హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Economy: అద్భుతంగా పుంజుకుంది.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు

Indian Economy: అద్భుతంగా పుంజుకుంది.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian Economy: కరోనా కాలంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ అద్భుతంగా పుంజుకుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ఐతే ఇంకా పూర్తిగా బయటపడలేదని పేర్కొంది.

గతేడాది కరోనా దెబ్బకు అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కరోనాతో పాటు లాక్‌డౌక్‌తో చాలా రంగాలు కుదేలయ్యాయి. వ్యాపారులు నష్టాల పాలయ్యారు. యువత ఉద్యోగాలు కోల్పోయారు. వలస కార్మికులు పనుల్లేక రోడ్డునపడ్డారు. ఒక్కరా.. ఇద్దరా.. కరోనా వల్ల అందరూ అల్లాడిపోయారు. ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. కరోనా పుణ్యామా అని భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయింది. దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఐతే కొన్ని నెలలగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడింది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కాలంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ అద్భుతంగా పుంజుకుందని వెల్లడించింది. ఐతే ఇంకా పూర్తిగా బయటపడలేదని పేర్కొంది.

2017 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 8.3గా ఉంటే.. 2020లో అది 4కి పడిపోయింది. ఐతే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) బాగా పుంజుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయడింది. వచ్చే ఏడాది భారత జీడీపీ 7.5-12.5 మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. వ్యాక్సినేషన్‌ వేగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, మళ్లీ కరోనా ఆంక్షలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమనం.. వంటి అంశాలే భారత ఆర్థిక వ్యవస్థ గమనన్ని నిర్దేశిస్తాయని ఓ నివేదికలో పేర్కొంది.

''గత ఏడాది పరిస్థితులతో పోల్చితే ఈ ఏడాది భారత్ అద్భుంగా పుంజుకుంది. గత ఏడాది ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అన్ని రకాల వ్యాపారాలు 30- 40శాతం మేర పడిపోయాయి. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న క్లారిటీ అప్పుడు లేదు. కరోనా వ్యాధి పట్ల అనిశ్చితి నెలకొంది. కానీ గత ఏడాదితో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. చాలా రకాల వ్యాపార కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వ్యాక్సిన్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. '' అని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏసియా రీజియన్ చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పటికీ.. ఇంకా కొన్ని గణాంకాల్లో అస్థిరత నెలకొంది ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. రెండేళ్లుగా ఎలాంటి వృద్ధి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని అభిప్రాయపడింది. ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్న కొద్దీ.. ఆర్థిక లోటు కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుటుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక వృద్ధి ఇలాగే కొనసాగితే.. యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, పేదరికం క్రమంగా తగ్గముఖం పడుతుందని అంచనా వేసింది.

First published:

Tags: GDP, Indian Economy

ఉత్తమ కథలు