Work From Home: స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు... నెలకు రూ.40 వేలు సంపాదించొచ్చు

Work From Home | క్యాప్చా కోడ్ ఫిల్ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించొచ్చు. మీకు టైమ్ లిమిట్ ఏమీ ఉండదు. ఎంత సేపైనా పనిచేసుకోవచ్చు. మీకు వీలున్నప్పుడల్లా కంప్యూటర్ ముందు కూర్చొని క్యాప్చా కోడ్ ఫిల్ చేస్తే చాలు. టైపింగ్ స్పీడ్ ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు మీ అకౌంట్‌లో పడ్తాయి.

news18-telugu
Updated: January 11, 2019, 6:09 PM IST
Work From Home: స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు... నెలకు రూ.40 వేలు సంపాదించొచ్చు
చాలామంది నిద్రలేవగానే ఫోన్స్, గ్యాడ్జెట్స్ చూస్తుంటారు. అలా కాకుండా ఓ చిన్న జోక్‌తో మీ మార్నింగ్ మొదలుపెట్టండి.. దీంతో మంచి మూడ్‌తో ఉదయాన్ని ప్రారంభిస్తారు.
  • Share this:
వర్క్ ఫ్రమ్ హోమ్... ఇటీవల ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది. ఇంతకుముందంటే ఇంట్లో కనీసం కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉండాలి. కానీ ఇప్పుడు ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఇంటి దగ్గర కూర్చొనే సంపాదించుకోవచ్చు. మీరు కూడా అలాగే ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? చాలా సులభం. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. క్యాప్చా కోడ్ ఫిల్ చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించొచ్చు. మీకు టైమ్ లిమిట్ ఏమీ ఉండదు. ఎంత సేపైనా పనిచేసుకోవచ్చు. మీకు వీలున్నప్పుడల్లా కంప్యూటర్ ముందు కూర్చొని క్యాప్చా కోడ్ ఫిల్ చేస్తే చాలు. టైపింగ్ స్పీడ్ ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు మీ అకౌంట్‌లో పడ్తాయి.

ఇది కూడా చదవండి: PUBG Mobile: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు చేస్తే నిషేధం తప్పదు

Work From Home: క్యాప్చా కోడ్ అంటే ఏంటీ?


మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసినా, లాగిన్ చేసినా ఓ ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ చూసి అందులో అక్షరాలను కింద ఉన్న బాక్స్‌లో టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు లాగిన్ చేయడం సాధ్యమవుతుంది. దాన్నే క్యాప్చా కోడ్ అంటారు. క్యాప్చా అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్. సిస్టమ్ జెనరేటెడ్ కోడ్ అని కూడా అంటారు. మనిషికీ, మెషీన్‌కు మధ్య తేడాను గుర్తించేందుకు క్యాప్చా కోడ్‌ని ఉపయోగిస్తుంటారు. స్పామ్, హ్యాకర్స్, సైబర్ ఛీటర్స్‌ నుంచి కాపాడేందుకు క్యాప్చాను ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు ఈ క్యాప్చా కోడ్‌ ద్వారానే మీరు డబ్బు సంపాదించొచ్చు.

ఇది కూడా చదవండి: XIAOMI MI LED TV: షావోమీ నుంచి మరో రెండు టీవీలు

Work From Home: క్యాప్చా కోడ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించొచ్చు?


ఇందుకోసం గూగుల్‌లో మీకు చాలా వెబ్‌సైట్లు కనిపిస్తాయి. ముందు మీరు ఏదో ఓ వెబ్‌సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి. క్యాప్చా కోడ్‌ను సరిగ్గా గుర్తుపట్టి ఎలా టైప్ చేయాలో నేర్పే వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు క్యాప్చాను తప్పుగా టైప్ చేస్తే మీకు వచ్చే డబ్బుల్లో కోత పడుతుంది. అందుకే ఒకవేళ మీకు క్యాప్చా సరిగ్గా అర్థం కాకపోతే స్టాప్‌పైన క్లిక్ చేసి మళ్లీ స్టార్ట్ చేయొచ్చు. క్యాప్చా ద్వారా మీరొక్కరే కాదు డబ్బు సంపాదించడం కాదు, మీ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసినా మీకు డబ్బులొస్తాయి.ఇది కూడా చదవండి: WhatApp Stickers: వాట్సప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి

Work From Home: క్యాప్చా కోడ్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి?


మీరు పేమెంట్స్ కోసం PayPal లేదా Payza అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే చాలా వెబ్‌సైట్లు వీటి ద్వారానే పేమెంట్స్ చేస్తుంటాయి. వీటి ద్వారా అయితే మీ అకౌంట్‌లోకి సులువుగా డబ్బులు వస్తాయి.

ఇది కూడా చదవండి: REDMI NOTE 7: 48 మెగాపిక్సెల్ కెమెరాతో లాంఛైన షావోమీ రెడ్‌మీ నోట్ 7

Work From Home: క్యాప్చా కోడ్ ద్వారా వర్క్ ఇస్తున్న వెబ్‌సైట్లు


మీరు కూడా క్యాప్చా కోడ్ ఫిల్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఇందుకోసం చాలా వెబ్‌సైట్లు ఉన్నాయి. MegaTypers, CaptchaTypers, ProTypers, Captcha2Cash, 2Captcha, Qlinkgroup, VirtualBee... ఇవన్నీ క్యాప్చా కోడ్ వర్క్ ఇస్తున్న వెబ్‌సైట్‌లే. అయితే వీటిలో అకౌంట్ ఓపెన్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండీషన్స్ పూర్తిగా చదవండి. ఆ తర్వాత రిజిస్టర్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

మొబైల్ వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? మీరేం చేయాలో తెలుసుకోండి

Fake Apps: 85 యాప్స్ తొలగించిన గూగుల్... అవి మీ దగ్గరున్నాయా?
Published by: Santhosh Kumar S
First published: January 11, 2019, 5:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading