల అవసరం, పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తారు. ప్రపంచ దేశాలు సైతం పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇండియాలో కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల (Electric Vehicles) కొనుగోలుపై రాయితీలు ఉన్నాయి. వరల్డ్ ఈవీ డే సందర్భంగా మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల బిజినెస్‌లో టాప్ కంపెనీలు ఏవో చూద్దాం.* వేగంగా అభివృద్ధి
కొన్ని సంవత్సరాలుగా భారతీయ ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డీజిల్‌, పెట్రోలుతో నడిచే వాహనాల నుంచి ఎక్కువ మంది ఎలక్ట్రిక్‌ వాహనాలకు మారుతున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలును పెంచేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌కు కారణమవుతున్నాయి. ఆర్థికంగా కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలతో ప్రయోజనాలు ఉండటంతో ఈ మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
* రాణిస్తున్న ఓలా (Ola), ఏథర్‌
భారతీయ మార్కెట్‌లోని ఆటో దిగ్గజాలు, అభివృద్ధి చెందుతున్న కొత్త సంస్థలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను లాంచ్‌ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఓలా, ఏథర్ వంటి కంపెనీలు విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్‌ ప్యాసింజర్ కార్ల విభాగంలో ఇండియాలోని టాప్‌ వాహనాల తయారీ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.* టాప్ కంపెనీలు
ఇప్పటివరకు దేశంలోని ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ రంగంలో భారతీయ బ్రాండ్ టాటా(TATA) ఆధిపత్యం చెలాయించింది. టాటా ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. కంపెనీ ఆర్థిక సంవత్సరం 2022లో అత్యధికంగా 19,106 యూనిట్ల ఎలక్ట్రిక్‌ వాహనానలు విక్రయించినట్లు పేర్కొంది. ఈ విభాగంలో 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టాటా 353 శాతం అభివృద్ధిని చూపింది. టాటా ప్రస్తుతం కాంపాక్ట్ SUV నెక్సాన్, టిగోర్ EV ఎలక్ట్రిక్ వేరియంట్‌తో లైనప్‌లో మరో రెండు EVలను అందిస్తోంది.
* రూ.15,000 కోట్ల పెట్టుబడి
టాటా వచ్చే ఐదేళ్లలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విభాగంలో రూ.15,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ మొత్తాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని పెంచడానికి, మార్కెట్లో కొత్త ప్రొడక్టులను లాంచ్‌ చేయడానికి ఉపయోగించనున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి : అప్పు చేసి ఆ షేర్లు కొన్న 20 ఏళ్ల విద్యార్థి..కేవలం నెల రోజుల్లోనే 600 కోట్లు లాభం పొందాడు
* 2025లో సుజుకి ఎలక్ట్రిక్‌ కారు
హ్యుందాయ్, టాటా, ఎంజీ(MG) వంటి ఆటో దిగ్గజాలు ఇప్పటికే భారతీయ ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో తమదైన ముద్ర వేశాయి. అయితే దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి(Maruti Suzuki) 2025 నాటికి భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది.
* ఇతర కంపెనీలు
మహీంద్రా తన మొదటి పూర్తి స్థాయి ప్యాసింజర్ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను లాంచ్‌ చేసి ఈవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. పాపులర్‌ మిడ్‌సైజ్‌ ఆల్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ కారు ICE SUV XUV 300ను మహీంద్రా అందుబాటులోకి తీసుకురానుంది. హ్యుందాయ్(Hyundai) 2019లో కోనా లాంచ్‌తో భారతీయ ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ఎంజీ 2020లో ZS EVని లాంచ్‌ చేసింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Electric Vehicles, Ola electric, Tata Motors

ఉత్తమ కథలు