హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan Documents: ఈ పత్రాలు ఉంటేనే హోం లోన్.. లేదంటే రుణం కష్టమే

Home Loan Documents: ఈ పత్రాలు ఉంటేనే హోం లోన్.. లేదంటే రుణం కష్టమే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హోమ్ లోన్ తీసుకోవాలంటే తప్పక ఉండాల్సిన డాక్యుమెంట్లు ఏవో చూద్దాం. 

రిజర్వ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్రవ్య విధానం సమీక్ష నిర్వహించినప్పుడల్లా వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను పెద్దగా మార్చలేదు. కాబట్టి భవిష్యత్తులో హోంలోన్ రేట్లు ప్రభావితం కావు. ప్రస్తుతం అనేక రుణ సంస్థలు అతి తక్కువ వడ్డీకే (7 శాతం కంటే తక్కువకే) గృహ రుణాలను అందిస్తున్నాయి. దీంతో చాలా మంది కొనుగోలుదారులు తక్కువ వడ్డీరేటుకే హోంలోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే రుణం తీసుకునేందుకు చట్టబద్ధత, ప్రామాణికత కోసం మీరు తప్పకుండా కొన్ని కీలక పత్రాలను తనిఖీ చేసుకోవాలి. అలాగే అన్నీ ఆస్తి పత్రాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ తీసుకోవాలంటే తప్పక ఉండాల్సిన డాక్యుమెంట్లు ఏవో చూద్దాం.

చెయిన్ ఆఫ్ టైటిల్ డాక్యుమెంట్..

ఈ జాబితాలో అత్యంత ముఖ్యమైన పత్రం చెయిన్ ఆఫ్ టైటిల్ డాక్యుమెంట్. విక్రేత ప్రామాణికతను, ఆస్తి అసలు యజమాని బదిలీ చేసే హక్కులు కలిగి ఉన్నాడనే వాస్తవాన్ని ఇది నిర్ధారిస్తుంది. ఓ వ్యక్తి నుంచి మరొకరికి ఎలా హక్కులను బదిలీ చేయాలో గుర్తిస్తుంది. ట్రాన్స్ ఫర్ కోసం స్పష్టమైన టైటిల్ చెయిన్ లేనప్పుడు.. లోన్‌ కోసం దాన్ని పరిగణనలోకి తీసుకోరు.

MAP లేదా ఆమోదించిన ప్లాన్..

నిబంధనల ప్రకారం ఆస్తి నిర్మితమైందా లేదా అని మీరు తెలుసుకోవాలి. చాలా మంది రుణదాతలు ఈ పత్రాలు లేకుండా రుణాన్ని ఆమోదించరు. అయితే నిర్మాణ కార్యకలాపాలు అనధికారికంగా ఉండవచ్చు. బిల్డింగ్ ప్లాన్ ప్రకారం ప్రాపర్టీ అధికారికమా లేదా అనధికారమా అనే విషయాన్ని ఈ డాక్యుమెంట్ నిర్ధారిస్తుంది. స్థానిక అభివృద్ధి అథారిటీ లేఔట్ ప్రణాళికను పంపుతారు. కాబట్టి ఇవి మిస్ అయినట్లయితే రుణదాత రుణాన్ని ఆమోదించరు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి ఓ డెవలపర్ నేరుగా ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు రుణ సంస్థ MAPని అడగకపోవచ్చు.

అలాట్మెంట్ లెటర్, స్వాధీన ధ్రువీకరణ పత్రం..

మీరు హౌసింగ్ సొసైటీలో లేదా హౌసింగ్ బోర్డు లేదా ప్రైవేటు బిల్డర్ నుంచి అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తే మీరు అలాట్మెంట్ లెటర్, స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని అందించమని విక్రేతను అడగాలి. హౌసింగ్ బోర్డు లేదా బిల్డర్ నుంచి నేరుగా ఆస్తిని కొనుగోలు చేసేవారికి ఈ అలాట్‌మెంట్ లెటర్‌ను ముందు అందిస్తారు. అయితే ఆస్తి పూర్తయిన తర్వాత స్వాధీన ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

ఖాటా(Khata), మ్యూటేషన్ రిజిస్టర్..

ప్రాపర్టీ రకం, ప్రాంతం ఆధారంగా అదనపు పత్రాలు అవసరం కావచ్చు. ఖాటా సర్టిఫికెట్, మ్యూటేషన్ రిజిస్టర్ ఎక్స్ ట్రాక్ట్స్.. వంటి వాటిని స్థానిక రెవిన్యూ కార్యాలయాలు జారీ చేస్తాయి. అమ్ముతున్న ఆస్తిని కొనడానికి మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇది అవసరమవుతుంది. దేశంలో చాలా ప్రాంతాల్లో బ్యాంకులు దీన్ని అడుగుతాయి.

రుణభారం పత్రం (Encumbrance certificate)..

ఆస్తిపై రుణం మంజూరు చేయడానికి.. ముందు రుణదాతలు ఆస్తిపై బకాయిలు లేవని నిర్ధారించడానికి ఈ పత్రాన్ని అడుగుతారు. కొంత కాలానికి సంబంధించిన ఆస్తి లావాదేవీల వివరాలు ఇందులో ఉంటాయి. ఆస్తికి చట్టబద్ధమైన బకాయిలు లేదా తనఖాలు లేవని నిరూపించడానికి ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ అవసరమవుతుంది.


సొసైటీ బకాయిలు, పన్ను రసీదులు..

సొసైటీ మెయింటెనెన్స్ ఛార్జీలు, మున్సిపల్ టాక్స్ చెల్లించడం తదితర రసీదులను కూడా రుణ సంస్థలు అడగవచ్చు. ఈ రసీదులు ద్వంద్వ ప్రయోజనానికి ఉపయోగపడతాయి. అయితే వీటితో పాటు రుణాలు ఇచ్చే సంస్థలు ఇతర పత్రాలను కూడా అడగవచ్చు.

First published:

Tags: Home loan

ఉత్తమ కథలు