Home /News /business /

WOMEN PREFER BITCOIN MEN TRADED PARTIAL TO SHIBA INU WAZIRX 2021 SURVEY FINDS GH VB

WazirX Survey: మహిళల ప్రాధాన్యం బిట్‌కాయిన్‌, మగవాళ్లకు షిబా ఇను.. భారీగా పెరిగిన క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్రిప్టోలను ఎంచుకున్న మగవాళ్ల సంఖ్య 829 శాతం వృద్ధి చెందగా, కొత్త మహిళా వినియోగదారుల సంఖ్య 1009 శాతం పెరిగింది. మహిళలు ఎక్కువగా బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ చేస్తున్నారని, మగవాళ్లు మాత్రం షిబా ఇనులో ఎక్కువగా ట్రేడింగ్ చేశారని నివేదిక పేర్కొంది.

ఇంకా చదవండి ...
భారత్‌లో క్రిప్టో కరెన్సీలపై చాలామంది ఆసక్తి చూపుతున్నట్లు గతంలో ఎన్నో నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా సర్వే చేసింది గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ బినాన్స్ (Binance) ఆధ్వర్యంలోని వజీర్ ఎక్స్ (WazirX) ప్లాట్‌ఫాం. 2021లో $43 బిలియన్లకు పైగా ట్రేడింగ్ వాల్యూమ్‌ సాధించినట్లు సంస్థ తాజా నివేదికలో తెలిపింది. బిట్‌కాయిన్ (BTC), టెథర్ (USDT), షిబా ఇను (SHIB), డాగీ కాయిన్ (DOGE), వజీర్‌ఎక్స్ టోకెన్ (WRX), మాటిక్ (MATIC) వంటి వర్చువల్ కరెన్సీలు తమ ఎక్స్ఛేంజ్‌లో అత్యధికంగా ట్రేడ్ అయిన క్రిప్టోలుగా నిలిచాయని పేర్కొంది. బెంగళూరుకు చెందిన ఈ క్రిప్టో ఎక్స్ఛేంజ్.. భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన బిట్‌కాయిన్ & క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌గా గుర్తింపు సాధించింది.

Chromebook Laptops: తక్కువ ధరకే క్రోమ్‌బుక్స్.. రూ.30వేల లోపు లభిస్తున్న మోడళ్లు ఇవే..


ఇప్పటికే తాము 10 మిలియన్ల యూజర్ బేస్‌ను అధిగమించినట్లు వజీర్ ఎక్స్ పేర్కొంది. "హైలైట్స్ & అబ్జర్వేషన్స్ ఫ్రమ్ 2021: ది ఇయర్ ఆఫ్ క్రిప్టో" పేరుతో విడుదల చేసిన నివేదికలో మరిన్ని వివరాలు పంచుకుంది. వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలు క్రోడీకరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది, తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలు సూచనలతో క్రిప్టోలను ఎంచుకున్నట్లు తెలిపారు. తమ మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో క్రిప్టోలు 10 శాతం వరకు ఉంటాయని 44 శాతం మంది చెప్పారు.

Ambulance Driver: అతడు ఒక అంబులెన్స్ డ్రైవర్.. ఉదయం లేవగానే కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే..


యూజర్ బేస్ పరంగా చూస్తే, క్రిప్టోలను ఎంచుకున్న మగవాళ్ల సంఖ్య 829 శాతం వృద్ధి చెందగా, కొత్త మహిళా వినియోగదారుల సంఖ్య 1009 శాతం పెరిగింది. మహిళలు ఎక్కువగా బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ చేస్తున్నారని, మగవాళ్లు మాత్రం షిబా ఇనులో ఎక్కువగా ట్రేడింగ్ చేశారని నివేదిక పేర్కొంది. వజీర్ ఎక్స్‌లో క్రిప్టోలో ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌ చేసేవారిలో 66 శాతం మంది 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారని తెలిపింది. సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది, క్రిప్టో స్పేస్‌లో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తిని చూపించారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఫైనాన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ వంటి కెరీర్ ఆప్షన్లను తాము ఎంచుకుంటామని చెప్పారు.

మెట్రో నగరాలు, టైర్-I నగరాలలో పాటు చిన్న నగరాల నుంచి సైతం క్రిప్టోలను ఎక్కువమంది ఎంచుకుంటున్నారని వజీర్ ఎక్స్ నివేదిక తెలిపింది. గౌహతి, కర్నాల్, బరేలీ వంటి చిన్న నగరాల నుంచి వీటిలో పాల్గొనేవారి సంఖ్య 700 శాతం పెరిగిందని పేర్కొంది. అలాగే 2021లో WazirX NFT మార్కెట్‌ప్లేస్ గణనీయంగా వృద్ధి చెందినట్లు వెల్లడించింది. టాప్ ట్రేడింగ్ NFTలలో.. Mvmnt కలెక్షన్స్, క్రిప్టో కరాడి కలెక్షన్స్, క్రిప్టో మాంక్స్ & మెటావస్సీ కలెక్షన్ - అభిషేప్స్, యష్ షైట్ - సైబర్ మిథిక్స్, మిలాన్‌జార్ట్ - సైబర్ స్కల్ ఫోర్స్ కలెక్షన్ వంటివి ఉన్నాయి.

Mega Medical Camp: ఆ ప్రాంతంలో మెగా వైద్య శిబిరం నిర్వహణ.. పోలీసు బందోబస్తు నడుమ ఏర్పాటు..


ఈ రిపోర్టుపై WazirX CEO నిశ్చల్ శెట్టి మాట్లాడుతూ.. ప్రజలు క్రిప్టోను అభివృద్ధి చెందుతున్న ప్రత్యామ్నాయ అసెట్ క్లాస్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. క్రిప్టోల కోసం ప్రభుత్వం నియంత్రిత విధానాన్ని తీసుకువస్తే మేలు జరుగుతుందన్నారు. అయితే క్రిప్టో నియంత్రణ బిల్లు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని మీడియా నివేదికలు చెబుతున్నాయి. 2022 జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Bitcoin, Cryptocurrency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు