Saving Schemes | భవిష్యత్ భరోసా కోసం ఇప్పటి నుంచే డబ్బులు (Money) ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? భవిష్యత్ అవసరాలు ఎలా ఉంటాయో తెలీదు. అందుకే మీరు అధిక మొత్తం లక్ష్యంగా ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. మగ వారు అయితే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) వంటి వాటిల్లో ఎక్కువగా డబ్బులు పెడుతూ ఉండొచ్చు. మహిళలు అయితే బంగారం (Gold), ఫిక్స్డ్ డిపాజిట్లు (FD), స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వంటి వాటిల్లో ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.
అయితే ప్రస్తుత కాలంలో మహిళల ఇన్వెస్ట్మెంట్ ప్రాధాన్యాలు కూడా మారిపోయాయి. చాలా మంది తొలిగా బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో డబ్బులు దాచుకుంటూ ఉండొచ్చు. అయితే మంచి రాబడి పొందాలని భావిస్తే.. మాత్రం ఇతర ఆప్షన్లలో కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి శుభవార్త.. అకౌంట్లలోకి రూ.81 వేలు.. వచ్చాయో లేదో చెక్ చేసుకోండిలా
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా డబ్బులు పెట్టొచ్చు. అధిక రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఉంటే.. ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కారు కొనుగోలు వంటి లక్ష్యాలు కలిగిన వారు ఈ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఎంచుకోవచ్చు. ఇందులో మల్టీపుల్ అసెట్ కేటగిరిలు ఉంటాయి. అందువలల్ల ఇందులో కూడా డబ్బులు దాచుకోవచ్చు.
శుభవార్త.. రూ.2 వేలు పతనమైన బంగారం ధర.. నెల రోజుల్లోనే భారీగా దిగొచ్చిన గోల్డ్!
ఇకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. అయితే రాబడి కూడా ఎక్కువగాన ఉంటుంది. పిల్లల పెళ్లి వంటి దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాలు కలిగిన వారు ఈ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఇంకా బంగారంలో కూడా డబ్బులు పెట్టొచ్చు. చాలా మంది మహిళలకు బంగారమే తొలి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం బంగారం కొనుగోలు చాలా ఈజీ అయిపోయింది. మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తే.. చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో డిజిటల్ గోల్డ్ కూడా ఒకటి. ఇంట్లో నుంచే మీ ఫోన్ ద్వారా డిజిటల్ గోల్డ్‌లో డబ్బులు పెట్టొచ్చు. వచ్చే ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందువల్ల బంగారంలో డబ్బులు పెడితే మంచి రాబడి పొందొచ్చు. పసిడిని సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనంగా పరిగణిస్తారు. అందువల్ల ఆర్థిక మాంద్యం వంటి భయాల నేపథ్యంలో పసిడిలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు. స్వల్ప కాల లక్ష్యాల కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Investment Plans, Investments, Money, Women