హోమ్ /వార్తలు /బిజినెస్ /

Budget 2021: బడ్జెట్‌పై Work From Home ఉద్యోగుల ఆశలు.. గుడ్ న్యూస్ ఉంటుందా ?

Budget 2021: బడ్జెట్‌పై Work From Home ఉద్యోగుల ఆశలు.. గుడ్ న్యూస్ ఉంటుందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Budget 2021: కరోనాతో వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరగడంతో వారికి ఊరటనిచ్చే దిశగా బడ్జెట్ ప్రతిపాదన ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా వేతనజీవులు ఈ 5 అంశాలపై ఆశలు పెట్టుకున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. నిజానికి గతంలో వచ్చిన బడ్జెట్లు ఒక ఎత్తయితే.. ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మరో ఎత్తు.. ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ కుదేలు చేసింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వస్తున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందర్లోనూ అంచనాలు పెరిగాయి. దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, వ్యక్తిగత ఆదాయాన్ని పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను గాఢిలో పెట్టడానికి ఈ బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వేతన జీవులకు ఈ బడ్జెట్లో తమకు ఊరటనిచ్చే నిరణయాలుంటాయని ఆశలు పెట్టుకున్నారు. కరోనాతో వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరగడంతో వారికి ఊరటనిచ్చే దిశగా బడ్జెట్ ప్రతిపాదన ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా వేతనజీవులు ఈ 5 అంశాలపై ఆశలు పెట్టుకున్నారు. అవేంటో చూద్దాం.

వేతన జీవుల డిమాండ్లు..

1. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయం తగ్గడం, వైద్య ఖర్చులు పెరగడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు అనగా వేతన జీవులకు ఉపశమనం కలిగించేలా పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

2. రాబోయే బడ్జెట్ 2021 లో స్టాండర్డ్ డిడెక్షన్ను లిమిట్ను మరింత పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. 2018–19 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన స్టాండర్డ్ డిడెక్షన్ మెడికల్, ట్రాన్స్పోర్ట్ అలెవెన్స్ పరిమితిని పెంచింది. తద్వారా ఉద్యోగస్తుడు లేదా పెన్షనర్ వారి ఆదాయం నుండి రూ .40,000 వరకు స్టాండర్డ్ డిడెక్షన్ను పొందాడు. ఈ క్రిందటి ఈ లిమిట్ను రూ .50 వేలకు పెంచారు. రాబోయే బడ్జెట్లో దీన్ని మరింత పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు.

3. హోమ్ లోన్ ప్రిన్సిపాల్ అమౌంట్పై ప్రస్తుతం అమలు చేస్తున్న రూ .1.50 లక్షల పన్ను మినహాయింపును సెక్షన్ 80 సితో కలపకుండా ప్రత్యేక సెక్షన్ కింద అందించాలని కోరుతున్నారు.

4.- ప్రస్తుతం, ఉన్న నిబంధనల ప్రకారం వేతన జీవులు సెక్షన్ 80 సి కింద, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్స్ వంటి వివిధ చెల్లింపులపై రూ .1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందటానికి అర్హుత కలిగి ఉన్నారు. అయితే, ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, ఈ పన్ను మినహాయింపు ఏ మాత్రం సరిపోదు.. దీన్ని రూ .2.5-3 లక్షల వరకు పెంచాలని వారు కోరుతున్నారు.

5. కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భీమా తప్పనిసరి అయ్యింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, ఆరోగ్య బీమా అవసరం గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా రక్షణను తప్పనిసరి చేశాయి. అందువల్ల, సెక్షన్ 80 డి కింద ఆరోగ్య బీమా ప్రీమియంలపై లభించే పన్ను మినహాయింపును పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Budget 2021, Union Budget 2021, Work From Home

ఉత్తమ కథలు