‘నా సినిమా తీసుకోరా?’: అమెజాన్‌పై రూ.485 కోట్ల దావా వేసిన డైరెక్టర్

బ్లూ జాస్మిన్, మిడ్ నైట్ పారిస్, టు రోమ్ విత్ లవ్ వంటి సినిమాలు తీసిన హాలీవుడ్ దర్శకనటుడు ఊడీ అలెన్ అమెజాన్ కంపెనీ మీద ఈ పిటిషన్‌ను ఫైల్ చేశాడు.

news18-telugu
Updated: February 8, 2019, 10:28 PM IST
‘నా సినిమా తీసుకోరా?’: అమెజాన్‌పై రూ.485 కోట్ల దావా వేసిన డైరెక్టర్
బ్లూ జాస్మిన్, మిడ్ నైట్ పారిస్, టు రోమ్ విత్ లవ్ వంటి సినిమాలు తీసిన హాలీవుడ్ దర్శకనటుడు ఊడీ అలెన్ అమెజాన్ కంపెనీ మీద ఈ పిటిషన్‌ను ఫైల్ చేశాడు.
  • Share this:
ఆన్ లైన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఓ హాలీవుడ్ డైరెక్టర్ దావా వేశాడు. తనతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను సరైన కారణాలు చూపకుండా రద్దు చేసినందుకు తనకు పరిహారంగా 68 మిలియన్ అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.485 కోట్లు) ఇవ్వాలని దావా వేశాడు. బ్లూ జాస్మిన్, మిడ్ నైట్ పారిస్, టు రోమ్ విత్ లవ్ వంటి సినిమాలు తీసిన హాలీవుడ్ దర్శకనటుడు ఊడీ అలెన్ అమెజాన్ కంపెనీ మీద ఈ పిటిషన్‌ను ఫైల్ చేశాడు.

amazon, online order, amazon scam, online commerce, online parcels, gadgets on amazon, amazon customer returns, amazon returns, అమెజాన్, ఆన్ లైన్ మోసాలు, క్రైమ్, నేరాలు
ప్రతీకాత్మక చిత్రం


ఊడీ అలెన్ మొదట్లో అమెజాన్ స్టూడియోస్‌లోనే పనిచేసేవాడు. 2016లో అతడు తీసిన కేఫ్ సొసైటీ సినిమా హక్కులను అమెజాన్ కొనుక్కుంది. 2017లో ఊడీ అలెన్ దర్శకత్వంలో వండర్ వీల్ అనే సినిమాను నిర్మించింది. ఆ తర్వాత ఊడీ అలెన్‌ ప్రొడక్షన్ హౌస్‌తో నాలుగు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 2018 జూన్‌లో తమ డీల్‌ను రద్దు చేసుకుంది.

అడల్ట్ సీన్లు తొలగిస్తున్న అమెజాన్ ప్రైమ్ | Amazon Prime Video self-censoring adult scenes in movies
అమెజాన్


తనకు సరైన కారణం చెప్పకుండా తన కాంట్రాక్ట్ రద్దు చేయడంతో ఊడీ అలెన్ లా సూట్ ఫైల్ చేశాడు. అయితే, ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకోవడానికి పాతికేళ్ల నాటి వివాదాన్ని సాకుగా చూపిస్తోందంటూ అలెన్ తరఫున ఫైల్ అయిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, అది పాత వివాదమని, ఆ విషయం అమెజాన్‌తోపాటు ప్రపంచం మొత్తానికీ తెలుసని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.
First published: February 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading