కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించాయి. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ (Apple) కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home)కి ముగింపు పలకడానికి సిద్ధమైంది. తన ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు వచ్చి పని చేసేలా యాపిల్ ఒక కొత్త విధానం తీసుకొచ్చింది. ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కొత్త హైబ్రిడ్ వర్క్-ఫ్రమ్-హోమ్ విధానం గురించి వివరిస్తూ ఉద్యోగులకు మెయిల్ పంపారు. మంగళవారాలు, గురువారాల్లో ఆఫీస్‌కి రావాలని మెయిల్ ద్వారా కోరారు. మూడో రోజు వ్యక్తిగత బృందాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కొత్త విధానంలో ఉద్యోగులు వారానికి రెండుసార్లు వర్క్ ఫ్రమ్ హోమ్/రిమోట్‌గా పని చేసే అవకాశాన్ని పొందుతారు.
* 5లోగా ఆఫీసులకు రావాలని పిలుపు
టెక్ దిగ్గజం Apple Inc తన ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాలని, నియమించిన డిప్యూటేషన్‌ల నుంచి వారిని పని చేయమని కోరినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. తన ఉద్యోగులు తమ అసలు డిప్యూటేషన్‌లకు తిరిగి రావడానికి గడువును కూడా యాపిల్ నిర్ణయించడం గమనార్హం.
సెప్టెంబర్ 5లోగా ఆఫీసులకు తిరిగి రావాలని కంపెనీ సిబ్బందిని కోరింది. ఈ కొత్త షెడ్యూల్ దాని అసలు షెడ్యూల్‌కి భిన్నంగా ఉంది. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం సోమ, మంగళ, గురువారాల్లో వ్యక్తిగతంగా పని చేయవలసి ఉంటుంది. కొత్త షెడ్యూల్‌లో మాత్రం సోమవారానికి బదులుగా ఇండివిడ్యువల్ టీమ్స్‌పై ఆధారపడి వేరే వారాన్ని నిర్ణయించనున్నారు. కొత్త హైబ్రిడ్ వర్క్ మోడల్ వివరిస్తూ సోమవారం ఉద్యోగులకు కంపెనీ మెయిల్ పంపించడం జరిగిందని రిపోర్ట్ వెల్లడించింది.
* గతేడాదిలోనే మూడు రోజుల పని విధానం
గత ఏడాది జూన్ నుంచే ఈ టెక్ దిగ్గజం ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలోనే మూడు రోజుల పనివిధానాన్ని ప్రకటించింది. కానీ కరోనా సెకండ్, థర్డ్ వేవ్స్ రావడంతో ఆ ప్రణాళికలను అమలు చేయలేదు. దీంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ షెడ్యూల్ రెండు రోజులకే ఉంచాల్సి వచ్చింది. సెప్టెంబర్ ఐదు నుంచి తీసుకొచ్చే కొత్త పాలసీని మొదట తన సిలికాన్ వ్యాలీ ఆఫీసులో ప్రారంభించనుంది.
ఆపై ఇతర బ్రాంచ్‌లలో అమలు చేయనుంది. అయితే, అప్‌డేట్ చేసిన గడువులపై యాపిల్ ప్రతినిధి ఇప్పటి వరకు స్పందించలేదు.వాస్తవానికి యాపిల్ కంపెనీ మే నెలలో కూడా ఆఫీసులకు రావాలని ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చింది. అయితే, దాదాపు 76% మంది కార్మికులు ఆఫీసులకు తిరిగి రావడాన్ని వ్యతిరేకించడంతో అది తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సెప్టెంబర్ నుంచి ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్లాన్ చేస్తుండటంతో ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి వద్దే సౌకర్యంగా పని పని చేసుకుంటున్న వీరు ఇప్పుడు ఆఫీస్‌కి రావాలంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple, Work From Home, Work from office