BSNL: బీఎస్ఎన్ఎల్ ఉచిత ప్లాన్ గడువు పెంపు

BSNL Work@Home plan | బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త. లాక్‌డౌన్ కారణంగా యూజర్లకు ఉచితంగా అందిస్తున్న ప్లాన్ గడువును పెంచింది బీఎస్ఎన్ఎల్.

news18-telugu
Updated: May 29, 2020, 10:41 AM IST
BSNL: బీఎస్ఎన్ఎల్ ఉచిత ప్లాన్ గడువు పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL ఉచితంగా అందిస్తున్న వర్క్ ఎట్ హోమ్ ప్లాన్ గడువును పొడిగించింది. ల్యాండ్ లైన్ యూజర్లకు 'వర్క్ ఎట్ హోమ్' పేరుతో ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందిస్తోంది బీఎస్ఎన్ఎల్. వాస్తవానికి ఈ ప్లాన్ గడువు ఇప్పటికే ముగిసింది. కానీ కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో 2020 జూన్ 20 వరకు ఈ ప్లాన్‌ను పొడిగించింది. యూజర్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది బీఎస్ఎన్ఎల్‌కు చెందిన ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. మార్చి 20న Work@Home పేరుతో ప్రారంభమైంది. ఇది ఫ్రీ ప్లాన్. యూజర్లు ఉచితంగానే ఈ ప్లాన్ వాడుకోవచ్చు. అయితే మొదట ఒక నెల వేలిడిటీతో ఈ ప్లాన్ ప్రారంభించింది బీఎస్ఎన్ఎల్‌. దీంతో ఏప్రిల్ 19న గడువు ముగిసింది. కరోనా వైరస్ సంక్షోభం కొనసాగడంతో మే 19 వరకు గడువు పొడిగించింది. ఆ గడువు కూడా ముగియడం, లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో జూన్ 20 వరకు గడువు పెంచింది.

BSNL Work@Home Plan: బీఎస్ఎన్ఎల్ వర్క్ ఎట్ హోమ్ ప్లాన్ లాభాలివే



బీఎస్ఎన్ఎల్ వర్క్ ఎట్ హోమ్ ప్లాన్ ఇప్పటికే ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ లాంటివేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కస్టమర్ల దగ్గర మోడెమ్ ఉంటే చాలు. యూజర్లు ఉచితంగానే ఈ ప్లాన్ పొందొచ్చు. 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజూ 5 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. 5 జీబీ డేటా పూర్తిగా వాడేసిన తర్వాత స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఒకవేళ మీరు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఉపయోగిస్తున్నట్టైతే బీఎస్ఎన్ఎల్ వర్క్ ఎట్ హోమ్ ప్లాన్‌కు దరఖాస్తు చేయొచ్చు. 1800-345-1504 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఇక బీఎస్‌ఎన్ఎల్ నుంచి తక్కువ ధరకే భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో మరో ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ గడువును మార్చి 31 నుంచి జూన్ 29 వరకు ఇప్పటికే పొడిగించింది బీఎస్ఎన్ఎల్. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.499 మాత్రమే. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకున్నవారికి 20ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100జీబీ డేటా లభిస్తుంది. ఆ తర్వాత స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గిపోతుంది. 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అంతేకాదు... ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఐఎస్‌డీ కాల్స్‌కి నిమిషానికి రూ.1.20 ఛార్జీ చెల్లించాలి.

ఇవి కూడా చదవండి:

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.2 ధరకే ప్లాన్

Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవేAirtel: ఎక్కువ డేటాతో ఎయిర్‌టెల్ ప్రకటించిన కొత్త ప్లాన్స్ ఇవే...
First published: May 29, 2020, 10:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading